Tuesday 24 September 2013

వివేక సూక్తి

సహనాన్నీ, సర్వమత సత్యత్వాన్నీ లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మమనీ, శరణాగతులై వచ్చిన సర్వమతస్థులకు శరణ్యమైన దేశం నా దేశమనీ చెప్పడానికి గర్విస్తున్నాను.

- స్వామి వివేకానంద 

Monday 23 September 2013

షట్పదీ స్తోత్రం - శ్రీ ఆదిశంకరాచార్య

అవినయ మపనయ విష్ణో !
దమయ మనశ్శమయ విషయమృగతృష్ణాం |
భూతదయాం విస్తారయ
తారయ సంసార సాగరతః ||

ఓ విష్ణుమూర్తీ(వ్యాపించి ఉన్నవాడ) ! నాలోని అవినయమును పారద్రోలు. నా మనసును నియంత్రించు. శబ్దాది విషయముల పట్ల బ్రాంతిని తొలగించు. భూతదయను(సర్వ జీవుల పట్ల దయను) పెంచు. ఈ భవసాగరము నుంచి దాటించు.

షట్పదీ స్తోత్రం - శ్రీ ఆదిశంకరాచార్య 

Sunday 22 September 2013

వివేక సూక్తి

నిస్వార్ధమే మతానికి పరీక్ష. ఈ నిస్వార్ధం ఎవరిలో ఎంత ఎక్కువగా ఉంటే, వారు అంత ఉన్నతమైన అధ్యాత్మికపరులు. సోమరితనంతో గడిపే స్వార్ధపరునికి నరకంలో కూడా స్థానం లేదు.

- స్వామి వివేకానంద 

Friday 20 September 2013

వివేక సూక్తి

ప్రేమ చాలా దుస్సాధ్యమైన ద్వారాలను తెరుస్తుంది: జగద్రహస్యాలన్నిటికీ ప్రేమ సింహద్వారం. కాబట్టి దేశభక్తులు కాగోరే మహాత్ములారా! ముందు సానుభూతిని అలవరుచుకోండి.

- స్వామి వివేకానంద 

Thursday 19 September 2013

అమ్మమలు, బామ్మలు నేర్పించే గణపతి ప్రార్ధన

చిన్నప్పుడు మన తెలుగిళ్ళలో అమ్మమలు, బామ్మలు నేర్పించే గణపతి ప్రార్ధన. ఇందులో గణపతి తత్వమంతా వాడుక భాషలో ఎంత చక్కగా చెప్పారో.

తొండము నేకదంతము
దోరపు బొజ్జయు వామహస్తమున్,
మెండుగ మ్రోయు గజ్జెలును
మెల్లని చూపులు మందహాసమున్,
కొండొక గుజ్జు రూపమున
కోరిన విద్యలకెల్ల నొజ్జవై,
యుండెడి పార్వతీ తనయ!
ఓయి గణాధిప! నీకు మ్రొక్కెదన్ || 

Saturday 14 September 2013

హేరంబ గణపతి

గణపతికి హేరంబుడని, హేరంబ గనపతి అని పేరు. దీనమైన, దయనీయ స్థితిలో ఉన్నవారు, ఆజ్ఞానాంధకారంలో పడి ఉన్నవారు, మాయచేత కప్పబడినవారు, శరణార్ధులు మొదలైనవారికి సంకేతం 'హే' అని అక్షరం. ఇటువంటి పరిస్థితిలో ఉన్నవారిని రక్షించేవాడు, పాలిచేవాడు అని సూచుస్తుంది 'రంబః' అనే అక్షరం. దీనులైనవారిని, బలహీనులను, రక్షిస్తూ, వారి బాధ్యతలను స్వీకరించి స్వయంగా తానే చూసుకుంటూ పాలించేవాడు కనుక గణపతిని హేరంబః అని అంటారని బ్రహ్మవైవర్త పురాణం గణేశ ఖండంలో చెప్పబడింది.

నిజానికి మనమంతా దీనులమే. కనిపించే ఈ రక్తమాంస నిర్మితమైన శరీరమే శాశ్వతమనుకుంటూ, ఇంద్రియ సుఖాల కోసం వెంపర్లాడుతూ, ఏది సత్యమో, ఏది అసత్యమో తెలియక, క్షణికసుఖాలే జీవతమనుకుంటూ, మాయలో మునిగిపోయిన మనమే అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాం. శరణు వేడిన వెంటనే అందరిని ఇటువంటి స్థితి నుంచి ఉద్దరించి, మనం ఈ శరీరం కాదు, ఈ దేహంలో ఉన్న పరిపూర్ణ ఆనంద ఆత్మ స్వరూపలమనే జ్ఞానం కలిగజేసి,ఈ దయనీయ స్థితినుంచి ఉద్ధరించి, మన బాధ్యాతలను స్వీకరించి మనల్ని ఆ హేరంబ గణపతి సదా పాలిచుగాకా.

దీనార్ధవాచకో హేశ్చ రంబః పాలకవాచకః |
పాలకం దీనలోకానాం హేరంబం ప్రణమామ్యహం ||

ఓం గం గణపతయే నమః          

Tuesday 10 September 2013

1893 సెప్టెంబరు 11

సెప్టెంబరు 11, 2013 నాటికి స్వామి వివేకానంద చికాగో సభలో ప్రసంగించి 120 సంవత్సరాలు.

1893 సెప్టెంబరు 11 వ తేదీన చికాగోలో జరిగిన సర్వమత సభలో హిందూ ధర్మ ప్రతినిధిగా హాజరయ్యారు స్వామి వివేకానంద. మతం అంటే ఇతర సంస్కృతిలపై చేసే ఒక తరహా యుద్ధంగా, మూఢనమ్మకాల వ్యాప్తిగా అప్పటివరకు భావిస్తున్న ప్రపంచానికి అసలుసిసలైన ధ
ర్మాన్ని ఈ సభ ద్వారా పరిచయం చేశారు వివేకానందులు. మా మతమొక్కటే సత్యమూ, మా దేవుడిని తప్ప ఇతర దేవళ్ళను పూజించే వారు నరకానికి పోతారంటూ మ్లేచ్చమతాలకు భిన్నమైనది, సర్వ మతాలను సత్యమని భావించేది, ఎన్ని నదులున్నా, అన్ని సముద్రాన్నే చేరినట్టు, అన్ని మతాలు ఒకే పరమాత్మను చేరుతాయని గట్టిగా విశ్వసించే ఒక ధర్మం ఉందని, అది మన హిందూ ధర్మమేనని సమస్త ప్రపంచానికి తన తొలి ప్రసంగం ద్వారా తెలియపరిచారు స్వమి వివేకానంద.

ఎవరైన మీ హిందువుల గొప్పతనం ఏంటని అడిగితే ఒక్క సమాధనం చెప్పండి. ఎన్నో మతాల ప్రతినధుల ఉపన్యాసలతో విసుగెత్తిపోయిన, విరక్తి చెందిన ప్రేక్షకులలో, 5 మాటలు, అమెరికన్ సోదర సోదరీమణులారా అనే కేవలం 5 మాటల చేత ఉత్తేజ పరిచారు. ఆ 5 మాటలకే 2 నిమిషాలపాటు సభప్రాంగణం మార్మోగిపోయేలా కరతాళధ్వనులు(చప్పట్లు కొట్టారు) చేశారు ప్రేక్షకులు. ఆనాడు ఆయన చేసిన ప్రసంగం ఈరోజు విన్నా, అంతే శక్తివంతంగా, ఉత్తేజితంగా ఉంటుంది. ఒక హిందు ప్రతినిధి చేసిన ప్రసంగం అమృతమై, శాశ్వతమై, ఏళ్ళు గడిచినా ఈరోజుకి ఎందరి చేతనో కొనియాడబడుతోందంటే, అదే మన హిందువుల గొప్పతనం, హిందువైన వివేకానందుడి గొప్పతనం. అందుకే ఆ ప్రసంగం చారిత్రాత్మికమైంది.

హిందువని గర్వంచు, హిందువుగా జీవించి అన్న వివేకనందా మాటను స్పూర్తిగా తీసుకుందాం. 

Wednesday 4 September 2013

శరీరంలో పంచమహాభూతాలు

ఓం గం గణపతయే నమః

పరబ్రహ్మ రూపమైన ఓంకార శబ్దంతో క్రమంగా ఆకాశం మహాభూతం రూపుదిద్దుకుంది. ఆకాశం అంటే మనకు కనిపించే మబ్బులు, మేఘాలని కాదు, ఆకాశం అంటే ఖాళీ ప్రదేశం, శూన్యం అని అర్దం చేసుకోవాలి. ఈ కాలంవారికి చెప్పలంటే స్పేస్ అన్నమాట. అది ఒక మీడియంలా పనిచేసి శబ్దాన్ని వక్త నోటి నుంచి శ్రోత చెవికి చేరవేస్తుంది కనుక ఆకాశం శబ్దగుణానికి సంకేతమైంది.

'ఆకాశాత్ వాయుః' ఈ ఆకాశం నుంచి శబ్దస్పర్శ గుణాలున్న వాయువు పుట్టింది. ఖాళీ ప్రదేశం ఉన్నదని అంటాం కానీ, స్పృసించలేం, అదే గాలి కంటికి కనిపించకపోయినా, మనల్ని గాలి తాకుతుంది. మనం గాలి యొక్క స్పర్శ(ఫీల్) కలుగుతుంది.

వాయువు నుంచి శబ్దస్పర్శ గుణాలతో పాటు రూప గుణం ఉన్న మహాతేజోతత్వమైన అగ్ని వచ్చింది. ఋగ్వేదంలోని మొదటి పదమే అగ్ని. అగ్ని అనంతమైనది అంటుంది వేదం. అగ్ని అంటే కేవలం నిప్పు అనే కాదు, అగ్ని అంటే ఒక శక్తి కూడా. ఈ విశ్వమంతా ఉన్న శక్తియే అగ్ని.

ఈ అగ్ని నుంచి శబ్దస్పర్శరూప గుణములతో పాటు రస గుణం ఉన్న జలం పుట్టింది. రసగుణం అంటే పారే స్వభావం, నీరు ఎత్తునుంచి పల్లానికి పారుతుంది కదా. అలా అన్నమాట.

'ఆపః పృధ్వీ' నీటి నుంచి భూమి ఏర్పడింది. ఈ భూమికి శబ్ద, స్పర్శ, రస, రూప గుణములతో పాటు గంధ(వాసన) గుణము ఉంది. భూమి నుంచి ఏర్పడిన మొక్కలు, వృషాలు, పువ్వులు, వాసన కలిగి ఉంటాయి. అంతెందుకు భూమి కూడా మంచి వాసన కలిగి ఉంటుంది. ఈ విధంగా పంచమహాభూతాలు ఏర్పడ్డాయి. అన్నిటికంటే చివరగా ఏర్పడింది కనుక ఈ భూమిలో పంచమహాభూతాలు, పంచతన్మాత్రలు(శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు) ఉన్నాయి.

ఈ భూమి నుంచే ఓషధులు ఉధ్భించాయి. ఓషధులు అంతే ఉషః కాలము(సూర్యోదయ వేళ)నందు ఆహారం తయాతుచేసుకోనేవని అర్దం. అవే మొక్కలు, వృక్షాలు మొదలైనవి. ఈ ఓషధుల నుండే అన్నం వచ్చింది. అన్నం అంటే ఎప్పుడు మనం బియ్యాని ఉడికించుకుని తినే పదార్ధం అని భావించకూడదు. అన్నం అంటే ఆహారం. అది ఏదైనా కావచ్చు. ఒక్కో ప్రాంతాన్ని, ఒక్కో దేశాన్ని బట్టి వారి ఆహారం మారుతుంది. అయిన అది కూడా అన్నమే అంటుంది శాస్త్రం. అందువల్ల ఓషధుల నుంచి మంచి పుష్టికరమైన పండ్లు, కాయలు, కూరలు, విత్తనాలు, ఆకులు, దుంపలు, మకరందం మొదలైనవి వచ్చాయి.

ఈ అన్నం నుంచి క్రమంగా పురుషుడు(పురుషుడంటే స్త్రీలు, పురుషులు, ఇతర జంతువులు అని ఇక్కడ అర్దం) ఏర్పడ్డాడు. మానవశరీరం పంచభూతాత్మకమైనది. శరీరంలో ఈ పంచమహాభూతాలు ఉంటాయి.      

Sunday 1 September 2013

మన చేతుల్లోనే ఉంది ......రూపాయి

మన చేతుల్లోనే ఉంది

ఇస్లామిక్‌రాజులు భారతదేశం మీద దండయాత్రలు చేయకముంది మనది ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం. ఇస్లామిక్‌రాజులు దాదాపు 1300 సంవత్సరాలు విశృంఖలంగా సంపద లూటీ చేసినా, భారత్ ప్రపంచంలో సంపన్నదేశంగానే ఉంది. బ్రిటిషర్లు భారతదేశానికి రాకముందు ఇంగ్లాండులో ప్రజలకు ఒక పూట తిండి దొరకడం కూడా గగనంగా ఉండేది. ఆ సమయంలో భారతదేశం ప్రపంచంలో ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఉంది. మనం ఎగుమతి చేసిన వస్తువులకు....ఆఖరుకి చెప్పులైనా, వాటికి విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉండేది. భారతీయ వస్తువుల కొనుగోలుకు బంగారం, వజ్రవైరూఢ్యాలను మొదలైనవి చెల్లించేవారు. ఆంగ్లేయులు మన మాతృభూమిపై దండేత్తాక వాళ్ళ దరిద్రం వదిలిపోయింది. మన సంపద మొత్తం కొల్లగొట్టి ధనికదేశంగా మారారు. ఈ రోజు ప్రపంచదేశాలు తమదంటూ అనుభవిస్తున్న సంపద.....అది భౌతిక సంపదైనా, ఆధ్యాత్మిక సంపదైనా, అది మన దగ్గరి నుండే వెళ్ళిందని మనం గుర్తించాలి. ప్రపంచం బట్టలు కట్టుకోవడం కూడా తెలియని రోజుల్లో మహోన్నత నాగరికులుగా జీవించిందే భారతీయులే. ఎంతో సంపద లూటీ అయినా, స్వాతంత్ర్యం వచ్చేనాటికి భారత్ రూపాయి విలువ అప్పటి అమెరికా డాలర్‌కు సరిసమానంగా
ఉంది. ఈరోజు మన రూపాయి విలువ రోజురోజుకు పడిపోతోంది. ఆర్ధికమంత్రి వయసుకు సరిసమానంగా చేరుతుందనంటున్నారు. ఆర్ధికపరిస్థితి దివాలతీసేల ఉన్నదని చెప్తున్నా, ఈరోజుకు భారత్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం.  కాకపోతే మన సంపద మొత్తం నల్లధనం పేరున స్విస్‌బ్యాంకులో ఉంది. 2011 నాటికి 75 లక్షల కోట్ల విలువైన భారతీయ సంపద, నల్లధనం రూపంలో స్విస్ బ్యాంకులో ఉన్నదని అంచనా. రూపాయి పతనమవుతున్నదని గగ్గోలు పెడుతున్న ఆర్ధిక మంత్రి నల్లధనం గురించి మాట్లాడకపోవడం విడ్డూరం.

ఇకపోతే రూపాయి విలువ మరింత పడిపోకుండా కాపాడగలిగే శక్తి ప్రతి భారతీయుడికి ఉంది. స్వాతంత్ర్య సంగ్రామంలో ఏ విధంగానైతే విదేశీవస్తువులను బహిష్కరించారో, అదే విధంగా ఇప్పుడూ విదేశీవస్తువులను సంపూర్తిగా బహిష్కరించాలి. సాధ్యమైనంతవరకు భారతీయవస్తువులనే కొనుగోలు చేయాలి. పెట్రోలు దిగుమతిని తగ్గించాలి. అంటే సాధ్యమైనంతవరకు వాహానవాడకాన్ని తగ్గించాలి. ఆనాడు ఏ విధంగానైతే విదేశివస్తువలను బహిష్కరించారో, అదే విధంగా ఈరోజు చేయాలి. అప్పుడే రూపాయి విలువ కాస్తైన పెరుగుతుంది. భారతీయ ఉత్పత్తులనే వాడండి, భారతదేశాన్ని రక్షించండి.

గమనిక : ఫోటోలో ఉన్నాయి కానీ, కార్బన్, వర్జిన్ మనవి కావు. 

జై హింద్
వందేమాతరం