Wednesday 19 July 2017

మంగళ్ పాండే గురించి చిన్న కథ



మంగళ్ పాండే- ఈ పేరు వినని భారతీయుడు ఉండడు. 1857 లో తొలి స్వాంతంత్ర సంగ్రామంలో (అది కేవలం తిరిగుబాటు కాదని రాజీవ్ దీక్షిత్ వివరించారు) కీలకపాత్ర పోషించిన వ్యక్తి. వీరు 19 జూలై 1827 లో నగ్వా గ్రామం, ఎక్కువ బల్లియా జిల్లా, అవధ్ ప్రాంతం, ఉత్తర్‌ప్రదేశ్‌లో, సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వారి పేదరికమే వారిని బ్రిటీష్ సైన్యంలో చేరేందుకు ప్రేరేపించింది. అయితే వారి జీవితాన్ని మలుపు తప్పిన ఒక సంఘటన గురించి నేను చిన్నప్పుడు చదివాను. అది -

ఒకనాడు బ్రిటీష్ రైఫిల్స్‌లో మండుగుండు పెట్టి, వాటిని ఉపయోగించడానికి ఆవు మాంసపు కొవ్వు, పంది మాంసపుకొవ్వు ఉపయోగించేవారు. ఆ కొవ్వును సైనికులు నోటితో కొరకాల్సి ఉంటుంది...... ఒకసారి మంగళ్ పాండే ఒక గ్రామం ద్వారా వెళుతుండగా వారికి దాహం వేసింది. దగ్గరలో ఒక స్త్రీ బావిలో నీరు తోడుతుండటం చూసి, అక్కా! నాకు దాహంగా ఉంది, కాస్త నీరు ఇస్తావా అని అడిగారు. దానికి బదులుగా ఆ వనితా, తమ్ముడూ! నువ్వు బ్రిటీష్ సైన్యంలో పనిచేస్తున్నావు. గోమాత మాంసపు కొవ్వును నీ నోటితో స్పృశిస్తావు. గోవు ఎంతో పవిత్రమైనది. నీకు నీరిస్తే, నీరు కూడా అపవిత్రమవుతుంది. క్షమించు తమ్ముడూ అని చెప్పిందట. అది మంగళ్ పాండే లో ఆలోచనను రగిలించింది. అదే క్రమంగా బ్రిటీష్ వారిపై తిరుగుబాటుకు కారణమయ్యింది.

1857 లో జరిగిన ఆ పోరాటం కారణంగా 300 పట్టణాలకు భారతీయులు స్వాతంత్రం సాధించగలిగారు. ఆ తిరుగుబాటులో ఆంగ్లేయుల తలలు నరికారు భారతీయ వీరులు. కానీ కొందరు రాజుల కుట్రల కారణంగా ఉచ్చు మరింత బిగిసి ఆంగ్లేయులు ఇంకో 90 ఏళ్ళ పాటు పాలించే అవకాశం దక్కిందని రాజీవ్ దీక్షిత్ తన ఉపన్యాసంలో చెప్పారు.

అటు తర్వాత 8 ఏప్రియల్ 1857 లో మంగళ్ పాండేను బ్రిటీష్ వారు ఊరిదీశారు. 

No comments:

Post a Comment