Monday 10 July 2017

సురక్షిత భారత్ కోసం చైనాను ముక్కలు చేయాలి

భారతీయులు ఇప్పుడేమీ చేయాలి?

ఢోకలాం లో సరిహద్దు వివాదం, సిక్కిం వద్ద నాథూలా పాస్ నుంచి మానససరోవర యాత్రకు వెళ్ళకుండా మార్గం మూసివేయడం, చైనా తరచూ భారతభూభాగంలోకి చొరబడటం, అరుణాచల్ ప్రదేశ్ ను తనదిగా చెప్పుకోవడం వంటివి చూసినప్పుడు ప్రతి భారతీయుడికి కోపం కలగకుండా ఉండదు. అయినా మళ్ళీ మామూలే. మనం చైనా వస్తువులే కొని మన మీద యుద్ధం చేయడానికి మనమే డబ్బు సమకూర్చుతాము. ఈ మధ్య చైనా చెప్పినవి చూస్తే సిగ్గు, రోషం ఉన్న ప్రతి భారతీయుడు కఠినంగా ఆలోచిస్తాడు. భారత్‌ను అవమానపరుస్తూ చైనా పత్రికలు కొన్ని వ్యాసాలు రాశాయి, అంతటితో ఆగక, భూటన్- చైనా వివాదంలో తలదూర్చితే సిక్కిం ను వివాదాస్పద ప్రాంతంగా గుర్తించి, ఆ ప్రాంతాన్ని భారత్ నుంచి వేరు చేయడానికి అక్కడ వేర్పాటువాదులకు సహాయం చేసి, అండగా ఉంటామని చైనా ప్రకటించింది. నిజానికి భూటాన్‌కు దౌత్యపరమైన అన్ని విషయాలు భారత్ చూసుకోవాలని, మనకు భూటాన్‌కు మధ్య ఒప్పందం ఉంది. అందుకే భూటన్‌కు భారత రక్షణగా నిలుస్తోంది. చాలాకాలం క్రితమే పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి చైనా ఆక్సాయి చిన్ అనే భూభాగాన్ని తన అధీనంలోకి తీసుకుంది. నిజానికి అది భారత భూభాగం, రక్షణ పరంగా అత్యంత కీలక ప్రాంతం. ఇప్పుడు భూటాన్, సిక్కిం వద్దనున్న ఢోకలాం ప్రాంతం కూడా అలాంటిదే. భూటాన్ కు చెందిన దాన్ని కనుక చైనా ఆక్రమించుకుంటే, భారత సైన్యంలో కదిలికలను నిశితంగా గమనించే అవకాశం చైనాకు కలుగుతుంది, సిక్కిం ను ఆక్రమించుకునే అవకాశం దక్కుతుంది. సిక్కింను చైనా ఆక్రమించుకుంటే ఆ తర్వాత మెల్లిమెల్లిగా వేర్పాటు ఉద్యమాలను ప్రోత్సహించిం మొత్తం ఈశాన్య భారతాన్ని వశం చేసుకోవాలని చైనా పన్నాగం. ఇదేకాక ఇప్పుడు చైనా ఇంకో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అవసరమైతే పాకిస్థాన్ కు సహాయం చేస్తామని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోనే కాకుండా భారత్ ఆధీనంలో ఉన్న #కాశ్మీర్ లో కూడ చైనా సైన్యాన్ని దించుతామని హెచ్చరికలు చేస్తోంది. ఇది భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను ప్రశ్నించడమే.

మనకు చైనాకు యుద్ధం వస్తే నష్టం భారీగానే ఉంటుంది. కానీ యుద్ధం రాకుండా ఆపే శక్తి కలిసికట్టుగా పని చేయగలిగితే భారతీయులందరికి ఉంది. చైనాకు 130 కోట్ల వినియోగదారులు కల అతిపెద్ద వ్యాపర మార్కెట్ భారత్. ఆ మార్కెట్ కోల్పోతే చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. ఎందుకంటే చైనాకు ఎగుమతుల మీద ఆధారపడి బ్రతుకుతున్న దేశం. భారత్ తన సొంత మార్కెట్ మీద ఆధారపడి ఉంది. కనుక చైనాకు మనం హెచ్చరికలు ఇవ్వాలంటే చైనా వస్తువులను బహిష్కరించాలి. చైనా వస్తువులు ఎవరింట్లో లేవండి అనకండి. ఇంతకముందే కొన్న చైనా వస్తువులను కాల్చమని చెప్పడంలేదు, కొత్తగా మనం చైనా వస్తువులు కొనకుండా ఉంటే చాలు. ఒక్క నాలుగు నెలలు చైనా వస్తువులు కొనడం ఆపేయండి. నిజానికి గతేడాది ఎన్.ఎస్.జి.లో భారత సభ్యత్వానికి చైనా మొకాలడ్డిందని భారతీయులు నిరశనగా చైనా వస్తువులను బహిష్కరించారు. చైనా టపాసులు కూడా కొనలేదు. అది విజయవంతం అయ్యింది. చైనా ఆ విషయంలో ఎంతో ఖంగుతిన్నదని పత్రికల్లో వచ్చింది. ఇప్పుడు కూడా మనం అదే చేయాలి. నిజానికి కేవలం చైనా వస్తువులను బహిష్కరిస్తే సరిపోదు. కాని ఇది మాత్రమే శీఘ్ర ప్రతిస్పందన (Instant reaction) ను తెలియజేస్తుంది. మనం Made in China అని ఉంటే కొనట్లేదని, కొన్ని సార్లు Made in PRC అని వేసి అమ్మేస్తున్నారు. కొన్నిసార్లు Made in India  అనే అట్టపెట్టెల్లో పెట్టి అమ్మేస్తున్నారు. మనం జాగ్రత్తగా గమనించి కొనాలి. నిజానికి మనిషికి కావలసిన ఆహారం, బట్టలు మొదలైనవి మనదేశంలో కూడా ఉత్పత్తి అవుతున్నాయి. చైనా వస్తువులు కొనకపోతే మనమే చచ్చిపోమని గుర్తుంచుకోండి.

ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించాలి. యుద్ధానికి సిద్ధమని చెప్పడం ఒక్కటే సరిపోదు, ఒకే చైనా విధానానికి (One china policy) స్వస్తి పలకాలి. టిబెట్ ను 1950లో, ఆ తర్వాత హాంగ్‌కాంగ్‌ను చైనా ఆక్రమించింది. టిబెట్ బౌద్ధ దేశం, భారత్ అంటే ఎనలేని గౌరవం ఉన్న దేశం. నిజానికి అప్పుడు మనం టిబెట్ కు సాయం చేసి ఉండాల్సింది. ఈనాటికి టిబెట్ కు స్వాతంత్రం ఇవ్వాలని అక్కడ పోరాటాలు జరుగుతున్నాయి, దలైలామా భారత్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. మనం దలైలామాను అధ్యక్షునిగా భారత్ లోనే టిబెట్ ప్రభుత్వాన్ని (Government in Exile) ఏర్పాటు చేసి, తక్షణమే అక్కడ వేర్పాటు ఉద్యమాన్ని ప్రోత్సహించాలి. ప్రతి భారతీయుడు చైనాలో వేర్పాటు ఉద్యమాలకు మద్దతు పలకాలి. టిబెట్ చైనా నుంచి వేరుపడితే మనకు ఎన్నో సమస్యలు తీరిపోతాయి. బ్రహ్మపుత్ర నది మీద ఆనకట్టలు కట్టి ఉత్తరచైనాకు నీటిని తరలిస్తోంది, ఫలితంగా ఈశాన్య భారతంలో వరదలు, లేదంటే కరువు, తరచుగా ఏదో ఒకటి సంభవించి జన నష్టం జరుగుతూనే ఉంటుంది. టిబెట్ సరిహద్దు నుంచి భారత్ పై కవ్వింపులకు దిగుతోంది. టిబెట్ ను మనం విడగొడితే చైనా సగానికి చీలిపోతుంది. అపారమైన సహజ వనరులున్న టిబెట్ భారత మిత్ర దేశంగా అవిర్భవిస్తుంది. అప్పుడు మనకూ- చైనాకు చిన్న సరిహద్దు మాత్రమే మిగులుతుంది. అది కూడా కాశ్మీర్ లో. నీటి కరువు కారణంగా చైనా ఆర్థికంగా చితికిపోతుంది. అలాగే హాన్‌కాంగ్‌లో జరిగే పోరాటానికి మనం మద్దతు పలకాలి. చైనా, టిబెట్, హాంగ్‌కాంగ్‌లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలను ఐక్యరాజ్యసమితి వంటి వేదికల మీద గట్టిగా వినిపించి, చైనాను కోలుకోలేని దెబ్బకొట్టాలి. చైనా, టిబెట్ ప్రాంతం మీదుగా నేపాల్‌లో మావోయిష్టులకు, నెక్సలైట్లకు డబ్బు ఇస్తోంది. అది నేపాల్‌లోని చైనా ఏజంట్ల ద్వారా భారత్‌లోకి వస్తుంది. భారత కమ్యూనిష్టులకు కూడా చైనా నుంచి డబ్బు అందుతున్నట్లు సి.ఐ.ఏ. నివేదికల్లో తేలింది. టిబెట్ విడిపోయి ప్రత్యేక దేశమైతే మన దేశంలో వేర్పాటు వాదులకు చైనా ద్వారా డబ్బు అందే మార్గాలు తగ్గిపోతాయి. ఇది ప్రభుత్వం తక్షణమే చేయాలి. ఇప్పటికే టిబెట్ లో చైనా Digestion ను మొదలుపెట్టిందని రాజీవ్ మల్హోత్రా చెప్పారు. మనం ఇంకా ఆలస్యం చేస్తే, అసలు టిబెట్ పూర్తిగా తన సంస్కృతిని కోల్పోతుంది.

అది తప్పు కదా అనకండి, సామ్రాజ్యవాద భావజాలం కలిగిన చైనా వలన భారత్‌కు శాశ్వతంగా ముప్పు ఉంటుంది. మనం దాన్ని తుదిముట్టించాలంటే చైనాను ముక్కలు చేయడం మార్గం. మనమేమీ తప్పు చేయడంలేదు. చైనా మన మీద ప్రయోగిస్తున్న ప్రణాళికనే మనం చైనా మీద ప్రయోగిస్తున్నాం. అప్పుడు మాత్రమే భారతదేశం, భారతీయులు సురక్షితంగా ఉంటారు.

No comments:

Post a Comment