Thursday 31 July 2014

నాగపంచమి - సర్పాలను కాపాడి, నాగజాతి అనుగ్రహం పొందండి

మహాభారతం పంచమవేదం. అది అనేక ధర్మసూక్ష్మాలతో కూడి ఉంటుంది. అందులో కొన్నిసార్లు ధర్మం అధరంగా, అధర్మం ధర్మంగా కనిపిస్తుంది. మహాభారతాన్ని వ్యాఖ్యానం చేయడం చాలా కష్టం. అయినప్పటికి నాగపంచమికి సంబంధించి పరీక్షిత్ మహారాజుకు చెందిన ఈ చారిత్రిక సంఘటనను చాలా క్లుప్తంగా తెలుసుకుందాం.......

మహాభారతం ముగిసాక హస్తినాపురాన్ని అధిష్టించిన పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్ళిన సమయంలో, తపస్సులో ఉన్న ఋషి మెడలో చనిపోయిన పామును వేసి, ఆ మునికుమారుడి శాపానికి గురై శాపకారణంగా తక్షకుడి (పాము) కాటుకు మరణిస్తాడు. తన తండ్రి మరణానికి కారణమైన తక్షకుడిని, సర్పజాతిని సంహరించడం కోసం పరీక్షిత్ మహారాజు కుమారుడైన జనమేజయుడు సర్పయాగం చేస్తాడు. ఆ యాగ ప్రభావం చేత ఎక్కడెక్కడో ఉన్న సర్పాలన్నీ వచ్చి హోమగుండంలో పడి ప్రాణులు వదిలేస్తాయి. తనను రక్షించమని వేడుకుంటూ తక్షకుడు ఇంద్రుని శరణువేడి, ఇంద్ర సింహాసనాన్ని చుట్టుకుంటాడు. కానీ జనమేజయుడి ఆదేశం మీద వేదపండితులు ఇంద్రుని సింహాసనంతో కూడి తక్షకుడు యాగంలో పడి మరణించాలని మంత్రపూర్వకంగా చెప్తారు. దాంతో ఇంద్రుడి హడలిపోతాడు. ఇంతలో మానసాదేవి ఆదేశం మేరకు ఆమె కుమారుడైన ఆస్తిక మహర్షి యాగం ఆపటానికి వస్తారు.. యాగాన్ని ఆపి, సర్పజాతిని కాపాడటంలో ఆస్తిక మహర్షి విజయవంతమవుతారు. ఆయన కారణంగా సర్ప సత్ర యాగం ఆగిన రోజు శ్రావణ శుక్ల పంచమి. ఆ తర్వాత మానవజాతికి, సర్పజాతికి మధ్య స్నేహభావాన్ని పెంపొందేలా ఆ మహర్షి కృషి చేశారు. అందుకు గుర్తుగా అప్పటి నుంచి ప్రతి ఏటా శ్రావణ శుక్ల పంచమిని నాగపంచమిగా జరుపుకుంటున్నాం.

ఒక విషయం గుర్తుంచుకోండి. పాములు సరీసృపాలు కనుక పాలు త్రాగవు. అలా అని అన్ని పాములు పాలు త్రాగవని కాదు, దేవతసర్పాలు మాత్రమే పాలు త్రాగుతాయి. మాములు పాములు పాలు త్రాగితే అరగక కక్కెస్తాయి, తర్వాత మరణిస్తాయి. దేవత సర్పాలు ఎక్కడపడితే అక్కడ ఉండవు. మనిషి కంటికి కనిపించవు, మానవ కదలికలను లేని మహారణ్యాలలో మాత్రమే ఉంటాయి. అందువల్ల పుట్టలో పాక్యేట్ల కొద్ది పాలు పోయకండి. నాగజాతిని తలుచుకుని నాగదేవతకు నైవేద్యంగా ఒకటి, రెండు చెంచాల పాలు మాత్రమే పుట్టలో పోసి మిగితావి ప్రసాదంగా స్వీకరించడం మంచిది. నాగదేవత పూజలో పసుపుకుంకుమలను పుట్ట దగ్గర వాడవద్దు. అసలు పుట్టలో పాలు పోయకూడదు, నాగశిలకు, నాగబంధానికి మాత్రమే పాలు పోసి, పూజించాలి. ధార్మిక గ్రంధాల్లో అలాగే చెప్పారు. నాగబంధం/ నాగశిల మీద మాత్రమే చల్లవచ్చు. పసుపు అంటే పాములకు అలర్జీ. పసుపు వాటి శరీరానికి అంటుకోవడం వలన కూడా అవి మరణించే అవకాశం ఉంటుంది. పండుగ పూట పాపం చేయకండి. పసుపుకుంకుమలను పుట్ట దగ్గర వాడకండి.

కొందరు ఇంటి ముందుకు పాములను తీసుకువస్తూ ఉంటారు. వాటికి పాలు పోయకండి, అలా వచ్చేవారికి రూపాయి కూడా ఇవ్వకండి. ఎందుకంటే వారు పాములను 3 నెలల ముందే పట్టి, నీరు, ఆహారం ఇవ్వకుండా, ఒక బుట్టలో పెట్టి, ఆ బుట్టను ఒక చీకటి గదిలో పడేస్తారు. 3 నెలలపాటు తినడానికి ఏమి దొరకని ఆ పాము, ఆఖరికి ఏమి పెట్టినా తినేందుకు సిద్ధం అవుతుంది, బలం కోల్పోతుంది, మరణానికి చేరువవుతుంది. అదే సమయంలో వాటిని తీసి, కోరలను పీకేసి, నోరు కుట్టెస్తారు, చిన్న సందు మాత్రమే వదులుతారు. వాటినే నాగపంచమి రోజున జనం మధ్యకు, గుడి దగ్గరకు తీసుకువచ్చి, పాలు సమర్పించమని చెప్పి, డబ్బులు తీసుకుంటారు. ఏది దొరకని ఆ సర్పం, తాత్కాలికంగా పాలు త్రాగిన, తర్వాత అది మరణిస్తుంది. అందుకని ఎక్కడైనా, అటువంటివి కనిపించినా, ఎవరైనా మీ దగ్గరకు పాము తీసుకువచ్చినా, వెంటనే పోలిసులకు కానీ, స్నేక్ సెల్ వారికి కానీ సమాచరం ఇవ్వండి. సర్పాలను కాపాడి, నాగజాతి అనుగ్రహం పొందండి.

ఇవిగో అటవీ శాఖవారి టొల్ ఫీ నెబరు - 1-800-425-5364
ప్రెండ్స్ ఆఫ్ స్నేక్ హెల్ప్ లైన్ నెంబరు - +91 83742 33366.      

Tuesday 29 July 2014

ప్లాస్టర్-ఆఫ్-పారిస్ విగ్రహాల వలన అనర్ధాలు

వినాయక చవితి సమీపిస్తోంది. అందరూ తమ విగ్రహమే అందంగా ఉండాలనే ఆలోచనతో ఒకరిని మించి ఒకరు ఎత్తైన విగ్రహాలు ప్రతిష్టిస్తారు. ప్లాస్టర్-ఆఫ్-పారిస్ విగ్రహాల వలన కలిగే అనర్ధాలు తెలుసుకుందాం.

§ ప్లాస్టర్-ఆఫ్-పారిస్లో జిప్సం, సల్ఫర్, ఫాస్ఫరస్, మెగ్నిషియం ఉంటాయి.
§ రసాయన రంగుల్లో మెర్‌క్యూరీ(పాదరసం), కాడ్మియం, లెడ్ మొదలైనవి ఉంటాయి.
§ ఈ రసాయనాలు నీటిలో రసాయనాల మోతాదును పెంచి, నీటిని విషతుల్యం చేస్తాయి.  
§ ఈ క్రమంలో పర్యావరణంలో భాగమైన చేపలు, ఇతర జలచరాలు, మొక్కలు మరణిస్తాయి. ఈ కలుషిత జలాలను త్రాగడం వలన ఈ జలాశయాల క్రింద ఉండే జనం అనేక రోగాల బారిన పడతారు.

§ ప్లాస్టర్-ఆఫ్-పారిస్‌తో చేసిన విగ్రహాలు అందంగా, ఆకర్షణీయంగా, తేలికగా ఉన్నప్పటికి నీటిలో త్వరగా కరగవు. దాదాపు 48 గంటల తరువాత కాని కరగడం మొదలుకావు. ఈ సమయంలో బుల్‌డోజర్లు, ఇతర వాహానాలు వచ్చి విగ్రహాలను ముక్కలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. మనం ఎంతోగానే పూజించిన గణపతి విగ్రహం ప్రకృతిలో కలిసిపోకుండా ముక్కలుగా పడి ఉండడం గణపతిని అవమానించడమే అవుతుంది.

సంప్రదాయేతర విగ్రహాలను వాడడం వలన చెరువులు, నదులు, సముద్రాలు, ఇతర నిమజ్జన ప్రదేశాల్లో విష రసాయనాల శాతం పెరుగుతుంది. నీటిలో యాసిడిటి, లోహశాతం పెరుగ్తుంది. ఫలితంగా పర్యావరణం కలుషితమవుతుద్ని. జలచరాలు, నీటిమొక్కలు చాలా మరణిస్తాయి. ప్రజలకు శ్వాససంబంధిత రోగాలు, చర్మ, రక్త, రోగాలు సంక్రమిస్తాయి. ఇది గణపతి తత్వానికి విరుద్ధం.

మట్టి గణపతినే పూజించండి. పర్యావరణాన్ని రక్షించండి. గణపతి పర్యావరణ ప్రేమికుడని మరువకండి.

Monday 28 July 2014

హిందూ ధర్మం - 108 (భారత -మూడు అక్షరాల తత్వం)

భారత్ లేక భారత అనే పదం మూడు అక్షరాల నుంచి ఏర్పడింది. భా - భావానికి, ర- రాగానికి, తా- తాళానికి సంకేతం. భారత్ అంటే భగవంతుని వైభవాన్ని భావంతో, రాగంతో, తాళంతో కీర్తించే భూమి అని అర్దం అని చెప్పారు సత్యసాయిబాబా. భగవంతుని కీర్తించడం ఒక్క భారతీయులే (హిందువులే) చేస్తారా? ప్రపంచమంతా ఏదో ఒక విధంగా భగవంతుని కీర్తిస్తూనే ఉంది కదా అని అడుగుతారేమో!

నిర్వికార, నిరాకార, నిర్గుణ, నిశ్చల, నిత్య, సత్, చిత్, ఆనంద స్వరూపుడు భగవంతుడు. అందరికి దగ్గరగా ఉన్నవాడు ఆయనే, దూరంగా ఉన్నవాడు ఆయనే, అందరికంటే చిన్నవాడు ఆయనే, పెద్ద కూడా ఆయనే. స్త్రీ, పురుష, నపుంసక అనే మూడు లింగాలకు అతీతుడైనా, కొన్ని సార్లు స్త్రీగా, కొన్ని సార్లు పురుషుడిగా, ఇలా అనేక విధాలుగా వ్యక్తమవుతున్నాడు. ఎన్నో వ్యక్తరూపాలు ఉన్న అవ్యక్తుడు పరమేశ్వరుడు. ప్రేమస్వరుపుడు, కరుణాసముద్రుడు, దయాసింధువు అయినా శిక్షించడంలో చాలా భయానకంగా ఉంటాడు. జన్మము ఆయనే, మరణము ఆయనే, జననమరణాల మధ్యనున్న జీవము ఆయనే. ఎప్పుడు అణురూపంలో కదిలేవాడు ఆయనే, అసలే కదలని స్థాణువు ఆయనే. తల్లి, తండ్రి, గురువు, మిత్రుడు, సోదరుడు అన్నీ ఆయనే. ఒక వ్యక్తిలో ఒకే గుణం ఉంటుంది, కానీ పరమాత్మలో పరస్పర విరుద్ధ గుణాలు ఉంటాయి. అలా చెప్పుకున్నా, గుణగణాలకు అతీతుడు ఆయనే. అందుకే అన్నమాచార్యులవారు తన సంకీర్తనల్లో 'గోవిందా! గుణగణ రహిత, కోటి సూర్యతేజ' అంటారు.

అటువంటి భగవత్ తత్వాన్ని కీర్తించడం మాములు విషయం కాదు. ఆయన్ని కీర్తించాలంటే, అనుభూతి పొంది ఉండాలి. ఆ భగవద్ అపరోక్షానుభూతిని ఇవ్వగలిగిన భూమి కనుక దీనికి భారతభూమి అని, అనంతుడైన భగవంతుని అనుభవించి, తద్వారా కీర్తించగలవారికి మాత్రమే భారతీయులని పేరు. వారు ప్రపంచంలో ఏ మూలనున్న సరే, కానీ ఈ భూమి అందుకు తగిన వాతవరణాన్ని కలిపిస్తుంది. అందుకే మన ధర్మానికి శ్మృతులు మొదలైనవి భారతీయ ధర్మం అని, భూమికి భారతంభూమి అని పేరునిచ్చాయి.

To be continued ............

Sunday 27 July 2014

హిందూ ధర్మం - 107 (భారతీయతకు తత్వార్ధం)

భగవంతుడు సచ్చిదానందుడు. ఆయనకు జననమరణాలు లేవు. భగవంతుని యందు రమించేవాడు, భగవంతుని తెలుసుకున్నవాడు భగవత్స్వరూపంగా మారుతున్నాడు. అందుకే శంకరులు వివేకచూడామణిలో బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి - బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతున్నాడు అని అన్నారు. భగవంతుడు శాశ్వతమైనవాడు, సనాతనుడు. భగవంతుని యందు రమించడం అంటే అశాశ్వతమైన లౌకిక ప్రపంచం నుంచి శాశ్వతమైన తత్వాన్ని చేరుకోవడం. దీన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే 'అసతో సద్గమయా' - ఓ పరమేశ్వరా! మేము అసత్ నుంచి సత్‌కు వెళ్ళెదము గాకా అన్న ఉపనిషద్ వాక్యానికి అర్దం. ఇది భారతీయత, అలా వెళ్ళెవాడు భారతీయుడు, అలా భగవత్స్వరూపంగా మార్చే భూమికి భారత భూమి అని పేరు.

భాః అంటే వెలుగు. వెలుగునందు రమించేవాడు భారతీయుడు. ఈ ధర్మం, ఈ భూమి, మనిషికి ప్రశ్నించే స్వేచ్చను, ఆలోచించే అవకాశాన్ని ఇచ్చాయి. ప్రశ్నించడం ద్వారా,  'నైతి, నైతి' (ఇది కాదు, ఇది కాదు) అంటూ పరబ్రహ్మ తత్వాన్ని, ఆత్మ తత్వాన్ని విచారణ చేస్తూ వ్యక్తి తన సచ్చిదాంద స్వరూపాన్ని తెలుసుకుంటున్నాడు. తన నిజమైన స్వరూపాన్ని తెలుసుకున్నవ్యక్తిలో అజ్ఞానమనే అంధకారం నశిస్తుంది. 'తమసోమా జ్యోతిర్గమయా' - ఓ పరబ్రహ్మ! మేము తమస్సు నుంచి వెలుతురునకు వెళ్ళెదము గాకా అన్న వాక్యానికి అర్దం. భారతీయత అంటే తమసోమా జ్యోతిర్గమయా.

భాః అంటే జ్ఞానం. జ్ఞానమునందు రమించేవాడు భారతీయుడు. ఆత్మజ్ఞానం మనిషికి అమృత తత్వాన్ని ఇస్తుంది. జననమరణ చక్రం నుంచి విడుదల చేస్తుంది. దానికి ధార్మికగ్రంధాలు సులువైన మార్గం చూపించాయి. అత్మను తెలుసుకున్నవాడు మృత్యును జయిస్తున్నాడు. 'మృత్యోర్మా అమృతంగమయా' - ఓ పరమాత్మ! మేము మృత్యును నుంచి అమృతత్వాన్ని చేరుకుందుము గాకా అని అర్దం. భారత అంటే మృత్యోర్మా అమృతంగమయా .

ఉపనిషద్ యొక్క మూడు వాక్యాలకు అర్దం భారత అనే పదంలో కనిపిస్తుంది. భారతదేశం అంటే పై మూడుంటిని ఇక్కడ జన్మించనంత మాత్రం చేతనే సులువుగా అర్దం చేసుకునే శక్తిని ఇచ్చే భూమి అని. మూడుగా చెప్పుకున్న తెలుసుకోవలసినది ఒక్కటే. అది తెలిస్తే, ఇంక రెండవది తెలుసుకోవడానికి ఏదీ ఉండదు. ఆ స్థితిలో జ్ఞానం, అజ్ఞానం అనే రెండు ఉండవు. ఎందుకంటే ఆ స్థితి ఈ రెండిటికి అతీతమైనది. ఆ స్థితిని చేరుకోగల సమర్ధులకు భారతీయులను పేరు. ఆ సమర్ధతను ఇచ్చే సంస్కృతికి భారతీయ సంస్కృతి అని, ఆ అర్హతను ప్రసాదించే భూమి భారతభూమి అని పేరు.      

To be continued ...........

Saturday 26 July 2014

హిందూ ధర్మం - 106 (భారత)

భారత అనే పదం రెండు పదాల నుంచి ఉద్భవించింది. భాః అంటే వెలుగు, జ్ఞానం, భగవంతుడు అని అర్దం. రతః అంటే రమించేవాడు అని అర్దం. భారతః అంటే సదా భగవంతుని యందు రమించేవాడు అని అర్దం. ఈ భూమికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ దేశంలో పుట్టడమే అదృష్టం. ప్రపంచంలో మిగితా భూభాగంలో పుట్టినవారికి భౌతిక దృష్టి ఎక్కువగా ఉంటుంది. వారు భౌతిక ప్రపంచాన్ని, ప్రాపంచిక సుఖాలకు, విషయవాసనల్లో జీవనం గడిపేస్తే, ఈ దేశంలో పుట్టినవారు అంతర్దృష్టి కలిగి ఉంటారు, భగవంతుని త్వరగా చేరుకుంటారు అంటారు రమణ మహర్షి. అంతర్దృష్టి, అంతర్ముఖఃత చెందడం భారతదేశంలో పుట్టినవారి సహజ లక్షణం. అది ఈ భారతభూమికే ఉంది.

ఉన్న శరీరం వయసుతో పాటు పెరుగుతుంది, ముసలితనం రాగానే ముడుచుపోతుంది, రోగగ్రస్థం అవుతుంది. సంపదలు బ్రతికున్నంతవరకే వెంట ఉంటాయి. మరణసమయంలో ఎంత సంపద ఉన్నా వ్యర్ధం, మరణాన్ని ఆపలేవు, తర్వాత వెంటరావు. మరణం తర్వాత తోడువచ్చేది చేసుకున్న పాపపుణ్య కర్మలు మాత్రమే. నా అనుకున్నవాళ్ళు మహా అయితే స్మశానం వరకు వస్తారు. ఆ తర్వాత మనది ఒంటరి ప్రయాణం. ఇదే సత్యం. ఇది అర్దంకాక అనేకమంది జీవితం ఉన్నది అనుభవించటానికి, ఇప్పుడే అన్నీ అనుభవించాలి అంటూ ప్రాపంచిక సుఖాలను అనుభవిస్తూ, విషయవాసనలను ఎక్కువ చేసుకుంటారు. ఈ జీవితం ఉన్నది అనుభవించటానికే అనే మాట వాస్తవం. కానీ ఈ జీవిత లక్ష్యం ప్రారబ్ధకర్మ ఫలాన్ని అనుభవించటం. ప్రారబ్దం అనుభవించగానే, ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది. అది తెలియక అనేకులు అజ్ఞానంతో ఇంకొన్ని లక్షల జన్మలకు సరిపడా కర్మ చేస్తారు. ఎక్కువగా వస్తువులను అనుభవిస్తే, కోరికలను తీర్చుకుంటే, మనిషిలో ఉన్న కోరికలు తీరకపోగా, అవి మరింత పెరుగుతాయి. ఒక వయసు వచ్చేసరికి, వాటికి దూరమై, బాధపడతారు. ఇది అంతా ఈ దేశంలో పుట్టినవారికి త్వరగా గమనించగలుగుతారు. ఉన్న జీవితాన్ని సక్రమంగా వాడుకోవాలన్న తపనతో బ్రతుకుతారు. అది భక్తికి, తద్వారా ముక్తికి దోహదపడుతుంది. అందుకే మనకు భారతీయులని పేరు.

To be continued .............

Thursday 24 July 2014

హిందూ ధర్మం - 105

హిందు అన్న పదం జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోయినా, పురాతన కాలం నుంచి శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు మొదలైనవి మనలని భారతీయులుగా, భూమిని భారతభూమిగా గుర్తించింది. భారతీయులంటే స్వాతంత్రానంతరం మనం ఏర్పర్చుకున్న రాజ్యాంగం ప్రకారం ఇవ్వబడిన గుర్తింపు కాదు ఇది. ఇది దానికి భిన్నమైనది.

పూర్వం ఈ ప్రదేశాన్ని (ఇప్పుడున్న భారతదేశాన్ని) శకుంతలా దుష్యంతుల కుమారుడు, చంద్రవంశపు రాజైన భరతుడు పరిపాలించిన కారణం చేత దీని భరత భూమి అనే పేరు వచ్చింది. ఈ భరతుడి తర్వాతే పండవులు రాజ్యం చేపట్టారు. కాగా, భరతుడు ఈ భూమిని పరిపాలించకముందు నుంచే ఈ భూమికి భరత భూమి, భరతఖండం అనే పేరు ఉంది. విష్ణుపురాణంలో భారత అనే పేరు గురించి ఒక ప్రస్తావన ఉంది.

उत्तरं यत्समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणम् ।
वर्षं तद् भारतं नाम भारती यत्र संततिः ।।

సముద్రానికి ఉత్తరంలో, హిమాలయాలకు దక్షిణదిశలో ఉన్న ప్రదేశాన్ని భారతం అంటారని, అక్కడ పుట్టినవారు భారతీయులని, భారతభూమి సంతతి అని పై శ్లోకం చెప్తోంది. భగవద్గీతలో కూడా భారత అని అర్జునుడిని పలుమార్లు సంబోధిస్తాడు కృష్ణపరమాత్మ. వేదం ప్రధానంగా చెప్పే కర్మ యజ్ఞం. అగ్నిఆరాధనకు వేదం విశిష్టవంతమైన స్థాణం ఇచ్చింది. భారత లేక భారతీయులనే పదం కూడా దీనికి సంబంధంగానే పుట్టిందని, అగ్ని ఆరాధకులే భారతీయులని, నిత్యం అగ్ని ఆరాధన జరుగుతుంది కనుక దీనికి భారతదేశమని పేరని కొందరు పండితుల మాట.

అగ్ని అనంతమైనది. అగ్ని అంతటా వ్యాపించి ఉంది. అగ్ని అనగా శక్తి. శక్తి కారణంగానే సృషి ఏర్పడింది. సూర్యుడి నుంచి వచ్చే సౌరశక్తి కూడ అగ్నియే. సర్వజీవులయందూ ఆకలి రూపంలో ఉంటూ, జీవాన్ని నడిపిస్తున్న జఠరాగ్ని కూడా ఈ అగ్ని యొక్క అంశయే. లోకంలో అశాంతి ఏర్పడినప్పుడు, వేదమంత్రాల ద్వారా యజ్ఞంలో ఇవ్వబడిన హవిస్సును దేవతలకు (ప్రకృతి శక్తులకు) చేర్చి, లోకశంతిని చేకూర్చుతున్నది కూడా అగ్నియే. ప్రకృతిలో అసమతూకం ఏర్పడి, అల్లకల్లోలం జరగకుండా, తనలో వేయబడిన ఆవునేతిని, ఇతర ఔషధ ద్రవ్యాలను స్వీకరించి, అప్పుడు జరిగే రసాయన ప్రతిచర్య చేత ప్రకృతి యందు సమతూకం తిరిగి ఏర్పడేలా చేసి, సర్వులను రక్షిస్తున్నది అగ్నియే.  

To be continued .....................

Bhagawan Sathya Sai Baba on Bharat

Swami! India (Bharat) is the land of religion and spirituality. All the incarnations have taken birth in Bharat. What is the reason behind this?

Bhagawan Sathya Sai Baba 

: Bharat is Yogabhumi, the land of spirituality. Bharat is Punyabhumi , the sacred land. Bharat is Karmabhumi, the land of sacred activity. Bharat is Tyagabhumi, the land of renunciation. Here saints, sages, seers, aspirants, seekers and devotees pray to God to enjoy His proximity. This necessitates the descent of God in human form or incarnation. In response to their fervent appeals and prayers, God, out of His grace and compassion, descends on earth or incarnates and moves amidst us. Devotees, then, experience bliss and follow Him.

Here is an illustration. You asked why Bharat alone has always been the birthplace of the incarnations. You know that the train has an engine in the front with several carriages connected to it. The power or energy generated there in the engine pulls the carriages forward. Where do you find the driver? Naturally, he sits in the engine monitoring the train, does he not? Similarly, in the train of the world, Bharat is in the position of an engine and the carriages are the several countries attached to it. God is the driver. The engine is His place. Just as we find heat and power generated there, we also find the same elements produced as a result of sacred rituals such as Yajnas and Yagas performed from time to time in this land of Bharat .

In the great epic, the Mahabharata we find Arjuna and Bhima always following Dharmaja. Here, Arjuna stands, for intelligence, while Bhima symbolizes physical strength. Now, Bharat is in the position of Dharmaja. America is Arjuna, while Russia is Bhima. Just as you find Bhima and Arjuna obeying the command of Dharmaja , America and Russia should follow Bharat.

In the very name "Bharat" we have three letters. (Written in Telugu, "Bharat" comprises three letters). Bha, the first letter stands for bhava or feeling, ra, the second signifies raga, tune, or melody, and ta, the third indicates tala or beat. Thus, Bharat is the country where the glory of God is sung with bhava, raga and tala. This country has another name Hindu Desam which means a country that shuns violence, `Him' - himsa or violence, ` du ' du ra or shuns. For these reasons God has chosen to incarnate or descend in human form in Bharat.

(http://sathyasaibaba1.tripod.com/swami_answers-1_to_26.htm)

Wednesday 23 July 2014

హిందూ ధర్మం - 104

హిందు పదం విదేశీయులు మనకు పెట్టిన పేరు కాదనడానికి అధారాలు అనేకం ఉన్నా, ఈ హిందు పదం ముఖ్యంగా భౌగోళిక గుర్తింపు మాత్రమే. ఇది ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తులకు, ఆచారసంప్రదాయాలకు ఒక భౌగోళిక గుర్తింపు మాత్రమే కానీ దీనికి ధర్మంతో, ఆధ్యాత్మికతతో, తత్వంతో, సంస్కృతితో ఉన్న సంబంధం, మిగితా పేర్లతో ఉన్నంత పురాతమైనది కాదు. ఒకరకంగా చెప్పాలంటే సింధునది నుంచి హిందూమహాసముద్రం మధ్యనున్న ప్రాంతంలో పుట్టినవారందరు హిందువులే. వారు ఏ మతస్థులైనా సరే. వారు అంగీకరించకపోవచ్చు కానీ, ఈ భూమికి పేరు హింద్, ఇందులో పుట్టినవారందరు హిందువులేనట. అంగ్లేయులు వచ్చాక, వారు ఈ పదాన్ని అధికంగా ప్రయోగించారు. క్రైస్తవాన్ని పాటించేవారిని క్రైస్తువులని, ఇస్లాంమతాన్ని ఆచరించారిని మహమదీయులను చెప్పాక, మిగితావారిని హిందువులన్నారు.    

కానీ వేద, పురాణ, ఇతిహాసాలు మొదలైనవి మన ధర్మానికి ఇచ్చిన పేరు సనాతన ధర్మం, భారతీయ ధర్మం. ధర్మానికి ఆద్యంతములు లేవు. ధర్మం ఎప్పుడు ఉంటుంది, ఎప్పటికి ఉంటుంది. ఇది ఆచరించడం వలన మనిషి అశాశ్వతమైన జనమరణ చక్రం నుంచి విడువడి శాశ్వతమైన తన ఆత్మస్వరూపాన్ని పొందుతున్నాడు. ఇది మనిషి యొక్క సనాతన తత్వాన్ని తెలియజేస్తోంది కనుక దీనికి సానతన ధర్మం అని పేరు. అంతేకాదు, ఈ ధర్మాచరణ వలన ఈ సృష్టి సుఖశాంతులతో చాలాకాలం ఉంటుంది కనుక దీనికి సనాతన ధర్మం అని పేరు.

పైన చెప్పుకున్న ధర్మానికి హిందు అనే గుర్తింపు సరైనదే అయినా, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనుకుంటున్నవారు దీన్ని సనాతన ధర్మం అని సంబోధించడమే శ్రేష్టం అంటారు పెద్దలు. అట్లాగే ఇది వేదం నుంచి పుట్టింది కనుక వైదిక ధర్మం అని ధర్మాన్ని పిలుస్తారు. ఆ మధ్య ఎవరో అడిగారు ధర్మం, హిందు/సనాతన ధర్మం, రెండు ఒకటేనా? వేర్వేరా? అని. ధర్మం, వైదిక ధర్మం, సనాతన ధర్మం, భారతీయ ధర్మం, హిందు ధర్మం ఇవన్నీ పర్యాయపదాలు. ఈ లోకానికి ఒక ధర్మం ఉంది. దానికి ఒక గుర్తింపిస్తే దానికి ముందు ఒక పేరు జోడించబడుతుంది. అంతే కానీ, ధర్మం, సనాతనధర్మం వేరుకాదు. విశ్వధర్మమే సనాతన ధర్మం. దాన్ని అనుసరించే ఈ బ్రహ్మాండం, సృష్టి, ప్రకృతి నడుస్తున్నాయి.

To be continued ...............

Tuesday 22 July 2014

హిందూ ధర్మం - 103 (ఇతర సాహిత్యాల్లో హిందు ప్రస్తావన )

హెబ్రివ్ బైబిల్‌లో కూడా భారతదేశానికి హోదు అనే పదాన్ని ఉపయోగించింది. ఈ పదం జుడాయిజం మతస్థులు హిందువులను, భారతదేశాన్ని గురించి వాడిని పదం. హెబ్రివ్ బైబిల్ (పాత నిబంధన) క్రీ.పూ.300 ఏళ్ళకు ముందు నుంచి ఉందని భావిస్తున్నారు. ఈ రోజుకి ఇజ్రాయిల్‌లో హెబ్రివ్ భాషలో భారత్‌ను హొదుగానే సంబోధిస్తారు. చైనీయులు హిందువులకు హైన్-తు అనే పదాన్ని క్రీ.పూ.100 నాటికే ఉపయోగించారు. క్రీ.పూ.100 కు చెందిన సాయి-వాంగ్ కదలికలను వివరుస్తూ, సాయి-వాంగ్ దక్షిణ దిశగా కదిలి హైన్-తు మీదుగా వెళ్ళాడని అందులో చెప్పబడింది. చైనీ యాత్రీకులు ఫా-హైన్ (క్రీ.శ.5), హుయెన్-సాంగ్ (క్రీ.శ.7) వారు 'యింతు' అనే పదాన్ని హిందువులను, భారతదేశాన్ని సంబోధిస్తూ ఉపయోగించారు. ఇప్పటికి ఈ యింతు అనే పదం చైనాలో వాడుకలో ఉంది.

సైర్-ఉల్-ఒకుల్ అనే పురాతన అరబిక్ రచనా సంకలనం తర్కిష్ గ్రంధాలయం మక్తబ్-ఈ-సుల్తానీయా ఇస్తాన్‌బుల్‌లో ఉంది. అందులో మహమ్మద్ ప్రవక్తకు మామయ్య అయిన ఒమర్-బిన్-ఈ-హస్షం పరమశివుడి గురించి రాసిన పద్యం ఒకటి ఉంది. అందులో భారతదేశాన్ని హింద్ అని, భారతీయులను హిందువులను చెప్తూ, రచన చేశారు. 'ఓ మహాదేవా! నాకు ఒక్కరోజు హింద్‌లో తాత్కాలికంగా ఉండెందుకైనా అవకాశం ఇవ్వు. దాంతో నాకు ఆధ్యాత్మిక ఉన్నతి కలిగేలా అనుగ్రహించు. హిందు ఋషులతో ఒక్క సత్సంగానికైనా అవకాశం ఇవ్వు. ఆ ఒక్క అవకాశంతో మొత్తం పుణ్యం వస్తుంది' అని రాసుకున్నారు. ఇదే రచనాసంకలనంలో వేరిక పద్యం మొరొక రచయిత రాసినది అందుబాటులో ఉంది. అది క్రీ.పూ.1300 సంవత్సరానికి చెందినది. అది కూడా హింద్ అని భారత్‌ను, హిందు అని భారతీయులను సంబోధించింది. అదే పద్యంలో ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదాల యొక్క ప్రస్తావన ఉంది. ఈ పద్యం ఢిల్లీలో లక్ష్మీనారాయణ స్వామి ఆలయం (బిర్లా మందిర్)లో కనిపిస్తుంది.

ఇవి అరబ్బు సాహిత్యంలో ఇస్లాం మత ఆవిర్భావానికి ముందు రాసిన కొన్ని పద్యాలకు భావాలు.

పరమపవిత్రమైన ఆ హింద్ భూమి భగవంతుని చేత ఆశీర్వదించబడింది. అందుకే అక్కడ దివ్యజ్ఞానం వర్షిస్తోంది.
ఆ దివ్యజ్ఞానం హిందు ఋషుల మేధస్సు కారణంగా అపారంగా తన వైభవాన్ని చాటుతోంది.
వేదమార్గాన్ని భక్తితో అనుష్ఠించేవారు పరబ్రహ్మంతో ఏకత్వాన్ని పొందుతున్నారు.
యజుర్వేదం, సామవేదం నుంచి పొంగిపొర్లుతున్న జ్ఞానం ద్వారా మానవులు సోదర భావంతో మోక్షాన్ని చేరుకుంటున్నారు.
ఋగ్వేదం, అధర్వణవేదం మనకు సోదరభావాన్ని చాటుతున్నాయి. వాటిని ఆశ్రయించినవారికి అజ్ఞానధకారం తొలగిపోతుంది.

Source: http://www.sanskritimagazine.com/indian-religions/hinduism/how-old-is-the-word-hindu/
http://haribhakt.com/are-you-hindu/
https://sites.google.com/a/hindu-tva.com/www/originoftheword%2C%27hindu%27
http://www.hindudharmaforums.com/showthread.php?t=3462

To be continued .............

Monday 21 July 2014

హిందూ ధర్మం - 102 (హిందు పదానికి చారిత్రిక ఆధారాలు)

హిందు పదం క్రీస్తు పూర్వమే వాడుకలో ఉందనడానికి కొన్ని ఆధారాలు లభించాయి. పర్షియా రాజు డరియస్ (Darius) హమదాన్ (Hamadan) , పెర్సెపోలిస్ (persepolis) మొదలైన శాసనాల్లో తన రాజ్యంలో 'హిదు'(Hidu) కూడా అంతర్భాగమని ప్రకటించినట్లు కనిపిస్తుంది. ఇది హిదు (హిందు) అన్న పదం క్రీ.పూ 450-500 ఏళ్ళకు ముందే ఉందని నిరూపిస్తోంది. డరియస్ (darius) వారసుడైన జెరిసెస్ (Xerexes) శాసనాల్లో అతని క్రింద పాలించబడిన రాజ్యాల ప్రస్తావన కనిపిస్తుంది. అందులో కూడా హిదు అనే ప్రాంతం ఉంది. ఈ శాసనం క్రీ.పూ.400-450 కి సంబంధించినది. ఇయం కటగువియ (ఇది సత్యగిదీన్), ఇయం గధారియ(ఇది గాంధార ప్రాంతం), ఇయం హిదువియ (ఇది హిందు ప్రాంతం) అంటూ ఈ మూడు పదాలు పెర్సెపోలిస్‌లోని ఒక పురాతన టూంబ్‌లో ఉన్నాయి. అట్లాగే అశోకుడు తన శాసనాల్లో భారతీయులను హిదువులని, భారత్‌ను హిదాలోకమని పదేపదే ప్రస్తావించాడు. ఈయన క్రీ.పూ.3వ శతాబ్దం వాడు. అశోకుడి శాసనాల్లో దాదాపు 70 సార్లు హిదా అనే పదం, దాని వ్యుత్పత్తులు కనిపిస్తాయి. 'ఈ ప్రజలంతా నా వాళ్ళే. నా ప్రజలు సుఖసంతోషాలతో ఉండలని నేను ఆశిస్తున్నాను. హింద్ ప్రజలు, మిగితా ప్రజలందరు బాగుండాలి' అని అశోకుడు తన శాసనాల్లో రాసుకున్నాడు.

పెర్సెపోలిస్‌లోని షాహపూర్‌ (Shahpur) కు చెందిన క్రీ.శ.310 కు చెందిన పహ్లవి(Pahlavi) శాసనాల్లో (inscriptions) అక్కడికి రాజుకు శకన్‌షాహ్ హింద్ శకస్థన్' అని, మంత్రులకు కూడా అదే విధమైన బిరుదులు ఉన్నాయని చారిత్రిక ఆధారాలు తెలుపుతున్నాయి. పైన చెప్పుకున్న చారిత్రిక ఆధారాలు హిందు అనే పదం కనీసం క్రీ.పూ. 1000 నుంచి 5000 ఏళ్ళకు పూర్వం నుంచి ఉన్నదని చెప్తున్నాయి.

జొరాస్ట్రియన్ మతస్థులకు సంబంధించిన అవెస్థ (పహ్ల్వి అవెస్థ/ Pahlavi avesta) గ్రంధంలో సప్తసింధుకు బదులుగా హప్తహిందు అనే పదం వాడినట్లు కనిపిస్తుంది. ఈ గ్రంధం క్రీ.పూ.1000 సంవత్సరాలకు ముందు నుంచి ఉంది. అట్లాగే వారి మతగ్రంధంలో వేదవ్యాస మహర్షి ప్రస్తావన ఉంది. వేదవ్యాసుడు జొరాస్ట్ర ఉండగా, గుస్తాష్ప్(Gustashp) అనే రాజు కొలువికి వెళ్ళినప్పుడు, తనను తాను పరిచయం చేసుకుంటూ 'నేను హింద్ అనే ప్రాంతంలో పుట్టాను' అని చెప్పుకుంటారు. వ్యాసుడు పుట్టింది భారత్‌లోనే, యమునా నది దగ్గర. గ్రీకులు కూడా హిందు పదాన్ని ఉచ్చరించే లోపంతోనే భారత్‌ను హిందూ అనబోయి, ఇండయో అన్నారు. ఈ ఇండయో అనే పదం గ్రీకు సాహిత్యంలో క్రీ.పూ. 5వ శతాబ్దానికే ముందు నుంచే ఉంది. గ్రీకులకు సరిగ్గా పలకడం రాక, అనేకమంది రాజుల పేరలను తప్పు పలికేశారు.

To be continued ...........

Sunday 20 July 2014

అమ్మకు బోనం

ఈ లోకంలో ఒక శక్తి ఉంది. ఆ శక్తిని మనం ఏలా అయినా వాడుకోవచ్చు. దాన్ని కొందరు స్వార్ధం కోసం, ప్రపంచంపై ఆధిపత్యం కోసం, లోక వినాశనం కోసం వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, కొందరు లోకహితానికి ఉపయోగపడాలని భావిస్తారు. మొదటిరకం వారు ఖచ్చితంగా నాశనమవుతారు, ఇంతకముందు అనేకులు అయ్యారు కూడా. కానీ వారు చేసే దుష్టకృత్యాల్లో అనేకమంది అమాయకుల ప్రాణాలు బలైపోతాయి. వీటికి తోడు రకరకాల రోగాలు, ప్రకృతి విపత్తులు అనేకమందిని బలి చేస్తాయి.

లలితా సహస్రనామాల్లో ' ఆబ్రహ్మకీట జననీ' అని అమ్మకి ఒక నామం, అంటే బ్రహ్మ మొదలుకొని చిన్న కీటకముల వరకు పక్షులు, చెట్లు, గ్రహాలు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, మనుష్యులు, దేవతలు మొదలైనవారందరికి ఆమెయే తల్లి అని అర్దం. ఇలా అమాయకుల ప్రాణాలు అనవసరంగా బలవడం అమ్మ(పరమేశ్వరి/జగజ్జనని)కి ఇష్టంలేదు. అందరం ఆమె పిల్లలమే. కాబట్టే అమ్మ మనందరికోసం భూమి మీదకు అనేకమార్లు అనేక రూపాలలో వచ్చింది.

కులమతాలకు అతీతంగా తన పిల్లలందరిని రక్షించడానికి గ్రామదేవతల రూపాన భువిపైకి దిగివచ్చింది. ఒక్కో గ్రామానికి ఒక్కొక్క పేరుతో గ్రామదేవత అయ్యింది. కొన్ని ప్రదేశాల్లో కొందరికిచ్చిన మాట కోసం వచ్చి కూర్చుంది, కొన్ని చోట్ల ఎవరో పిలవడం వలన వచ్చింది, కొన్ని చోట్ల స్వయంగా తానే వచ్చి కొలువుతీరింది. ఒక్కో చోట ఒకొక్క రకమైన కధ. మరిడమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మైసమ్మ, తలుపులమ్మ, సుంకుళ్ళమ్మ, గంగమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ, పెద్దమ్మ, పెద్దమంటలాంబ, చిన్నమంటలాంబ................ఇలా రకరాకాల పేర్లతో ఒకటే శక్తి అనేక రూపాలను పొందింది. ప్రతి చోట ఊరి మధ్యలో కాకుండా ఊరి బయట పొలిమేరలో కూర్చుంది. ఊరిలోకి వచ్చే అరిష్టాలను, అంటువ్యాధులను, దుష్టశక్తులను పొలిమేరలోనే అడ్డుకుని, దూరంగా తరిమేసి తన పిల్లలను కాపాడుకోవాలన్నది ఆ తల్లి ఆకాంక్ష. మన అందరి రక్షణ కోసమే గ్రామదేవతగా అమ్మ పొలిమేరలో కాపలాకు కూర్చుంది. అందరిని కాపాడుతున్న ఆ దివ్యశక్తి స్వరూపిణిని మనం గ్రామదేవతగా కొలుస్తాం. దివ్యశక్తి స్వరూపిణి అయిన అమ్మకు యొక్క ప్రతిబింబాలే మన గ్రామ దేవతలు.

మన కోసం ఆ జగన్మాత ఊరి పొలిమేరలో గ్రామదేవతగా కూర్చుంది. సంవత్సరమంతా ఎండకు ఎండి, వానకు తడిసి, ఎముకలు కొరికే చలిలో కూడా ఆ శక్తి మనలని, మన గ్రామాల్ని రక్షిస్తూనే ఉంది. ఆమెకు ఏ విధంగానైన సాయం చేయగలమా? అది అసాధ్యం. ధనం ఇద్దామనుకుంటే ఆవిడకు డబ్బు అవసరమే లేదు. అందరికి లక్ష్మీదేవి రూపంలో తానే ధనం  తానేఇస్తుంది. మరి గ్రామదేవతకు కృతజ్ఞతలు చెప్పడం ఏలా?  అన్నిటిని మనకు ప్రసాదించగల ఆ దివ్యశక్తికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవడంలో భాగమే ప్రతి ఏటా నిర్వహించే జాతరలు, బోనాలు, ఉత్సవాలు మొదలైనవి. ఆ సమయాల్లో మొత్తం ఊరు ఊరంతా ఏకమై తరిలివెళతారు.

ఆషాఢం అనగానే గుర్తుకువచ్చేది బోనాలు. భాగ్యనగరం (హైద్రాబాదు)లో ఎంతో వైభవంగా జరుగుతాయి. బోనం భోజనం అనే పదానికి వికృతి. మా పిల్లల్ని, కుటుంబసభ్యులను, మొత్తం గ్రామాన్ని చల్లగా చూస్తున్న ఓ జగన్మాత! అందరికి అన్ని ఇవ్వగల నీకు భక్తితో ఈ బోనం సమర్పిస్తున్నానమ్మా! మా అందరి కోసం ఊరి పొలిమేరలో కూర్చున్నావు, నీకు ఏదైనా ఇద్దామంటే నీ దగ్గర లేనిదేది లేదు. కానీ అమ్మ! భక్తితో నీకు బోనం(భోజనం) తెచ్చాను. స్వీకరించి మమ్మల్ని సదా అనుగ్రహించు తల్లీ! అంటూ బోనం సమర్పించి అమ్మకు కృతజ్ఞతలు చెప్తున్నాం.    

బోనం జగన్మాతకు చెప్పే కృతజ్ఞత

Saturday 19 July 2014

హిందూ ధర్మం - 101 (ఎవరు హిందువు?)

హిందు అన్న పదం విష్ణు, పద్మ పురాణాలు, బృహస్పతి సంహితలోని ఒక శ్లోకం లో ప్రముఖంగా కనిపిస్తుంది. కొందరు ఈ శ్లోకం విష్ణు పురాణంలోనిదని, కొందరు పద్మపురాణంలోనిదని, కొందరు బృహస్పతి సంహితలోనిదని అంటారు.

ఆసింధో సింధు పర్యంతా యస్యభారత భూమికా
మాతృభూః పితృభూఃశ్చైవ తవైర్ హిందూరితీస్మృతిః

సప్తసింధు ప్రదేశం నుంచి, హిందూమహాసముద్రవరకు వ్యాపించియున్న భారతభూమిని ఎవరు తమ మాతృభూమిగా, పితృభూమిగా భావిస్తారో, ఇక్కడే నుంచే మా పితృదేవతలు ముక్తి పొందారు, ఈ భూమి నుంచే లోకానికి జ్ఞానజ్యోతి ప్రసరించింది, ఇక్కడి నుంచే విశ్వశాంతికి సంబంధించిన సందేశం వెలువడింది, వెలువడుతుందని గట్టిగా నమ్ముతారో, వారంతా హిందువులే అంటున్నది పై శ్లోకం. వారు ఏ దేశంలో పుట్టినా, ఎక్కడ పెరిగినా, పై విధమైన ఆలోచన ఉన్నవారంతా హిందువులే.

ఎవరు ఓంకారాన్ని శబ్దబ్రహ్మంగా భావించి ధ్యానం చేసేవారు, ఓంకారమే ఆది అని నమ్మేవారు, కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసించేవారు, ఆవును గోమాతగా గౌరవించేవారు, భారతభూమి యందు భక్తి కలిగి ఉన్నవారు, చెడును విసర్జిస్తారో, అటువంటి వారు మాత్రమే హిందువు అని చెప్పుకోవడానికి అర్హత కలిగి ఉంటారని మాధవ దిగ్విజయ స్వామి పేర్కొన్నారు.

అల్పమైనవాటిని, చెడును, హింసను, పాపాన్ని విడిచిపెట్టేవారు, వేదాన్ని, గోమాతను పవిత్రంగా భావించేవారంతా హిందువులవుతారని వృద్ధ సంహిత అంటున్నది. సంస్కృత సాహిత్యానికి చెందిన కల్కిపురాణం, భవిష్యపురాణం, అద్భుతకోశం, మేధీని కోశం, రామకోశంలో హిందు పదం కనిపిస్తుంది. కాళీదాసుకు చెందిన ఒకానొక కావ్యంలో హైందవ అన్నపదానికి వ్యుత్పత్తి కనిపిస్తుంది. 1352లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహరరాయులు, బుక్కరాయలలో, హరిహరరాయల వారు ఎంతో గర్వంగా తన బిరుదు నామంలో హిందు అన్నపదాన్ని వాడి, హిందురాయ సురత్రాన గా కీర్తింపబడ్డారు.

To be continued ................

silence be so powerful

Q: Why does not Bhagavan go about and preach the truth to the people at large?

Maharshi : How do you know I am not doing it ? 

Does preaching consist in mounting a platform and haranguing the people around ? 

Preaching is simple communication of knowledge;
it can really be done in silence only.

What do you think of a man who listens to a sermon for an hour and goes away without having been impressed by it so as to change his life ?

Compare him with another, who sits in a holy presence and goes away after some time with his outlook on life totally changed.

Which is the better, to preach loudly without effect or to sit silently sending out inner force?

Again, how does speech arise?

First there is abstract knowledge.
Out of this arises the ego, which in turn gives rise to thought, and thought to the spoken word.

So the word is the great-grandson of the original source.

If the word can produce an effect, judge for yourself,
how much more powerful must be the preaching through silence.

~ Be as you are

Q: How can silence be so powerful?
Maharshi : A realized one sends out waves of spiritual influence which draw many people towards him. 

Yet he may sit in a cave and maintain complete silence. 

We may listen to lectures upon truth and come away with hardly any grasp of the subject, but to come into contact with a realized one, though he speaks nothing, will give much more grasp of the subject.

He never needs to go out among the public.
If necessary he can use others as instruments.

The Guru is the bestower of silence who reveals the light of Self-knowledge which shines as the residual reality.

Spoken words are of no use whatsoever if the eyes of the Guru meet the eyes of the disciple.


Source: Sri Ramana Maharshi Teachings. श्री रमण महर्षि के उपदेश

Friday 18 July 2014

హిందూ ధర్మం - 100 (హిందు పదప్రయోగం)

ఒకసారి ఒకతను ఆర్షవిద్యా గురుకులం స్థాపకులు దయానంద సరస్వతీ గారి వద్ద హిందు అనే శబ్దానికి చెడు అర్ధాలున్నాయని, ఆ పదం పరాయివాళ్ళు అవమానించడం కోసం పెట్టిన పేరని ప్రస్తావించినప్పుడు, ఆయన బదులిస్తూ 'ఇంత గొప్ప సంస్కృతి, సంప్రదాయం, ఎవరో అనమాకులు అర్దంపర్దం లేని పేరును పెట్టిపోతే, ఎట్లా అంగీకరిస్తుంది? హిందు అన్న పదానికి శాస్త్రీయత ఉన్నది' అనిఉన్నది అని చెప్తూ హిందు అంటే హింసానాం దూషయతి, ఖండయతి ఇతి హిందు అని వ్యుత్పత్తి, హింసకు, పాపానికి దూరంగా ఉండేవాళ్ళు, హింసను ఖండించేవారు హిందువులని అర్దం అని బదులిచ్చారు.

హిందు అనే పదం ఉచ్చారణలో తేడా కారణంగా సప్తసింధు అనే పదం నుంచి ఉద్భవిచింది కనుక, ఇది కూడా సప్తసింధు అంత పురాతమైనదై కొందరు పండితుల వాదన. అదే కాకుండా ఈ హిందు పదం సంస్కృత వాజ్ఞ్మయంలో లేదని చాలా కాలం వరకు అనేకులు వాదిస్తూ వచ్చారు. కానీ సంస్కృత భాషలో రాసిన దాదాపు 15 పురాతన గ్రంధాల్లో హిందు పదం ప్రయోగించబడింది. క్రీ.శ.4-6 శతాబ్దాల మధ్యలో శైవ సప్రదాయానికి చెదిన మేరు తంత్రం అనే గ్రంధంలో హిందు పదం కనిపిస్తుంది.

శబ్దకల్పధ్రుమ అనే గ్రంధంలో కూడా హిందు పదం ఉంది. రెండు గ్రంధాలు హిందు అంటే అల్పమైన, నీచమైన, క్షుద్రమైన, తుచ్ఛమైన వాటిని త్యజించేవాడు అని అర్దాలు చెప్తున్నాయి. బృహస్పతి ఆగం అనే గ్రంధం

హిమాలయస్య సమారంభ్య యావదిందు సరోవరం
తస్యదేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రశశ్తయత్

అని చెప్పింది. హిమాలయల నుంచి ఇందు సరోవరం (హిందూ మహాసముద్రం) వరకు ఉన్న ప్రదేశమంతా దేవతల చేత ప్రత్యేకంగా నిర్మితమైందని, అందువల్ల ఇది దేవభూమి అని, దీనికి హిందుస్థానమని పేరు అని చెప్తోంది.

మంగళ్ నాధ్‌జి అనే స్వామిజీకి బృహన్నరది అనే ఒక పురాతన గ్రంధం పంజాబ్‌లోని హోషియార్‌పూర్ దగ్గరలో షాంపూర్ అనే ప్రానతంలో లభ్యమైంది. దాని ప్రకారం హిమాలయాల్లో 'హిం' అనే ధాతువును, ఇందుసరోవరంలో 'ందు' అను ధాతువును కలిపి, ఈ భూమికి హిందుస్థానమని పేరు వచ్చిందని పేర్కొంటోంది.

హిమాలాయలంత ఉన్నతమైన విలువలు, ఆశయాలు, సముద్రమంత లోతుగా అందరిని, అన్నిటిని అర్దం చేసుకునే మనస్తత్వం ఉన్నవారు హిందువులు అని అర్దం.

To be continued.................


Thursday 17 July 2014

హిందూ ధర్మం - 99

గాంధార (ఆఫ్ఘనిస్థాన్), పారశీక (పర్షియ) నాగరికతలు కూడా భరతఖండంలో భాగాలే(అప్పడు భారతదేశం ఎంతో విశాలమైనది. స్పహ్స్టంగా ఇప్పుడున్న దేశం అందులో 30% కూడా ఉండదు). ఋగ్వేదంలో సప్తసింధు అనే పదం ఉంది. దాన్ని ఉచ్చారణలో మార్పులు, తేడాల కారణంగా హప్తహిందుగా కొందరు పలికేవారు. సప్త అంటే 7 అని అర్దం, అది హప్తగా మారింది, సప్తభుజి ని ఈ రోజు ఆంగ్లంలో Heptagon అంటున్నాం. అరబ్బుల ద్వారా భారతీయ గణితం, అంకెలు, సంఖ్యా విధానం (numeral system) పశ్చిమ దేశాలను చేరాయి. ఇస్లాం ఒక మతంగా పూర్తిగా రూపాంతరం చెందిన తరువాత, ఇతర దేశాలు, సంస్కృతులపై దండెత్తడం ప్రారభించింది. అందులో భాగంగా పర్షియా మీద దండయాత్ర చేసింది, అంటే ఇప్పటి ఇరాక్ మీద అన్నమాట. ఇస్లాం పర్షియాకు చేరకముందు అక్కడ పూరతనమైన వైదిక సంస్కృతి ఆచరణలో ఉండేది. 100 సంవత్సరాలలో మొత్తం పర్షియా, ఇస్లాం దేశంగా మారిపోయింది. ఇస్లాంను అంగీకరించని అనేకమంది దారుణంగా చంపివేయబడ్డారు. కొందరు ప్రాణభయంతో మతం మార్చుకున్నారు. ఆ సమయంలో పర్షియన్లు, ప్రక్కనే ఉన్న తమ సోదరులు వైదిక సంస్కృతిని ఆచరించడం, కనీసం భరతఖండంలోనైనా వైదిక ధర్మం రక్షించబడుతోందనే సంతోషంతో, తమ దగ్గరున్న హప్తహిందులో, హిందు అనే పదాన్ని ప్రయోగించి, ఇక్కడ ఉంటున్న ప్రజలను హిందువులంటూ ఒక గుర్తింపునిచ్చారు. తొలిసారి ఇక్కడే హిందు అనే పదం ప్రయోగించబడిందని కొందరి వాదన.

క్రీ.శ.1000 వరకు ఆఫ్ఘనిస్థాన్‌లో సనాతన ధర్మమే ఉందనడంలో ఎటువంటి సందేహంలేదు. అటు తర్వాత ముస్లిం రాజులు గాంధార చేరుకున్నారు. ఈ ప్రాంతంలో అద్భుతమైన పర్వతశ్రేణి ఉంది. ఆఫ్ఘనిస్థాన్‌లో హిందువుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. వారిని అనేక వక్రమార్గాల ద్వారా ఓడించి, వైదిక సంస్కృతిని అణిచివేశారు. హెరాత్ అనే ప్రాంతంపై ఈ మూకుల దాడి కారణంగా 15 లక్షల మంది కనిపించకుండా పోయారని అఫ్ఘన్ చరిత్రకారుడు నమోదు చేశారు. ఎంతో దారుణంగా అనేకమందిని పొట్టనబెట్టుకున్నారు. మతం మారనివారిని బానిసలుగా తీసుకుని పోయారు. చిన్న పిల్లలను బానిసత్వం కోసం తరలిస్తూ ఉండగా, అనేకమంది చలి తట్టుకోలేక మరణించారు. హిందువులపై ఈ ప్రాంతంలో జరిగిన అరచకానికి గుర్తుగా, ఇక్కడున్న పర్వతశ్రేణులకు హిందుకుష్ అనే పేరు వచ్చింది. హిందుకుష్ అంటే పర్షియ భాషలో హిందువుల అణిచివేత, నరికివేత అని అర్దం. చరిత్రలో విజయం సాధించినవారు తమ పేరు మీద ప్రాంతాలకు గుర్తింపునిస్తే, హిందుకుష్ పర్వతాలు మాత్రమే అణిచివేయబడ్డవారి జ్ఞాపకంగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయాయి. ఒకవేళ మనకు పరాయి మతస్థులు హిందు అనే శబ్దం ప్రయోగించి ఉంటే, సింధు నదిని దాటకముందే, హిందుకుష్ అనే పదం ఉద్భవించింది. అంటే హిందు అన్న పదం పరాయిపాలనకు ముందు నుంచే ఉన్నదని స్పష్టమవుతోంది.

To be continued ....................

Wednesday 16 July 2014

హిందూ ధర్మం - 98

ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ప్రపంచదేశాల మీద తన ప్రభావాన్ని చూపిన సనాతన సంస్కృతి తనకు ఒక పేరు పెట్టుకోలేకపోయిందని కొందరు కుహనా చరిత్రకారులు వాదిస్తున్నారు.

మొదటిసారి పర్షియా నుంచి ఇస్లాం రాజులు దండయాత్రలకు వచ్చినప్పుడు సిందూ నది అవతల ఉన్న ఈ ప్రదేశాన్ని గుర్తించారని, తమ భాషలో స్ అని శబ్దం, స, ష అనే పదాలు లేక సిందూనదికి ఆవలి ఉన్న ప్రాంతాన్ని హిందూ అన్నారని ఆంగ్లేయ చరిత్రకారులు రాశారు. అంతేకాదు, ఈ సంస్కృతి తనకంటూ ఒక గుర్తింపు ఇచ్చుకోలేకపోయిందని చెప్పారు. ఇంకొక విషయం హిందు అంటే చోర్, దొంగ అనే అర్ధాలు వారి భాషలో ఉన్నాయని చెప్తున్నారు. ఇది ఎంత అబద్దమో చూడండి. వారి వాదనలో ఏ మాత్రం తర్కం (logic) లేదు.

ఒకవేళ పర్షియన్లకు 'స'/ 'ష' / S అనే అక్షరం లేకపోతే, ఆ అక్షరానికి బదులుగా వారు హ/H పలికి ఉంటే, వాళ్ళదేశం పర్షియాకు బదులుగా పర్హియా అయ్యేది. కాదంటారా? వాళ్ళ భాషలోనే ఆయా పదాలు ఉన్నాయి. కనుక ఈ వాదనలో పసలేదు. ఆ సమయంలో భారత్ సుసంపన్నమైన దేశం. అని రంగాలలో అద్భుతంగా రాణిస్తున్న దేశం. చరిత్ర పరిశీలిస్తే, మెగాస్తీనిస్ అనే విదేశీయాత్రికుడు, గ్రీకు దేశస్థుడు, తన పుస్తకమైన ఇండికాలో 'నేను అబద్దం చెప్పిన హిందువును చూడలేదు. హిందువులు ఎంతో నిజాయతీపరులు' అని రాశారు. ఆయన క్రీ.పూ.350 కి చెందినవాడు. ఇట్లాగే అనేకమని హిందువుల గొప్పతనం గురించి తమ తమ గ్రంధాల్లో రాసుకున్నారు. 150 ఏళ్ళ క్రితం మెకాలే బ్రీటిష్ పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ, నేను భారతదేశం మొత్తం తిరిగాను, కానీ అబద్దం చెప్పేవాడు, మోసగాడు, బిచ్చగాడు, దొంగైనవాడు నాకు ఒక్కడు కూడా కనపడలేదు. ఎంతో గొప్ప విలువలున్న సమాజం హిందువులది అని చెప్పినమాటలు ఇప్పటికి బ్రీటిష్ రికార్డుల్లో చూడవచ్చు. 2,000 ఏళ్ళ క్రితం నుంచి, మొన్నటివారుకు భారతదేశాన్ని సందర్శించినవారు మెచ్చుకుంటే, చోరులను ఒక దేశస్థులకు పేరు ఎలా పెట్టగలరు?

ఆ కాలంలో తమ మతాన్ని అంగీకరించని వారినందరిని బానిసలుగా చేసుకుని, ఊచకోతలు కోసి, మతప్రచారం సాగించారు విదేశీయులు. రాజ్యాలను రక్తపాతం మీద స్థాపించారు. అందులో భాగంగా తొలిసారి అరబ్బులు హిందూ అన్నపదాన్ని వాడారని కొందరి వాదన. వారి ప్రకారం హిందూ అంటే నల్లనివారు, బానిసలు అని, ఇంకా అనేకానేక అర్ధాలున్నాయని చెప్తారు. కానీ ఇది కూడా సత్యం కాదు.

To be continued ..............

Tuesday 15 July 2014

త్ర్యక్షర గణపతి

ఆధ్యాత్మికజ్ఞానాన్ని వర్షిస్తాడు త్ర్యక్షర గణపతి

।। ॐ गं गणपतये नमः ।।
ఓం గం గణపతయే నమః

త్ర్యక్షర గణపతి, 32 గణపతి రుపాల్లో 19వ రూపం. ఈయన ఓంకారానికి సంకేతం. త్ర్యక్షర గణపతి అ, ఉ, మ అనే మూడు ధాతువుల నుంచి ఏర్పడ్డ బీజాక్షరాలకు అధిదేవత. బంగారువర్ణంతో, త్రినేత్రం, చతుర్భుజాలు, తొండంతో ఉండ్రాళ్ళు పట్టుకుని దర్శనమిస్తాడు త్ర్యక్షర గణపతి. అంకుశం, దంతం, మామిడిపండు, పాశాలను ధరించి ఉంటాడు. ఆధ్యాత్మికజ్ఞానాన్ని వర్షిస్తాడు ఈ గణపతి. రోజు ఓంకారాన్ని ధ్యానం చేసేవారికి సిద్ధి కలుగుతుంది. ఈ గణపతి ఆలయం తిరుమకుదలు దేవాలయం, నర్సిపుర, మైసూర్ దగ్గరలో కర్ణాటకలో ఉంది. మైసూరు జిల్లాలోని చంరాజనగర్, నంజన్‌గుడ్ దెవాలయాల్లో కూడా త్ర్యక్షర గణపతిని దర్శించవచ్చు.

చిత్తానక్షత్ర జాతకులు ఈ రూపంలో ఉన్న గణపతిని పూజిస్తే, మంచి ఫలితాలు ఉంటాయి.

ధ్యానశ్లోకం:

గణేంద్రవదనం సాక్షాత్ చలత్‌కర్ణ సుచామరం
హేమవర్ణం చతుర్భాహుం పాశంకుశధరం వరం !
స్వదంతం దక్షిణేహస్తే సవ్యేత్వామ్రఫలంతథా
పుష్కరే మోదకంచైవ ధారయంతముస్మరేత్!!

ఈయనను 9 సార్లు జపించినవారు అజ్ఞానవిముక్తులవుతారు.    

Tryakshara Ganapati is the 19th among the 32 forms of Lord Ganesha and symbolizes the primordial sound “OM”. Tryakshara Ganapathi means “the lord of three letters” from Bheejashara, the three seed letter called 'A', 'U' and 'M' combines to give “AUM”. In this form, Lord Ganesh appears in golden complexion with four hands and third eye on his fore head. He has big floppy ears with fly whisks. His trunk is curled towards the left holding his favorite sweet Modaka. In his four hands, the right hands holds tusk and elephant goad, and on his left hands holds mango and a noose.


Chitra Nakshatra is related to Tryakshara Ganapati. Worshipping this form of Ganesha is believed to bestow spiritual knowledge. By meditating the primordial sound daily the devotee can attain self-realization.  Tryakshara Ganesha can be worshipped in Tirumakudalu Temple in Narasipura, Karnataka. Also temples in Chamarajanagar  and Nanjangud in Mysore district of Karnataka has 32 forms of Ganapati sculptures.

Tryakshara Ganapati Mantra

Gajendravadanam Sakhshat Chalatkarna Suchaamaram
Hemavarnam Chaturbahum Pashankushadharam Varam!
Svadantam Dakshine Haste Savyetvamraphalamtathaa
Pushkare Moodakam Chaiva Dharayantamusmaret!!

English Translation and Meaning 


“The Three-letters 'A', 'U' and 'M' Ganapati". He has four arms. His hands hold the single tusk, the elephant goad, the noose and the mango. He holds the cake modaka with the trunk end.
Source: http://www.hindudevotionalblog.com/search/label/ganapathi32forms

Thursday 10 July 2014

గురు పూర్ణిమ విశిష్టత - 3

తను విభజించిన వేదాలను తన నలుగురు శిష్యులకు అప్పగించి ప్రచారం చేయించారు. ఎంతో జటిలమైన వేదవిభజన చేయడంతో బ్రహ్మ ఆనందం పొంది మహర్షిని వేదవ్యాస అన్నారు. అందుకే వేదాన్ వ్యస్యతి ఇతి వేదవ్యాసః అంటారు. వేదవ్యాసా! నాకు పుత్రుడివై, వేదాలను విభజించి, నన్ను ఆనందపెట్టవు. ఇలాగే అన్ని మన్వంతరాలలో, ద్వాపరంలో జన్మిస్తూ, వేద విభజన చెయ్యి' అని అపాంతరముడికి విన్నవించాడు బ్రహ్మ. అప్పటి నుంచి ప్రతి మన్వంతరంలో వేదవ్యాసుడు జన్మిస్తున్నాడు. అయితే వేదవ్యాసుడనేది పదవి నామమే అని, వ్యక్తి నామం కాదని చెప్తారు పెద్దలు. మొదట స్వాయంభువ మనవు వేదవ్యాసుడు కాగా, రెండో మన్వంతరంలో ప్రజాపతి, మూడవ మన్వంతరంలో శుక్రుడు వ్యాసులయ్యారు.

వేదవ్యాసునికి బాదరాయణుడు, అపాంతరముడని వ్యవహార నామాలు. ఇప్పటి వ్యాసమహర్షికి కృష్ణద్వైపాయనుడని పేరు. నల్లని వరణం కలిగినవాడు కనుక కృష్ణ అన్నారు, యమునా నదీ ద్వీపంలో ప్రకటితమయ్యాడు కనుక ద్వైపాయనుడన్నారు.

వ్యాసమహర్షి వేద విభజన చేసి ఆపలేదు. లోకులకు వేదసారం త్వరగా అర్దమవ్వాలని పంచమవేదమైన మహాభారత ఇతిహాసాన్ని లిఖించారు. అప్పటికి అర్దం కానివారుంటారని వేదం సులువుగా అర్దమవ్వడం కోసం అనేక మన్వంతరాలలో జరిగిన ఘట్టాలను ఏర్చి, కూర్చి, 18 పురాణాలను, 32 ఉపపురణాలను రచించారు. ఇంకా లోకులకు ఉపకారం చేయాలన్న తపనతో భక్తిని ప్రసాదించే భగవద్ లీలల సమాహారమైన భాగవతాన్ని అందించారు. ఇంత మేలు చేసిన వ్యాసమహర్షికి కృతజ్ఞతగా గురుపూర్ణిమ పేరుతో ప్రజలు తమ తమ గురువులలో వ్యాసమహర్షిని చూసుకుని, ఆరాధిస్తారు. వ్యాసుడి అంశలేని వారు వేదవేదాంతల బోధ చేయలేరు. ప్రతి గురువులో వ్యాసుడు ఉంటాడు. గురుపూర్ణిమ వ్యాసుని కోసం వచ్చింది. అది వ్యాసపూర్ణిమ. ఆ రోజు తమ తమ గురువులలో వేదావ్యాస మహర్షి చూసుకుని పూజించాలి.

వ్యాసుడు చిరంజీవి. ఇప్పటికి తపస్సు చేసుకుంటూ దేహంతో ఉన్నారు. బద్రీనాధ్ దగ్గరలో కొందరికి దర్శనమిస్తారు. వేద విభజన చేసాక వ్యాసులవారు హిమాలయ పర్వత గుహలోకి వెళ్ళారు. తరువాత ఆయన సంకల్పం చేత ఒక పెద్ద మంచుచర్య విరిగిపడి, ఆ గుహ ద్వారం మూసుకుపోయింది. వ్యాస మహర్షి దర్శనం ఆదిశంకరాచార్యులవారికి కాశీలో కలిగింది. అటుతర్వాత భారతీయ గణిత శాస్త్రజ్ఞుడైన భాస్కరాచార్యులవారికి కలిగింది.  

To be continued .................

Ashtavakra Gita - Instruction on Self-Realization

Ashtavakra Gita
Instruction on Self-Realization

Janaka said:
1.1 
Master, how is knowledge to be achieved,
detachment acquired, liberation attained?

Ashtavakra said:
1.2
To be free,
shun the experiences of the senses like poison.
Turn your attention to
forgiveness, sincerity, kindness, simplicity, truth.

1.3
You are not earth, water, fire or air.
Nor are you empty space.
Liberation is to know yourself
as awareness alone—the Witness of these.

1.4
Abide in awareness
with no illusion of person.
You will be instantly free and at peace.

1.5
You have no caste or duties.
You are invisible, unattached, formless.
You are the Witness of all things.
Be happy.

1.6
Right and wrong, pleasure and pain,
exist in mind only.
They are not your concern.
You neither do nor enjoy.
You are free.

1.7
You are the solitary Witness of All that is,
forever free.
Your only bondage is not seeing This.

1.8
The thought, “I am the doer,”
is the bite of a poisonous snake.
To know, “I do nothing,” is the wisdom of faith.
Be happy.

1.9
A single understanding, "I am the One Awareness,"
consumes all suffering in the fire of an instant.
Be happy.

1.10
You are unbounded awareness—bliss, supreme bliss—
in which the universe appears
like the mirage of a snake in a rope.
Be happy.

1.11
It is true what they say, “You are what you think.”
If you think you are bound you are bound.
If you think you are free you are free.

1.12
You are Self—the solitary Witness.
You are perfect, all-pervading, One.
You are free, desireless, forever still.
The universe is but a seeming in You.

1.13
Meditate on this: “I am Awareness alone—Unity itself.”
Give up the idea that you are separate, a person,
that there is within and without.

1.14
You have long been bound, thinking, “I am a person.”
Let the knowledge, “I am Awareness alone,”
be the sword that frees you.

1.15
You are now and forever
free, luminous, transparent, still.
The practice of meditation keeps one in bondage.

1.16
You are pure consciousness—the substance of the universe.
The universe exists within you.
Don’t be small-minded.

1.17
You are unconditioned, changeless, formless.
You are solid, unfathomable, cool.
Desire nothing.
You are consciousness.

1.18
That which has form is not real.
Only the formless is permanent.
Once this is known, you will not return to illusion.

1.19
Just as a mirror exists both within and without
the image reflected,
so the supreme Self exists
both within and without the body.

1.20
Just as the same space exists
both within and without a jar,
the timeless, all-pervasive One
exists as Totality.

~Ashtavakra Gita



Via Sri Ramana Maharshi Teachings. श्री रमण महर्षि के उपदेश

Wednesday 9 July 2014

గురు పూర్ణిమ విశిష్టత - 2

12 జూలై 2014, శనివారం, ఆషాడ పూర్ణిమ, గురుపూర్ణిమ సందర్భంగా .......

బ్రహ్మ శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలో నుంచి పుట్టాడు, కనుక బ్రహ్మదేవుడిని పద్మభువుడు అన్నారు. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కుమారుడు. విష్ణువుమూర్తి తనకు ప్రసాదించిన జ్ఞానాన్ని, బ్రహ్మ విద్యను, వేదాన్ని బ్రహ్మ తన కుమారుడైన వశిష్టమహర్షికి, వశిష్టుడు తన పుర్తుడైన శక్తి మహర్షికి, శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు. ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయింది, కోట్ల సంవత్సరాలు కాలంలో వెళ్ళిపోయాయి, ఎందరో మహానుభావులు పుట్టారు, ఎందరో ముక్తిని పొందారు. అనేక మందికి ఈ మహాజ్ఞానం ఉపదేశించబడదింది. వశిష్టమహర్షి 24 వ త్రేతాయుగంలో శ్రీ రామచంద్రునికి, లక్ష్మణునికి గురువుగా యోగవిద్యను బోధించారు. ఆ మహాయుగం గడిచిపోయింది, ఇంకా 3 మహాయుగాలు గడిచి 28 వ మహాయుగం ప్రారంభమైంది. సత్యం యుగం దాటింది, త్రేతాయుగం వెళ్ళిపోయింది, ద్వాపరయుగం ఆఖరికి చేరుకుంది. ఇంతలో మహాభారత యుద్ధం జరిగింది. ఇంతకాలం గడిచినా వేదం ఎప్పుడు గ్రంధస్థం కాలేదు. గురువుల ద్వారా విని నేర్చుకునేవారు. అందుకే వేదానికి 'శ్రుతి' అని పేరు వచ్చింది.

ఈ వేదాన్ని సమాధి స్థితిలో ఉన్న ఋషీశ్వరులు విన్నారు. పరమాత్మ వారికిచ్చిన వేదం ఒకటిగానే ఉండేది. అంతా కలిసిపోయి ఉండేది. దానికి తోడు, మధ్యకాలంలో అనేకమంది తమ అనుభూతులు ద్వారా, సమాధి స్థితి ద్వారా అనేకానేక విషయాలను వేదం నుంచి వెలికితీశారు. ఇదంతా పెద్ద జ్ఞానరాశి. ఒక వ్యక్తి వీటిని సక్రమంగా అర్దం చేసుకోవడం దుర్లభంగా ఉండేది. ఈ విషయాన్ని వ్యాసమహర్షి గుర్తించారు.

రాబోయేది కలియుగం. కలియుగ జనంలో భక్తి తక్కువగా ఉంటుంది, ఆయుషు (జీవితకాలం) తక్కువ (100-120 ఏళ్ళు), అధికశాతం ప్రజలు మందబుద్ధులుగా ఉంటారు. జ్ఞాపకశక్తి గొప్పగా ఉండదు. మహాభారత యుద్ధం కారణంగా వేదపండితులనేకమంది మరణించారు. వైదిక సంస్కృతి దెబ్బతింది. ఇలా సాగితే, కలియుగజనం ఎట్లా తరిస్తారు? ఆ సందేహం వ్యాసమహర్షికి కలిగింది. ఋషి భవిష్యత్తును దర్శనం చేయగలడు. కనుక అన్ని విషయాలను గమనించి కలియుగ ప్రారంభానికి ముందు వ్యాసమహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదాలుగా విభజించారు. ప్రపంచ నలుమూలల ఉండే 88,000 మహర్షులను భారతదేశానికి ఆహ్వానించి, వేదసభ ఒకటి నిర్వహించి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంధస్థం చేశారు.

To be continued ............

Tuesday 8 July 2014

గురు పూర్ణిమ విశిష్టత - 1

ఆషాడ పూర్ణిమ, గురుపూర్ణిమ.

భారతీయ సంస్కృతిలో గురువులది ప్రత్యేకస్థానం. యోగ సంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి. సిద్ధసంప్రదాయంలో శివుడే ఆదిగురువు. గురుపరంపరకు ఆద్యుడు నారయణుడు. ఈ సృష్టిలో శివుడు, శక్తి, విష్ణువు పరబ్రహ్మ యొక్క ముఖ్యమైన ప్రతిబింబాలు. నిరాకారము, శూన్యము, ఆద్యంతరహితమైన తత్వం, అవ్యక్తమే శివుడు. నిరాకారం సాకారమైనప్పుడు, అవ్యక్తం వ్యక్తమై సృష్టిగా ఏర్పడడమే శక్తి, పార్వతీ దేవీ. సృష్టి మొత్తం జడమనుకుంటే, ఆ జడత్వంలో ఉన్న చైతన్యం, ప్రాణశక్తి శ్రీ మన్నారాయణుడు. బ్రహ్మ దేవుడు, మహర్షులు మొదలైన అనేకమందికి జననమరణాలు, జన్మలు ఉన్నా, వీటన్నిటికి అతీతులు శివ, శక్తి, విష్ణువులు. వీరిని ముగ్గురిగా చెప్పుకున్నా, నిజానికి వీరు ఒక్కరే, తత్వం ఒకటే.

సనాతనధర్మం ప్రకారం ఈ సృష్టి క్రమానికి ఆది, అంతము అంటూ ఉండవు. సముద్రపు అలలపై ఏర్పడే నురుగులో ప్రతి క్షణం కొన్ని వేల బుడగలు పుడుతుంటాయి. కొన్ని వేలు నీటిలో కలిసిపోతుంటాయి. అట్లాగే పరమాత్ముడి సృష్టిలో అనేక జగత్తులు నిత్యం ఉద్భవిస్తుంటే, అనేకం లయమవుతుంటాయి. సృష్టి ఏర్పడే క్రమాన్ని సనాతన ధర్మం శాశ్త్రీయంగా కూడా వివరించింది. వాటిలో అణువుల కదిలకలకు ప్రతీక నటరాజ స్వాన్య్. శివుడు ఎప్పుడు తాండం చేస్తూనే ఉంటాడు నటరాజు రూపంలో. ఆయన తాండవం ఆగదు. పరమశివుడి తాండవ స్మయంలో ఆయన చేతి ఢమరుకం నుంచి నాదం(శబ్దం) పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. సృష్టికి మొదట నాదం రూపంలో పరబ్రహ్మ వ్యక్తమయ్యాడు కనుక నాదబ్రహ్మం అని అంటాం. నాదం నుంచి ప్రణవం (ఓంకారం), వేదం వచ్చాయి. ఈ వేదాన్ని సర్వవ్యాపకుడైన శ్రీ మహా విష్ణువు బ్రహ్మదేవునకు ఉపాదేశించాడు(శివకేశవులకు బేధం లేదు, ఇద్దరూ ఒకే పరమాత్మ యొక్క భిన్న కోణాలు). కనుక శ్రీ మహావిష్ణువును గురుపరంపరలో మొదటివాడిగా చెప్పుకుంటున్నాం. అందుకే అద్వైత గురు పరంపర స్తోత్రం 'నారయణ సమారంభాం' అంటూ ప్రారభమవుతుంది. బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు. అందుకే వేదోఖిలం జగన్మూలం అన్నారు అంటే వేదమే జగత్తునకు మూలమై ఉన్నది అని అర్దం. దేవతలను, మానవులను, దానవులను సృష్టించాడు. వేదం ఆధారంగా ధర్మాన్ని ఏర్పరిచాడు.

To be continued ..............

Sunday 6 July 2014

షిరీడి సాయి

ఈ మధ్య షిరీడి సాయినాధుడి పై రేగిన వివాదం గురించి చాలామంది మిత్రులు నన్ను వివరణ అడిగారు. దానికి నేను చెప్పదలుచుకున్నది ఇదే

సనాతన హిందూ ధర్మంలో ఈ లోకమంతా దైవమే. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ అని ఈశావాశ్యోపనిషద్ అంటుంది. ప్రతి అణువు కూడా దైవమే, దైవం లేని ప్రదేశమంటూ ఏదీ లేదు. అన్నీ తానై ఉన్నాడు పరమాత్మ. ఈశ్వరుడికి, జీవుడికి బేధం ఉపాధి మాత్రమేనని రమణ మహర్షి ఉపదేశం. ఉపాధి అంటే శరీరం, దానితో పాటు ఉన్న కామక్రోధాది అరిషడ్వర్గాలు, అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని తొలగిస్తే, జీవుడు ఈశ్వరుడినితో ఏకమవుతున్నాడు. ఆత్మానుభూతి పొందిన జ్ఞాని లోకంలో తిరిగే దైవం. దైవానికి, ఆత్మను తెలుసుకున్న జ్ఞానికి తేడా లేదు. అందరిలోనూ దైవం ఉన్నాడు. కనుక ఒక వ్యక్తి దేవుడా? కాదా? అన్న దానికి సమాధనం మన దగ్గరే ఉంది.

అయితే వేదం మనకు కొన్ని దైవరూపాలను నిర్దేశించింది. వారిని దైవాలుగా ఆరాధించాలి. ఆ దైవాన్ని చేరే మార్గాన్ని చూపించే వ్యక్తే గురువు. శ్రీ సాయిబాబా కూడా గురువే. గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, పరబ్రహ్మ కూడా. గురువు పాదాలపై మనసు లగ్నం కానీ వాడికి ఎన్ని సంపదలుంటే మాత్రం ఏం లాభం అంటారు ఆది శంకరులు. నాకు భగవంతుడు, గురువు ఇద్దరూ ఏకకాలంలో కనిపిస్తే, ముందు గురువుకే నమస్కరిస్తాను అన్నారు కబీర్. ఎందుకంటే భగవద్ దర్శనానికి తగిన మార్గం చూపించింది గురువే కనుక. అందువల్ల సాయిబాబాను గురువుగా పూజించడంలో తప్పులేదు. కానీ గురువు పూజల వల్ల సంతోషించడన్న విషయం ఎప్పుడు మరువకూడదు. అసలు గురువు ఎప్పుడు తనను పూజించమని కోరడు. గురువు శరీరంతో ఉన్నది పదిమందిని ఉద్దరించడానికే. ఆయనకు శరీరంతో పనేలేదు. కానీ తన జీవితంలో అనేక బోధనలు చేసి, తాను కొన్ని స్వయంగా ఆచరించి తన శిష్యులకు మార్గం చూపిస్తారు. ప్రతీ వ్యక్తికి తన జీవితంలో ఎదురయ్యే వేల ప్రశ్నలకు సమాధానాలన్నీ గురువు ముందే చెప్పి ఉంటారు. గురువును ఏ విధంగా పూజించాలనే సందేహం వస్తే, దానికి ఒక్కటే జవాబు. గురువు బోధనలను జీవితంలో ఆచరించడం, ఆయన చెప్పినట్టు జీవించడమే గురుపూజ. బాబా చెప్పినట్టుగా జీవించడమే బాబాకు చేసే మహోన్నతమైన పూజ.

బాబా మందిరంలో విగ్రహం క్రింది ప్రతిష్ట చేసేది దత్త యంత్రమే. సాయిబాబాకు ప్రత్యేకించి యంత్రం అంటూ ఏదీ లేదు. సాయిబాబాను దత్తాత్రేయ అవతారంగా, అబధూతగా పుజిస్తారు భక్తులు. ఇక బాబా మతం గురించి ప్రస్తావన తెచ్చారు. ఒక గురువుకు మతం అంటగట్టకూడదు కానీ, ఒకవేళ అలా చెప్పవల్సి వస్తే, బాబా శివపార్వతుల అంశతో, తెలంగాణాలో (అప్పటి హైద్రాబాదు సంస్థానంలో) బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారని సత్యసాయిబాబా చెప్పారు.

భక్తుడి భక్తి మెచ్చిన భగవంతుడే, గురువు రూపంలో దిగివచ్చి, భక్తుడిని అంతర్ముఖం చేసి, జ్ఞానం ప్రసాదిస్తారని రమణ మహర్షి చెప్పినమాటను మర్చిపోకూడదు. అయినా గురువుల విషయంలో ఇలాంటి చర్చలు అనవసరం. 

Saturday 5 July 2014

ఐకమత్యంతో మెలగండి - ఋగ్వేదం

ఐకమత్యంతో మెలగండి
సంగచ్ఛధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతామ్ |
దేవా భాగం యథా పూర్వే సంజనానా ఉపాసతే ||
సమానో మన్త్రః సమితిః సమానీ
సమానం మనః సహా చిత్తమేషామ్ |
సమానం మన్త్రమభిమన్త్రయే వః |
సమానేన వో హవిషా జుహోమి ||
సమానీవ ఆకూతిః సమానా హృదయాని వః |
సమానమస్తు వో మనో యథా వః సుసహాసతి ||
(ఋగ్వేదం - సంవననసూక్తం)
ఐకమత్యంతో కలసి పనిచేయండి. ముక్తకంఠంతో మాట్లాడండి. ఏకాభిప్రాయులై ఉండండి. పూర్వం దేవతలు యాగంలో ఏవిధంగా తమవంతు భాగాన్ని ఐకమత్యంగా స్వీకరించారో ఆ విధంగా మీరు ఐకమత్యంగా ఉందురుగాక!
మీ ప్రార్థన ఏకాబిప్రాయం గలదై ఉండుగాక! మీ సభలు ఐకమత్యంతో నెలకొనుగాక! మీ ఆలోచనలన్నీ ఎకమగును గాక! మీ నిమిత్తం ఉమ్మడి ప్రార్థన చేస్తాను. ఉమ్మడి ఆహూతులతో ఆరాధిస్తాను. మీ సంకల్పం ఒక్కటైనదిగా ఉండుగాక. మీ మధ్య అద్భుతమైన సామరస్యం నెలకొనుగాక!
(వేదాంతభేరి, జూన్ 2014)

Friday 4 July 2014

హిందూ ధర్మం - 97

18వ శతాబ్దంలో థాయి రాజ్యంపై మయన్మార్ (బర్మా) దండయాత్ర చేసి, రాజుని పదవీభ్రష్టుడిని చేసింది. దాంతో అప్పటి వరకు ఉన్న అమూల్యమైన రచనలు నశించాయి. తర్వాత బ్యాంకాక్‌కు రాజధాని మార్చిన రాజు రామ, ముందు చేసిన పని రాంకీన్ (అంటే రామ్యాణాన్ని) తిరిగి రచించమన్నారు. రాంకీన్‌కు సంబంధించిన కొన్ని పెయింటిగులను ఈ రోజుకీ మనం బ్యాంకాక్‌లో చూడవచ్చు. అనేక చోట్ల రాంకీన్ రచనలోని విగ్రహాలు కనిపిస్తాయి. ఆఖరికి ధాయిల్యాండ్‌లో ప్రసిద్ధమైన కిక్‌బాక్సింగ్ కూడా రామాయణంలోని వాలి, సుగ్రీవులు సేనాబలాన్ని ఆధారంగా చేసుకుని తయారు చేసుకున్నారట. ఇప్పుడది అంతర్జాతీయ ఒలంపిక్స్‌లో ఆడుతున్నారు. ఈ ఉదాహరణ ఒక్క ధాయిల్యాండ్‌పై సనాతనధర్మం యొక్క ప్రభావాన్ని చూపిస్తోంది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే థాయిల్యాండ్ జాతీయ గ్రంధం రాంకీన్ (రామాయణం).

మహాభారతంలో దృతరాష్ట్రుని భార్య అయిన గాంధారి పేరు మీద వచ్చిన నగరం గాంధార నగరం. కాలక్రమంలో గాంధహార్‌గా, అటు తర్వాత ఖందహార్‌గా మారింది. ఇప్పుడది ఆఫ్ఘనిస్థాన్‌లో ఉంది. ఇండోనేషియా దగ్గరలో బాలి అనే దేశం ఉంది. ఆ పేరు బలి చక్రవర్తి నుంచి తీసుకున్నారు. బాలి గురించి హిందువులు చెప్పుకోదగ్గ అంశాలు రెండు ఉన్నాయి. ఒకటి అక్కడున్న హిందూ జనాభా భారతలో ఉన్న హిందుజనాభా నిష్పత్తికంటే అధికం. రెండవది బాలిలో అనేక తాళపత్ర గ్రంధాలు లభ్యమవుతున్నాయి. బాలీనీస్ బాష కూడా మలయాళం, సింహలీస్ (శ్రీ లంక) భాషలకు దగ్గరగా ఉంటుంది. కాంబోజ రాజ్య కంబోడియాగా మారింది.

రామయాణంలో యావకోటి అనే ద్వీపాల గురించి ప్రస్తావన ఉంది. యావద్వీపానికి సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు తన సేనలను పంపించాడు. యావ అంటే బార్లీ మొక్కజొన్న అని, ద్వీపం అంటే ఆంగ్ల భాషలో ఐల్యాండ్ అని అర్దం, వేల ఏళ్ళ క్రమంలో యావద్వీపం, జావాద్వీపంగా, ఇప్పుడు జావాగా మరింది. ఈ రోజు ప్రపంచ చిత్రపటంలో జావ అనే దేశం ఉంది. దాని పేరు కూడా సనాతన సంస్కృతి నుంచే వచ్చింది. అదే రామాయణం బర్మాలో వెండి గనులు ఉన్నాయని చెప్పింది. ఆ మాట యధార్దమని ఈ రోజు ప్రపంచం అంగీకరిస్తోంది.

ఈ విధంగా చెప్పుకుంటూ పోతే, ఒకటరెండా, సనాతన ధర్మం యొక్క ప్రభావం ప్రపంచనాగరికతపై కొన్ని వేల ఏళ్ళ నుంచి ఉంది.

To be continued ............

Thursday 3 July 2014

హిందూ ధర్మం - 96 (ప్రపంచానికి నామకరణం చేసిన భరతమాత)

ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుసుకోబోతున్నాం. ప్రపంచదేశాలకు పేరు పెట్టిన ఘనత భారతమాతకు, సనాతన హిందూ ధర్మానికే దక్కింది. ఇది భారతీయులు అత్యంత గర్వించదగ్గ అంశం.  ప్రపంచవ్యాప్తంగా సనాతనధర్మం యొక్క ప్రభావం ఎంతగా ఉండేదో, ఈ విషయం తేటతెల్లం చెస్తోంది. ఎప్పుడో త్రేతాయుగంలో రామాయణం జరిగింది. దాన్ని వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించారు. కానీ ఇప్పుడు ప్రపంచంలో 300 పైగా రామాయణ గ్రంధాలు ఉన్నాయి. ఇవి అనువాదాలు కాదు సుమా! ఆయా దేశాల ప్రజలు, రామాయణంలో ఉన్న విలువలను, సనాతన హైందవ ధర్మం గొప్పతనాన్ని గుర్తించి, తమ దేశంలో రామాయణం రచించారు. రామాయణం ముందుగా ఆగ్నేయ-ఆసియా దేశాలకు తరళి వెళ్ళింది. ఇక్కడ ఓ గొప్పతనం ఉంది. ప్రపంచంలో ఇతర మతస్థులు, వారి మతగ్రంధాలను ఒక చేత, కత్తులను ఇంకో చేత పట్టుకుని, రక్తపాతం చేస్తూ, మతప్రచారాన్ని సాగించి, జనంలో అశాంతిని రగిల్పి శాంతిని ప్రభోదించారు. కానీ హిందువులు (భారతీయులు) ఆ పని ఎప్పుడు చేయలేదు. రామయాణ విలువలను గుర్తించి ఎన్నో దేశాల ప్రజలు, మన వాల్మీకి రామయణాన్ని తమ దేశాలకు తీసుకెళ్ళి, అక్కడి పరిస్థితికి అనుగుణంగా కొంత మార్పు చేసి, తరతరాలుగా భోధిస్తున్నారు.

కంబొడియా వారు రాంఖెర్ అని, థాయిల్యాండ్ వారు రాంకిన్ గా రాముడిని సంబోధిస్తున్నారు. ఇండోనేషియా, మయలేషియా, విటెనం, చైనీయులు, కొరియన్లు, జపనీయులు, మంగోలులు, సైబేరియా దేశస్థులు, టిబెట్, బర్మా, పాకిస్థాన్, నేపాల్, పురారన తుర్కుషులు, అరబ్బులు, పర్షియన్లను సంస్కృత రామాయణ స్పూర్తితో తమ తమ రామాయాణాలను రచించుకున్నారు.

ఒకప్పుడు థాయిల్యాండ్ రాజధాని పేరు అయుత్థయా (Ayutthaya) అని ఉండేది. శ్రీ రాముడు రాజధాని అయోధ్యా నగర స్పూర్తితో వారు తమ భాషలో ఆ పేరును పెట్టుకున్నారట. అట్లాగే రాముని కుమారుడు లవుని పేరుతో లవపురి అనే పురాతన నగరం ధాయిల్యాండ్‌లో ఉండేది. అప్పుడు ధాయి రాజు పేరు భూమిపాల్ అతుల్యతేజ్ రామ (ఇతను ఈ పేరుతో తొమ్మిదవ తరం వాడు). లాఓస్ (Laos) దేశం పేరు కూడా లవుడి పేరు నుంచి పెట్టారు అక్కడి రాజులు. బర్మ అన్న దేశం పేరు బ్రహ్మ అనే పదం నుంచి వచ్చింది. ఇక్కడ కూడా ఒకనాడు సనాతన హిందు ధర్మం ఉంది. ఇక వియట్నం పూర్వనామం చంపా. సింగపూర్ కూడా సంస్కృత పదం నుంచే వచ్చింది. దాని అర్దం సింహాల యొక్క నగరమని. ఇప్పటి ముస్లిం దేశం భ్రూనై రాజధాని పేరు బంఢార్ సెరి భగవాన్. బంఢార్ శ్రీ భగవాన్ అనే నామం నుంచి వచ్చిందే. ఇండోనేషియా రాజధాని జకర్తా పూర్వనామం జయ కర్త అంటే ఎప్పుడు జయాలను చేకూర్చేది అని అర్దం.

To be continued .........

Wednesday 2 July 2014

హిందూ ధర్మం - 95 (విశ్వవ్యాప్తమైన సనాతనధర్మానికి ఆధారాలు)

2012 యూగాంతం అంటూ మయా నాగరికతలోని రాతలకు తప్పుడు అర్ధాలు వల్లించి కొందరు ప్రపంచాన్ని హడలుగొట్టారు. అసలు యుగాంతం గురించి తమ లిపిలో ఉన్నట్టు మయానాగరికత ప్రజలకే తెలియదట. కానీ మీడియా మాత్రం తెగ కధనాలు ప్రసారం చేసి, మయాలిపిపై బురద చల్లింది. మయాన్ నాగరికతకు మూలపురుషుడైన మయుడు ఎవరో కాదు, మహాభారత కాలంలో మయసభ నిర్మించిన మయుడే. దక్షిణ అమెరికాలో ఉండేది ఈ నాగరికత.

అట్లాగే ఐర్లాండ్‌లో పెద్ద పెద్ద శివలింగాలు కనుగొన్నారు పురావస్తు పరిశోధకులు. గ్రీసులో కూడా శివలింగాలు దొరికాయి. మనం ప్రకృతి ప్రతిరూపంగా ఆరాధించే కాళీమాతను ఐర్లాండ్‌లో కైల్లెచ్, ఫిన్‌లాండ్‌లో కలెమ అన్న పేర్లతో ఆరాధిస్తారు. కాళీ పేరే కాలక్రమంలో ఆయా పేర్లుగా రూపాంతరం చెందిందని అక్కడుండే కొందరు ప్రజలు అంగీకరిస్తున్నారు.

ముస్లింల పవిత్ర స్థలం మక్కాలో కూడా సనాతన ధర్మ ఉనికిని నిర్ధారించే అనేకానేక అనవాళ్ళు దొరికాయి. శివలింగాలు దొరికాయి, అక్కడ ఒకప్పుడు మక్కేశ్వరుడనే శివాలయం ఉండేదని చరిత్రకారులు చెప్తున్నారు. అక్కడ ఒక బావి కూడా ఉంది. విక్రమాదిత్యుడు బంగారు ఫలకంపై వేయించిన శాసనం మక్కాలోని కాబాలో ఉంది. ఒకప్పుడు ఆ ప్రాంతం మొత్తం విక్రమాదిత్యుని పరిపాలనలోనే ఉండేది. ఆయన తన దూతల ద్వారా అక్కడ నివసించే ప్రజలకు వైదిక ధర్మం ప్రచారం చేయించాడు. ఇదిగాకా రష్యలో విష్ణుప్రతిమ దొరికింది. ఇటలిలో శీవలింగాలు దొరికాయి. ప్రపంచంలో అత్యంత పురాతన కాలం నుంచి శివలింగం యొక్క ఆరాధన ఉంది. ఆగ్నేయ చైనాలో తాంగ్ వంశవారు శివుడిని పూజించారు. జపాన్‌లో గణపతి, శివుడు, యమధర్మరాజు, సరస్వతీ దేవి అరాధన ఉంది. మలేషియా, లాఓస్, కంబోడియా, ఇండోనేషియా గురించి ప్రత్యేకించి చెప్పేదేమున్నది.

చోళరాజుల నౌకలు పెరు దేశన్ని చేరాయి. పెరులో కూడా చోళవంశంవారి వారసులు పరిపాలించారు. శ్రీలంకలో రావణాసురిని సంబంధిచిన ఆనవాళ్ళు కొన్ని లభ్యమయ్యాయి. లంక ప్రభుత్వం కూడా దీనిపై ఆస్కతితో పరిశోధన కొనసాగిస్తోంది. భారతలో రామాసేతువు, ద్వారక కూడా సనాతన ధర్మం యొక్క పురాతన వైభవాన్ని చాటుతున్నాయి.

ఇవిగాకా ఇంకా ఎన్నో ఆధారాలు లభించాయి. కొన్ని ప్రపంచాంకి తెలియవు, కొన్ని తెలియకుండా తొక్కిపెట్టారు. ఒక దేశం, ఒక ప్రాంతం, ఒక ఖండం ఏమిటి? ఖండఖండాంతరాలలో కూడా సనాతన ధర్మం ఉందనడానికి సాక్ష్యంగా నిలిస్తున్నాయి ఈ పరిశోధనలు.

To be continued ....................

Tuesday 1 July 2014

హిందూ ధర్మం - 94 (విశ్వవ్యాప్తమైన సనాతనధర్మానికి ఆధారాలు)

అట్లాగే ప్రపచనవ్యాప్తంగా జరిగిన పురాతనవస్తు తవ్వకాల్లో అనేక దేశాల్లో హోమగుండాలు, అగ్నిహోత్రాలు బయటపడ్డాయి. అగ్ని ఆరాధాన, హోమగుండం మొదలైనవన్నీ ఒక్క వైదిక సంప్రదాయంలో మాత్రమే ఉన్నాయి. ఇవి సనాతన ధర్మం అక్కడ కూడా ఉండేదని చెప్పకనే చెప్తున్నాయి. కానీ కాలక్రమంలో జరిగిన అనేక మార్పుల కారణంగా కొత్త మతాలు పుట్టుకొచ్చాయి.

ప్రాన్సు, స్పెయిన్ దేశపు సరిహద్దుల్లో ఫ్రెంచిపైరేనీస్ అనే ప్రదేశంలో అగ్నిహోత్ర దేవాలయాన్ని ప్రారభించారు. ఈ ప్రదేశంలో, భూగర్భశాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారం దాదాపు 12,000 సంవత్సరాలు నిరంతరాయంగా అగ్నిహోత్రం జరిగిందని గుర్తించారు. ఈ ప్రదేశం సముద్రమట్టానికి 700 మీటర్ల ఎతులో ఉంది. చుట్టారా కానిగ్యు పర్వతాలు, ప్రదేశ్ లోయలో ఎంత మనోహరంగా ఉంటుంది. ఇది గుర్తించిన స్తీఫెన్‌జీన్ లాపైరేరి అని వ్యక్తి ఇక్కడ అగ్నిహోత్ర దేవాలయం ప్రారంభించి, తాను యోగేశ్వర్ ఆనంద్‌గా మారి క్రతువు నిర్వహిస్తున్నాడు.

ఇదిగాకా జెర్మనీలో 32,000 సంవత్సరాల క్రితం నాటి నరసింహుని విగ్రహం లభించింది. ఒక గుహలో 1.20 మీటర్ల లోతులో, పురావస్తు తవ్వకాల్లో దొరికింది. ఈ రోజు వాటికన్ నగరంగా చెప్తున్న ప్రదేశానికి ఒకనాటి పేరు శివ వాటికట. అక్కడ కూడా శివలింగాలు దొరికాయి. క్రీస్తు పూర్వం 9వ శతాబ్దం నాటిదిగా గుర్తించిన ఒక శివలింగాన్ని అక్కడి మ్యూజియంలో ప్రదర్శనలో ఉంచారు. ఈనాటి క్రైస్తువుల పవిత్ర ప్రదేశం వాటికన్ నగరం. అక్కడ కూడా ఒకప్పుడు వైదిక సంస్కృతి ఉందని చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ. ఒకరకంగా చెప్పాలంటే, ఈనాటి యూరోపు మొత్తం ఒక్కప్పుడు మన ధర్మాన్ని పాటించిందని చెపుతున్నాయి ఈ ఆధారాలు.

అదేగాకా రష్యాలో మహాభారతకాలం నాటి పుషపక విమానం శకలాలు దొరికాయి. కానీ కమ్యూనిస్ట్ రష్యా, వీటిని బయటప్రపంచానికి తెలియకూండా తొక్కిపెట్టి, రహస్యంగా పరిశోధనలు సాగిస్తోందని మన భారతీయులు ఆధారాలు చూపించారు.

నమ్మకం లేదనుకుంటే ప్రస్తుతానికి ఈ లింకులు పరీశీలించండి.
http://bharatuntoldstory.tumblr.com/post/75238094234/siva-linga-at-gregorian-etruscan-museum-vatican
http://ajitvadakayil.blogspot.in/2011/08/secret-excavations-at-jerusalem-by.html
http://www.piclog.in/piclog/32000_year_old_idol_of_narasimha_lord_vishnu_s_avatar_found_in_germany/

To be continued ...............