Thursday 31 January 2013

పావన గంగా రహస్యాలు - Secrets of Sacred River Ganga

గంగా జలం గురించి సైన్సు చెబుతున్నదేంటి? ఆ నది నీటిలో రహస్యాలేంటి?

ఒక్క మునకతోనే సమస్తపాపాలు తొలగించే శక్తి పరమ పవిత్రమైన గంగకు ఉందని ధార్మిక గ్రందాహాలు చెబుతున్నాయి. గంగ మీద ఆధునిక కాలంలో జరిగిన పరిశోధనలు చాలా ఆశ్చర్యపరిచే విషయాలు వెల్లడయ్యాయి.

యాంటి - బ్యాక్టీరియల్ శక్తి :

1896 లో ' ఈ హంబురె హంకిన్ (E. Hanbury Hankin) ' అనే బ్రిటిష్ వైద్యుడు ( British physician) గంగా జలం మీద పరీక్షలు జరిపి, ప్రెంచి పత్రిక అన్నాలెస్ డి ఇన్స్టుట్ పాశ్చర్ (Annales de IInstitut Pasteur) లో ఒక పరీశొధనా వ్యాసం రాశారు. దాని సారాంశం
ప్రాణంతకమైన కలరా వ్యాధిని కలిగించే bacterium Vibrio Cholerae ని గంగా నీటిలో వెసినప్పుడు అది కేవలం 3 గంటల్లోనే పూర్తిగా నశించింది. అదే బ్యాక్టీరియా శుద్ధి చేయబడిన జలాల్లో (distilled water ) 48 గంటల తరువాత కూడా జీవనం కొనసాగించింది. ఇది మన గంగమ్మ తల్లి శక్తి.

సి. ఈ. నీల్సన్ అనే బ్రిటిష్ వైద్యుడు భారత్ నుండి తిరిగివెళ్తూ, గంగా నది ప్రవాహంలో అత్యంత కాలుష్యమైన ప్రదేశమైన హూగ్లీ నుండి గంగా నీటిని నౌకలో ఇంగ్లాండు తీసుకువెళ్ళాడు. అంత కలుషితమైనా కూడా గంగ నీరు ఆయన సుదీర్ఘ ప్రయాణంలోనూ, ఆయన ఇంగ్లాండుకు చేరిన తరువాత కూడా ఆ నీరు పరిశుద్ధంగానే ఉంది. మాములు నీటిని గాలి చొరబడని సీసాలో పెడితే ప్రాణవాయువు లేని కారణంగా ఆ నీటిలో వాయురహిత బ్యాక్టీరియా (anaerobic bacteria) వృద్ధి చెంది నీరు వాసన వస్తాయి. ఆ వాసన దాదాపు కుళ్ళు వాసనలాగే ఉంటుంది. కాని గంగ నీరు మాత్రం పరిశుద్ధంగానే ఉంది. ఇది గంగకున్న శక్తి.

ఇది మనం కూడా గమనించవచ్చు. కాశీ యాత్రకు వెళ్ళినవారు గంగాజలాన్ని ఇంటికి తీసుకువస్తే అది ఎన్ని సంవత్సరములు గడిచినా చెడిపోదు, కుళ్ళువాసన రాదు. ఇది మన హిందువులు పూజించే గంగమ్మ తల్లి శక్తి.


1927 లో Flix dHerelle అనే ఫ్రెంచి microbiologist గంగ నీటిలో కొద్ది అడుగుల క్రింద విరేచనాలు (dysentery), కలరా వంటి జబ్బులతో మరణించిన వ్యక్తుల శవాలు తేలుతుండటం చూసి, ఆ ప్రదేశంలో ఉన్న నీటిలో కొన్ని కోట్ల క్రిములుంటాయని భావించారు. కానీ ఆ నీటిని సేకరించి, పరిక్షిస్తే, అసలు అక్కడ క్రిములే లేవు.

అందుకే కొన్ని వేల సంవత్సరాలుగా హిందువులు గంగ మృతదేహాలను పవిత్రం చేస్తుందని అంటారు. దాని అర్ధం ఇదే. భయంకరమైన రోగాలతో చనిపోయిన వారి మృతదేహాలను కూడా పరిశుద్ధం చేస్తుంది. అటువంటి శక్తి గంగకుంది.

డి. యస్. భార్గవ అనే భారతీయ environmental engineer/professor of hydrology తన జీవితకాలాన్ని మొత్తం గంగ యొక్క అద్భుతమైన శక్తిని గురించి పరిశోధించడానికే అంకితం చేశారు. గంగకు తనను తాను ప్రక్షాళణ చేసుకునే శక్తి మిగితా నదులతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉందని తన 3 ఏళ్ళ పరిశోధనలో తేల్చారు. మిగితా నదులతో పోలిస్తే గంగ తన బయోకెమికల్ ఆక్సిజెన్ డిమాండ్ స్థాయిని అత్యంత వేగంగా తగ్గించగలదని, ఇతర నదులకంటే 15 నుంచి 20 రెట్ల వేగంగా తనలో కలిసిన వ్యర్ధాలను తొలగించుకోగలదని ఆయన పరిశోధనలో తేలింది.

న్యూడిల్లీ మలేరియా పరిశోధన కేంద్రం వారు ఇతర నది జలాలు దోమల పునరుత్పత్తికి దోహదపడతాయి. కాని గంగానది ఎగువజలాలు మాత్రం దోమల పునరుత్పత్తి ఉండదు. అక్కడ దోమలు పునరుత్పత్తి కాకుండా నిరోదిస్తుంది గంగమ్మ తల్లి జలం. అంతేకాదు! ఇతర జలాల్లో గంగా జలాలను కలిపితే ఆ నీరు కూడా దోమల పునరుత్పత్తిని నిరోదిస్తుంది.

ప్రధానంగా 2 చెబుతున్నారు పరిశోధకులు.
1) గంగలో బ్యాక్టీరియోఫేజ్ (Bacteriophage) ఉండడం వలన అది సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది.
2) శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టని కారణం/ శక్తి గంగానదిలో ఉండడం వలన, అది వాతావరణంలో ఉన్న ఆక్సిజెన్ ను తీసుకునేందుకు అసాధారణమైన సామర్ధ్యాన్ని ఇస్తోంది. దీనినే  Mystery Factor/Mystery X Factor అని పిలుస్తున్నారు.

బ్యాక్టీరియోఫేజ్ అంటే బ్యాక్టీరియను చంపే వైరసులు. ఏ విధంగానైతే పిల్లి ఎలుకను తింటుందో, అదే విధంగా ఈ వైరస్లు బ్యాక్టీరియాలని నాశనం చేస్తాయి. నిజానికి హాంకిన్, 1896 లో గంగ యొక్క యాంటి-బ్యాక్టీరియల్ లక్షణం గురించి ఒక నివేదిక ఇచ్చారు. అదే ఆధునికకాలంలో బ్యాక్టీరియోఫేజ్ గురించి చెప్పిన తొలి డాక్యుమెంటేషన్. హెరెల్ల్ గంగ యొక్క ఈ విశిష్టవంతమైన లక్షణాన్ని గమనించి, గంగలో ఉన్న ఈ వైరస్ బ్యాక్టీరియోఫేజే  అని చెప్పారు.

గంగాజలంలో ఆక్సిజేన్ స్థాయులు అధికంగా ఉండడమే చేతనే గంగ నీరు సుదీర్ఘకాలం పాటు తాజాగా ఉంటాయి. గంగ నీటిని ఇతర జలాలకు తగినంత మోతాదులో కలిపినప్పుడు, ఇతర జలాల్లోకి ఈ బ్యాక్టీరియోఫేజ్ వ్యాపించి,ఆ నీటిని కూడా శుద్ధి చేస్తుంది. దానిలో ఉన్న క్రిములను సమూలంగా నాశనం చేస్తుంది. అందుకే పురాతన హిందువులు, గంగాజలాన్ని తమతో పాటు తమ స్వస్థలాలకు తీసుకువెళ్ళి, అక్కడ ఉన్న జలవనరులలో కలిపేవారు. అదే ఈరోజు కూడా ఆచరిస్తున్నాం కాని మనకు కారణం తెలియదు, అవి కలపడం వలన కలిగే ప్రయోజనం కూడా తెలియదు.

ఇంకా చెప్పాలంటే,  బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులకు యాంటి-బ్యాక్టీరియల్ ఔషధం గంగాజలం.  ఈ నీటిని వాడేవారు కనుకే పురాతన హిందువులు ఎటువంటి యాంటి-బయోటిక్ మందులు వాడకున్నా, ఏ రోగం లేకుండా జీవితాంతం సుఖంగా గడిపేవారు. అతి తక్కువ పరిశోధనలు జరుగునప్పటికి, ఈ నీటిని బ్యాక్టీరియోఫేజ్ థెరపికి ఉపయోగించవచ్చని పరిశోధకుల అంటున్నారు. ఇటువంటి పరిశోధనలు సోవియట్ యూనియన్ లో చాలా ఎక్కువగా జరిగాయి. ఎందుకంటే హెరెల్ల్ గంగానది యొక్క బ్యాక్టీరియోఫేజ్ నే ప్రపంచానికి పరిచయం చేశాక, రష్యాలో ఆయన పేరు మీద ఒక పరిశోధన సంస్థ కూడా ఏర్పడింది.

నేడు అనేక హానికారక బ్యాక్టీరియ యాంటి-బయోటిక్స్ ను తట్టుకుని నిలబడే సామర్ధ్యం పొందాయి. ప్రపంచంలో చాలా యాంటి-బయోటిక్స్ విఫలమవుతున్నాయి. అందువల్ల ప్రజలలో రోగనిరోధకత క్షీణించి, వారి చికిత్స చేయడం కూడా వైద్యులకు చాలా సంక్లిష్టంగా మారుతోంది. మానవజాతి యాంటి-బయోటిక్స్ కి పూర్వం ఉన్న శకంలోనికి వెళ్ళిపోతోందనే ఆందోళన మొదలైంది. అత్యవసరంగా ప్రత్యామ్నాయ పద్ధతులను అభివృద్ధి చేయడమే అతి ముఖ్యమైన అంశాలుగా ఆధునిక వైద్యము, బయోటెక్నాలజి రంగాలు కృషి చేస్తున్నాయి.

ఇటువంటి సంక్లిష్ట పరిస్థితులలో గంగ నీటితో యాంటి-బయోటిక్ ను తయారుచేసి ఔషధంగా కనుక ఇస్తే కనుక ప్రజలు ఏ రోగం లేకుండా, మందులు వాడకుండా హాయిగా బ్రతకవచ్చని గంగ నది మీద  పరిశోధనలు చేసిన అనేక మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు తెగేసిచెప్తున్నారు.

ఇంత గొప్పది మన గంగమ్మ. ఇన్ని విశిష్టవంతమైన లక్షణాలు మన గంగమ్మ తల్లికే సొంతం. ఇది హిందువులకు, భారతదేశానికి గర్వకారణం.

మన గంగమ్మ గురించి ఆధునికకాలంలో జరిగిన పరిశోధనలు ఏమి చెబుతున్నాయి?

గత 50 సంవత్సరాల క్రితం నమోదైన పరిశోధనా వివరాల ప్రకారం, కలుషిత జలాల్లో కేవలం కొన్ని చుక్కల గంగాజలం చేరిస్తే కలుషిత జలాలు పరిశుభ్రమై, రోగకారక క్రిములను నాశనం చేసేవి. అందుకే మన హిందువులు గంగాతీరంలో ఉన్న తీర్ధయాత్రలకు వెళ్ళినప్పుడు తప్పకుండా, గంగాజలం తీసుకువచ్చి నలుగురికి పంచుతారు. పురాణాల్లో కూడా మన అనేక కధలు కనిపిస్తాయి. ఎందరో రాజు ఎంతో ధనం ఖర్చు పెట్టి పట్టాభీషేకాలకు, ఇతర పూజా కార్యక్రమాలలో వాడడం కోసం గంగా జలం తెప్పించుకునేవారు. ఈరోజుకి కూడా అనేకమంది హిందువులు పవిత్రకార్యక్రమాల్లో వాడేందుకు గంగాజలం తెప్పించుకుంటున్నారు.మనవేవి మూడనమ్మకాలు కావు. మనకు తెలియనంత మాత్రాన మన ఆచారసంప్రదాయాలను కించపరచకండి.

గంగకు ప్రత్యేకతకు కారణం దానిలో ఉన్న బ్యాక్టీరియోఫేజ్. అది ఎంతో శక్తివంతమైనది. గంగోత్రిలో మొదలై, గంగాసాగరం వరకు ఇది గంగలో చేరిన మొత్తం క్రిములను సమూలంగా నాశనం చేసి, గంగను శుద్ధి చేస్తుంది. అది కూడా కేవలం 24 గంటల్లోనే 2525 కిలోమీటర్ల గంగ పరిశుద్ధమవుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అలా శుద్ధి చేశాక ఈ బ్యాక్టీరియోఫేజ్ ఆనవాళ్ళు కూడా గంగలో కనిపించవు. కాని ఇదంతా 50 ఏళ్ళ క్రితం మాట అంటారు గంగ మీద పరిశోధన చేసిన రమేష్ చంద్ర గారు.

అందుకంటే గంగా ప్రవాహాన్ని అడ్డుకునే డ్యాములు వంటి వాటి వలన ఈ బ్యాక్టీరియోఫేజ్ క్రింది ప్రాంతానికి అంత వేగం వ్యాపించటంలేదు. ఈ ప్రైక్రియా కాస్త నెమ్మదించింది.


మరి ఇన్ని కోట్లమంది గంగలో స్నానం చేస్తుంటే గంగ కలుషితం కాదా? గంగలో స్నానం చేయడం వలన అంటువ్యాధులు రావా?

ఈ పవిత్ర కుంభమేళా సమయంలో 10 కోట్ల మంది భక్తజనం త్రివేణిసంగమంలో పవిత్రస్నానం చేస్తారని అంచనా. ఇన్ని కోట్ల మంది త్రివేణి సంగమమనే ఒక చిన్న ప్రదేశంలో స్నానం చేస్తే కొత్త రోగాలు వ్యాపించవా?

మనం గతభాగాలలో చెప్పుకున్నాం. గంగలో బ్యాక్టీరియోఫేజ్ ఉందని. దాని ప్రభావాల గురించి విపులంగా తెలుసుకున్నాం. బ్యాక్టీరియోఫేజ్ మానవ వ్యర్ధాలు, వారి శరీరం నుండి వచ్చే క్రిముల మీద ఆధారపడి జీవిస్తాయి. మానవులు నదిలో స్నానం చేసినప్పుడు వారి శరీరం నుండి నదిలో కలిసే క్రిములు వీటికి ఆహరం. ఎంత ఎక్కువమంది స్నానం చేస్తే అంత ఎక్కువగా ఈ బ్యాక్టీరియోఫేజ్ ఉద్భవిస్తాయి. అందుకే కుంభమేళా, పవిత్ర దినాలు, పండుగ రోజుల్లో కోట్లాది మంది గంగలో స్నానం చేసినా ఒక్క అంటువ్యాధి కూడా వ్యాపించదు. ఆ నీరు కూడా కలుషితం కాదు. వినడానికి వింతగానే ఉన్నా ఎంత ఎక్కువమంది స్నానం చేస్తే గంగ అంత పరిశుద్ధమవుతోంది అని గంగ మీద పరిశోధనలు జరిపిన వారు చెప్పే మాట. 


అంతేకాదండోయ్! మరొక ఆసక్తికరమైన అంశం, ఈ మధ్యే బ్రిటిష్ వారి పరిశోధనలలో తెలింది. ఈ పవిత్ర కుంభమేళా సమయంలో పవిత్రస్నానం చేసినవారికి మానసికరోగాలనుండి విముక్తి లభించిందట. చాలా శారీరిక రోగాలు తగ్గిపోతున్నాయట.. ఎంత గొప్పది మన గంగమ్మ తల్లి.  నదిలో మునిగితే ఏం వస్తుంది అనేవారికి ఇది సమాధానం కూడా.

2003 లో పవిత్ర గోదావరి నదికి నాసిక్ లో జరిగిన అర్ధ కుంభమేళ లో 6 కోట్లమంది స్నానం చేశారని అంచనా. అప్పుడు అక్కడి నీటిని పరిక్షిస్తే అందులో కూడా 8, 9 రకాల బ్యాక్టీరియోఫేజులను పరిశోధకులు గుర్తించారు. అటువంటి శక్తి గోదావరికి కూడా ఉంది. అందుకే పంచ గంగలో గోదావరి నది ఒకటైంది.

గంగకే పరిమితమైన జీవరసాయనిక ప్రకృతి(special chemical and biological properties), అత్యధిక స్థాయి re-oxygenation ప్రక్రియ దాని ప్రత్యేకతలు. వాటి కారణంగానే, గంగ సహజవ్యర్ధాలను అతిత్వరగా తనలో కలిపేసుకుంటుంది. జంతువులు వ్యర్ధాలను గంగనీటితో నింపిన ఒక ట్యాంకులో వేస్తే అవి కేవలం 3 రోజుల్లోనే కరిగిపోయాయి.

source : http://www.ibaradio.org/India/ganga/radio/radio4/sd1.htm
and some part is taken from Paper and NEWS media.


ఇంత గొప్ప గంగ కలుషితమవుతోంది. భారతీయులకే గర్వకారణమైన గంగ కలుషితమైతే జరిగే నష్టాలేమిటి? కలుషితమైన గంగ తన శక్తిని కోల్పోతోందా?

గంగ కలుషితమవుతోంది.

అవును హిందువులు పరమపవిత్రంగా పూజించే గంగ, ఎన్నో విశిష్టతలు కలిగిన గంగ, భారతదేశంలో 40% జనాభాకు జీవానాధారమైన గంగ అత్యంత ఘోరంగా కలుషితమవుతోంది. ప్రతి రోజు గంగలో 2.9 బిల్లియన్ లీటర్ల మానవ్యర్ధాలు గంగలో కలుస్తున్నాయి. కేవలం వారణాశి(కాశీ) నుంచే 200 మిల్లియన్ లీటర్ల మానవవ్యర్ధాలు గంగలో కలుస్తున్నాయి.దానికి తోడు గంగలోకి అనేక కర్మాగారాలు హానికర వ్యర్ధాలను విడుదల చేస్తున్నాయి.

కాలుష్యం కారణంగా గంగలో కోలిఫొర్మ్ స్థాయి పెరుగుతోందని UECPCB అధ్యయనం చెబుతోంది. త్రాగునీరైతే కోలిఫోర్మ్ స్థాయి 50 కంటే తక్కువ ఉండాలని, 500 కంటే తక్కువ ఉంటేనే ఆ నెరు స్నాననికి పనికోస్తాయని, 5000 కంటే తక్కువ స్థాయిలో కోలిఫోర్మ్ ఉంటేనే వ్యయసాయానికి నీరు పనికొస్తాయని చెప్తారు. అటువంటిది గంగలో కోలిఫోర్మ్ స్థాయి హరిద్వార్ లోనే 5500 కంటే ఎక్కువ స్థాయిలో ఉందిట.  దీనికి ప్రధాన కారణం గంగలో మానవుల మలమూత్ర విసర్జితాలను ఎటువంటు శుద్ధి చేయకుండ కలపడమే.

http://www.hindustantimes.com/News-Feed/India/Ganga-pollution-reaches-alarming-levels/Article1-227845.aspx

ఈ రోజుగంగానది ఎంత కలుషితమైందంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ సిపార్సు చేసిన స్థాయి కంటే గంగలో 3000 రెట్ల అధికంగా విషపదార్ధాలు, రసాయానాలు, క్రిములు చేరాయని చెప్తున్నారు.

http://www.all-about-india.com/Ganges-River-Pollution.html

దీనికి విరుద్ధంగా, గంగ మీద పరిశోధనలు జరిపిన భారతీయులు మాత్రం గంగకు ఇంకా ఔషధ గుణాలున్నాయని, కాని మరింత కలుషితమైతే మాత్రం ఇక పరిస్థితి చెయ్యి దాటిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంగకు అనేక ఔషధ గుణాలున్నా, భారతదేశం మీద అసూయతో ఇతర దేశస్థులు గంగానది మీద పరిశోధనలలో వెల్లడైన నిజాలను దాచి ఉంచుతున్నారని వాపోతున్నారు.

ఏది ఏమైనా, గంగ ప్రపంచంలో ప్రమాదం పొంచి ఉన్న పది నదులలో ఒకటిగా ప్రకటించారు ఐక్యరాజ్య సమితి వారు. మన గంగను మనమే కాపాడుకోవాలి.

గంగ ఇంత కలుషితమైనా గంగలో ఇంకా ఔషధ గుణలున్నాయా?

కలుషిత గంగ ఇప్పటికి ఔషధ గుణాలను కలిగివుంది - సంజయ్ పాండే, లక్నో,DH News Service

గంగానది కాలుష్యం వలన త్రాగునీటికి, సాగునీటికి పనికిరాదంటూ వచ్చిన అనేక నివేదికలను బుట్టదాఖలు చేస్తూ, గంగానదికి ఔషధ గుణాలు ఇంకా ఉన్నాయని, గంగానది మీద పరిశోధనలు జరిపిన సీనియర్ శాస్త్రవేత్త Dr Chandrashekhar NautiyalNational Botanical Research Institute (NBRI) , ప్రతిష్టాత్మక CSIR laboratory పరిశోధలను ఋజువు చేశాయి.

ఈ పరిశోధన యొక్క లక్ష్యం గంగకి యాంటి- బ్యాక్టీరియల్ లక్షణాలున్నాయన్న పురాతన విజ్ఞానాన్ని ధృవీకరించడానికి, గంగ నీటిలో ఉన్న క్రిమిసంహారక ఔషధ లక్షణాలు మరింత విశ్లేషించడానికి, కలుషితమైనా,గంగ తనను తాను శుద్ధిచేసుకునే సామర్ధ్యాన్ని కలిగి ఉండటం, గంగ సూక్ష్మక్రిములను ముఖ్యంగా E.coli O157:H7 ఎదుర్కునే శక్తిని గురించి ఋజువు చేయడానికి గంగాజలం మీద పరిశోధనలు జరిపారు   Dr Chandrashekhar Nautiyal. ఆయన పరిశోధనా పత్రం ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ‘Current Microbiology’ లో ప్రచురితమైంది.

E.coli ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మానవులు, జంతువులు ఎదుర్కునే సమస్య. అతిసారము,  మూత్రకోశసంబంధిత వ్యాధులకు కారణం  E.coli O157:H7 అనే క్రిమి. Ernest Hankin అనే బ్రిటీష్  bacteriologist 1896లో గంగ నీటి మీద జరిపిన పరిశోధనలను ఆధారంగా చేసుకుని పరిశోధన చేశారు. Nautiyal పరిశోధనలో E.coli 3 రోజుల క్రితం గంగా నీటిలో 3 రోజులు మాత్రమే జీవించింది. 8 ఏళ్ళ క్రితం తీసుకున్న గంగా నీటి sampleలో 7 రోజులు,  16 రోజుల క్రితం గంగాజలం sampleలో 15 రోజులు మాత్రమే జీవించగలిగింది.  

అదే E.coli కాచిన(వేడి) చేసిన నీటిలో మరింత ఎక్కువకాలం జీవనం కొనసాగించింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే  గంగలో  ప్రతిరోజు కొన్ని బిల్లియన్ లీటర్ల మలమూత్రాలను గంగలో కలుస్తున్నా, గంగాజలం ఇంకా ఔషధశక్తులను కోల్పోలేదు. అది అనేక క్రిములకు వ్యతిరేకంగా పోరాడుతోంది. 

అందుకే గంగ మీద మరింత పరిశోధనలు చేస్తే, క్రిమిసంహారకమైన ఒక ఔషధాన్ని ఈ ప్రపంచానికి అందించవచ్చని  Dr. Nautiyal తన పరిశోధన చివరలో పేర్కొన్నారు.  

-కలుషిత గంగ ఇప్పటికి ఔషధ గుణాలను కలిగివుంది - సంజయ్ పాండే, లక్నో,DH News Service

అంతేకాదు, అనేకమంది గంగలో పవిత్రస్నానం చేస్తారు. గంగలో అనేక హానికరమైన రసాయనాలు కలుస్తున్నా, గంగలో స్నానం చేసినవారికి ఏ విధమైన జబ్బులు, దురదలు, ఇతర చర్మ సంబంధిత వ్యాధులు మచ్చుకైనా రావట్లేదు. గంగలో స్నానం చేసి కొందరు, అక్కడే పారుతున్న నీటినే తీర్ధంగా తాగేస్తారు. అయినా వారిలో ఎటువంటి అనారోగ్యసమస్యలు ఉత్పన్నం కావట్లేదు. ఇంకా వివరంగా చెప్పాలంటే అక్కడ స్నానం చేసినవారు ఆరోగ్యవంతులవుతున్నారని పరిశోధనలే చెబుతున్నాయి. అదే గంగలో ఉన్న శక్తి. హిందువులు పవిత్రంగా భావించే గంగమ్మకు ఉన్న శక్తి. కేవలం పాపాలనే కాదు తనలో కలిసిన మలినాలను కూడా గంగమ్మ పరిశుభ్రం చేస్తోంది.

ఈ శక్తిని ఎలా వివరించాలో అర్ధంకాకే, గంగ మీద పరిశోధనలు జరిపిన డి. ఎస్. భార్గవ, గంగలో ఉన్న ఆ దివ్యశక్తిని  Mysterious Factor X గా చెప్తున్నారు.    

కాని అందరూ చెప్పే మాట, గంగ మరింత కలుషితమైతే, తన విశిష్టవంతమైన లక్షణాలను, ఔషధ గునాలను పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రజలు, ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. గంగలో వ్యర్ధాలను కలపడాన్ని అడ్డుకోవాలి. మన గంగను మనమే కాపాడుకోవాలి. 

గంగానదికి ఉన్న మరిన్ని ప్రత్యేకతలు ఏమిటి?

గంగా తనలో కలిసిన మానవులు, జంతువుల వ్యర్ధాలను, సహజ వ్యర్ధాలను, 30 నుంచి 45 నిమిషాలలో 60% తొలి వరకు శుద్ధిచేస్తుంది. ఇదే ఇతర నదులకు కొన్ని రోజుల సమయం పడుతుంది. గంగానది  హానికరక్రిములను ఇతరనదులంటే 25 రెట్ల వేగంగా నాశనం చేస్తుంది. మిగితా నదులతో పోల్చినప్పుడు గంగ అనేక రెట్లు వేగంగా క్రిములను నాశనం చేయగలదు. అందుకే గంగకు అంత ప్రత్యేకత.

సాధారణంగా వేడి చేసిన నీటిలో క్రిములు చేరవు. పరిశుద్ధంగా ఉంటాయి. కాని గంగాజలం వేడి చేస్తే, తన ఔషధ గుణాలను కోల్పోతుంది. 1980 లో భార్గవ అనే పరిశోధకులు గంగా నీటిని 2 వేర్వేరు పాత్రలలో తీసుకుని, ఒక పాత్రను వేడి చేసి, ఆ నీరు చల్లబడ్డాక అందులో క్రిములను చేర్చగా, ఆ నీటిలో క్రిములు జీవించాయి, గంగ నీరు చెడిపోయాయి. వేరే పాత్రలో ఉన్న జలంలో క్రిములను చేర్చగానే అవి మరణించాయి. ఉష్ణోగ్రత పెరగడం వలన గంగలో ఉండే బ్యాక్టీరియోఫేజ్ మరణించడమే ఇందుకు ఒక కారణం.

గంగకే కాదు అన్ని నదులు తమను తాము శుద్ధిచేసుకునే శక్తిని కలిగి ఉంటాయి. అవి ఆక్సిజెన్ గ్రహించడం మొదలుకొని, తమలో కలిగిన సహజ వ్యర్ధాలను శుద్ధిచేసుకునే శక్తి కలిగి ఉంటాయి.  1896లో హానికిన్ జరిపిన పరిశోధనలో గంగతో పాటు యమున కూడా ఇటువంటి శక్తులను కలిగిఉందని తేలింది. కాని యమునతో పోల్చినప్పుడు గంగ 10 నుంచి 20 రెట్ల వేగంగా క్రిములను నాశనం చేయగలదు.

http://www.ibaradio.org/India/ganga/radio/radio4/sd1.htm

గంగకున్న అనేక ప్రత్యేకతలను గుర్తించాడు కనుకే అక్బర్ చక్రవర్తి నిత్యం గంగాజలాన్ని మాత్రమే తెప్పించుకుని త్రాగేవాడు. గంగా జలాన్ని "అమరత్వం ప్రసాదించే జలం " అని సంబోధించాడు.

బ్రిటిషర్లు భారత్ నుంచి ఓడలో ఇంగ్లాండు ప్రయాణించే సమయంలో గంగా జలాన్నే తీసుకెళ్ళేవారు. గంగా నీరు చెడిపోవు. అందువల్ల వారి ఇంగ్లాండు వెళ్ళీ భారత్ తిరిగివచ్చేవరకు మన గంగ నీటినే త్రాగేవారు.


హిందువులు నదులను, చెట్లను, రాళ్ళను పూజిస్తారంటూ అనేక మంది విమర్శిస్తుంటారు. వారందరికి గంగ విశిష్టత తెలియజేసి వాళ్ళ కళ్ళు తెరిపించాలి. మనవి మూఢనమ్మకాలు కావు. కారణం లేకుండా మన పూర్వీకులు దేనిని పూజించమని చెప్పలేదు. మనకు తెలియనంత మాత్రాన వాటిని కొట్టిపారేయకండి.

Published on account of Mahakumbamela 2013

Wednesday 30 January 2013

గంగ - హిందూధర్మం

ఓం
జై గంగామాత! జై జై గంగామాత!

గంగానదికి, భారతదేశం, హిందూధర్మం అనే మూడు అంశాలు విడదీయరానివి.

నెహ్రూ, తన పుస్తకమైన డిస్కవరి ఆఫ్ ఇండియా లో గంగను ఉద్ద్యేశించి చెబుతూ కొని లక్షలమందిని తన తీరంకు ఆకర్షిన గంగ భారతదేశానికి గుండేకాయ. గంగోత్రి నుండి సముద్రంలో కలిసేవరకు, పురాతనకాలం నుండి ఆధునిక కాలం వరకు, భారత్ లో ఏర్పడిన అనేక సామ్రాజ్యాలు, నాగరికతలు, ప్రజల చరిత్ర మొత్తం గంగతోనే ముడిపడి ఉంది. ఈ దేశం గొప్పతనం గంగ నదియే.

ఇప్పుడు ఆ మాటలు గుర్తుచేసుకోవడానికి కారణం మీకు తెలుసా? గంగమ్మతల్లి  భారతదేశంలో హిందూధర్మ స్థాపన కోసం తపించింది. దాదాపు 1000 ఏళ్ళ పైగా భారతదేశం మీద ఇస్లామిక్ దండయాత్రలు జరిగాయి. అటువంటి సమయంలోనే దక్షిణభారతంలో హిందువుల మీద అనేక దాడులు జరుగాయి, అనేకమంది చంపబడ్డారు, కొందరు మతం మార్చివేయబడ్డారు. అటువంటి సమయంలో మహానుభావులు శ్రీ విద్యారణ్య స్వామివారు గంగా తీరం వెంబడి నడుస్తున్నప్పుడు గంగమ్మ తల్లి ప్రత్యక్షమై " విద్యారణ్య, దక్షిణభారతంలో దండయాత్రల కారణంగా అనేకమంది హిందువులు చంపబడ్డారు. వారి రక్తం ఏరులైపారుతోంది. ఈ పరిస్థితిని నేను చుడలేకపోతున్నా. నీవు తక్షణమే వెళ్ళి అక్కడ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించు, హిందూ ధర్మస్థాపన చెయ్యి " అని చెబుతూ భోరున విలపించింది. కన్నీటి పర్యంతమైంది.

ఆ గంగమ్మ తల్లి రోదన విన్నాక, ఆమె కన్నుల వెంట నీరు కారడం చూసిన, విద్యారణ్య మహాస్వామివారు దక్షిణభారతదేశానికి వచ్చి హరిహర రాయులు, బుక్కరాయులను నిమిత్తంగా చేసుకుని,వారిచే అతిపెద్ద హిందూ సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆ సామ్రాజ్యాన్ని పరిపాలిచినవారిలో ఒకరే శ్రీ కృష్ణదేవరాయలు. యావత్ ప్రపంచంలో పేరుప్రఖ్యాతులు గాంచింది విజయనగర సామ్రాజ్యం. బంగారం, రత్నాలు, వజ్రవైడూర్యాలు వీధుల్లో పోసి కూర్యగాయల వలే అమ్మేవారు ఈ రాజ్యంలో. మార్గంలో వజ్రం పడివున్నా, అది తమది కాదని తీసుకునే వారు కాదు బాటసారులు. దాన్ని రాయిని చూసినట్టే చూసేవారు. మొత్తం దక్షిణ భారతాన్ని ఆదీనంలో ఉంచుకుని హిందూ ధర్మ ఉద్దరణ చేశారు విజయనగర ప్రభువులు. ఇదంతా గంగమ్మ తల్లి ప్రేరణ వల్లనే. ఈరోజు మన హిందూధర్మం బ్రతకడానికి ఒక కారణం గంగమ్మ.

అటువంటి గంగమ్మతల్లిని పూజిద్దాం. మన హిందూ ధర్మాన్నే ఆచరిద్దాం. హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడిని ఐక్యంగా తిప్పికొడదాం. భారతదేశాన్ని కాపాడుకుందాం. గంగానది కాలుష్యం, భూతాపం బారి నుండి పరిరక్షించుకుందాం. మనం హిందుధర్మాన్నే ఆచరించడమే గంగమ్మ తల్లికి ఇచ్చే గౌరవం.

జై గంగామాత! జై జై గంగామాత!  

Monday 28 January 2013

గంగావతరణం(13)

ఓం
గంగావతరణం(13)

ఈ గంగ దేవలోకంలో మందాకిని అని పేరుతోనూ,భూలోకానికి నువ్వు కష్టపడి తీసుకువచ్చావు కనుక భాగీరథి అని పిలువబడుతుంది, పాతాళంలో భోగవతిగాను ప్రసిద్ధికెక్కుతుందని బ్రహ్మదేవుడు భగీరథునితో పలికాడు. దీన్ని ఉద్యేశించే గంగకు త్రిపధగ అనే పేరు వచ్చింది. త్రిపధగ అంటే మూడులోకాల్లో ప్రవహించేదని అర్దం.

శివుడు గంగను విడిచిపెట్టినప్పుడు గంగ 7 పాయలుగా విడిపోయింది. అందులో మూడుపాయలు తూర్పు దిక్కుకు వెళ్ళిపోయాయి.  వాటికి లాధిని, నళిని, పాధిని అని పేర్లు. మూదు పాయలు పశ్చిమదిక్కుకు వెళ్ళిపోయాయి. సుచక్షువు, సీత, సింధువు అని ఆ 3 పిలువబడుతున్నాయి. మిగిలిన  పాయ భగీరథుని వెనుకాల వెళ్ళింది. అదే భాగీరథి.

రామాయణంలో చాలా తక్కువ సంఘటనలకు మాత్రమే ఫలశృతి చెప్పారు వాల్మీకి మహర్షి.

ఫలశ్రుతి :
ఈ గంగావతరణాన్ని ఎవరు వింటారో, చదువుతారో, చెప్తారో, పరమశివుడి తలమీద గంగపడుతున్నట్టుగా ఉన్న చిత్రానికి ఎవరు నమస్కరిస్తారో, గంగావతరణాన్ని మనసులో ధ్యానం చేస్తారో, ఇది ఇలా జరిగిందా? అన్న సందేహం లేకుండా మొత్తం కధను మనసులో ఊహించుకుంటారో, అటువంటి వారికి ఇంతకముందున్న పాపరాశి దగ్ధమవుతుందని, సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని, విశేషంగా శివుని అనుగ్రహం కలుగుతుందని, కోరుకున్న కోరికలే తీరుతాయని, వారికి సర్వవిధ శ్రేయస్సు కలుగుతుందని ఈ గంగావతరణ ఘట్టానికి వాల్మీకి మహర్షి ఫలశృతి చెప్పారు.

ఇటువంటి పరమపవిత్రమైన గంగావతరణాన్ని సోమవారం నాడు పూర్తిచేయడం మరింత పుణ్యప్రదమైనది.


రామాయణం మనకిస్తున్న సందేశం ఏమిటి?

ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశాడు భగీరథుడు. తన కోసం కాదు, తన పితృదేవతలను ఉద్దరించడానికి. మనం రామాయణానికి వారసులం, మనం మన తల్లిదండ్రులను నిరంతరం, ముఖ్యంగా పెద్దవయసులో చూసుకోవాలి, వారికి ఆ సమయంలో కావలసినవి ప్రేమలే. వారిని వృద్ధాశ్రమాల్లో పడేయడం, సూటిపోటి మాటలనడం, భారంగా భావించడం లాంటివి చేయకూడదు. కాలక్రమంలో వారు మరణిస్తే వారికి చేసే శ్రాద్ధకర్మ తప్పకుండా ప్రతి సంవత్సరం చేయాలి. అలాగైన మనం వారి జ్ఞాపకాలతో ఒక్క రోజైనా గడుపుతాం. మన తల్లిదండ్రులు, తాతముత్తాతల గురించి ఆ రోజైన మన పిల్లలకు తెలుస్తుంది.

పర్యావరణాన్ని, ప్రకృతిని, భూమాతను కాపాడుకోవాలి. సాక్షాత్ బ్రహ్మదేవుడే ఈ గంగావతరణంలో చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని భూమాతను భూతాపం నుండి రక్షించాలి. నదులు పవిత్రమైనవి. మనకు తల్లితో సమానం. అందుకే వాటిని కలుషితం చేయకూడదు.   హిందూ ధర్మాన్నే ఆచరించండి. " స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ", హిందువుగా జీవించండి. హిందువుగానే మరణించండి.

ఇందులో అతికొద్ది భాగంతప్ప మిగితాది మొత్తం పూజ్య గురువులు బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి గంగావతరణం ప్రవచనం విని వ్రాసినదే.

సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు
ఓం నమః శివాయ
ఓం శాంతిః శాంతిః శాంతిః

Sunday 27 January 2013

గంగావతరణం(12)

ఓం
గంగావతరణం(12)

నీటి ప్రవాహానికి అడ్డువచ్చిన మహామహా వృక్షాలే నేలకొరుగుతాయి. భగీరథుని రథం జహ్ను మహర్షి ఆశ్రమం పక్క నుండి వెళ్ళింది. గంగ కూడా జహ్నుమహర్షి ఆశ్రమం పక్కనుండి వెళ్ళింది. గంగాప్రవాహంలో జహ్నుమహర్షి ఆశ్రమం కొట్టుకుపోయింది. ఆగ్రహించిన జహ్నుమహర్షి గంగను అరచేతిలోకి తీసుకుని త్రాగేశారు.  ఎంతో తపస్సు చేయడం వలన మహర్షులకు అంత శక్తి ఉంటుంది. ఇంద్రుడు మొదలైన దేవతల కంటే శక్తిమంతులవుతారు.


గంగా ప్రవాహ శబ్దం ఒక్కసారి ఆగిపోవడంతో భగీరథుడు వెనక్కి తిరిగి చూసి అవాక్కయ్యాడు. వెంటనే జహ్నుమహర్షి ఆశ్రమానికి వచ్చేశారు. గంగలో స్నానం చేస్తున్న దేవతలందరూ ఒక్కసారిగా జరిగిన పరిణామానికి హడలిపోయి వారు కూడా మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. ఎంతో తపస్సు చేసి, నా పితృదేవతల కోసం గంగను భూమికి తీసుకువస్తే మీరు త్రాగేశారు, వారికి ఉత్తమగతులు కలగాలంటే గంగనది వారి భస్మరాశుల మీద నుండి ప్రవహించాలి అని భగీరథుడు అన్నాడు. దేవతలు కూడా  ఆయన ఎంతో తపస్సు చేసి గంగను భూమి తెచ్చారు,  ముంచెత్తడం నీటి ధర్మం, మీరు శాంతించి గంగను విడిచిపెట్టండి అన్నారు.


ఎవరైనా తమకు అపకారం చేస్తే, ఉత్తములకు అపకారం చేసినవారి యెడల కోపం ఒక క్షణం మాత్రమే ఉంటుంది. మధ్యములకు రెండు ఘడియల కాలం కోపం ఉంటుంది. అధములకు ఒక రోజంతా కోపం ఉంటుంది, కానీ పాపిష్టివాళ్ళకు మాత్రం మరణం వరకు కోపం ఉంటుంది అని శాస్త్రం అంటొంది. మహానుభావుడు జహ్ను మహర్షి ఉత్తముడు కనుక ఆయన వెంటనే శాంతించి, భగీరథ నీ కోసం గంగను విడిచిపెట్టెస్తున్నాను అన్నాడు. గంగను తన కుడి చెవిలోనుండి విడిచిపెట్టాడు. జహ్ను మహర్షి చెవి నుండి పుట్టింది కనుక గంగకు జాహ్నవి అని పేరు.

మళ్ళీ భగీరథుడు రథం ఎక్కి ముందుకు కదిలాడు, గంగ ఆయన రథాన్ని అనుసరించింది. మళ్ళి గంగలోకి దిగి స్నానం చేసే వాళ్ళు స్నానాలు చేశారు. చివరకు భగీరథుడు తన రథాన్ని పాతాళ లోకంలో తన పితృదేవతల భస్మరాశులున్న ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. గంగ  ఆ 60,000 మంది బూడిదకుప్పల మీద నుండి ప్రవహించగానే వాళ్ళందరికి ముక్తి లభించి వాళ్ళ ఆత్మలు స్వర్గలోకాలకు వెళ్ళిపోయాయి.

వెంటనే బ్రహ్మ దేవుడు వచ్చి నీవు చేసిన తపస్సు వల్ల గంగ భూమికి వచ్చి, వారి భస్మరాశుల మీద నుండి ప్రవహించింది. ఈ భూమి మీద సముద్రములలో నీరు ఉన్నంతకాలం సగరులు స్వర్గలోకంలో ఉంటారని వరమిచ్చాడు.

to be continued............................      

మన దేవాలయాలు-8

ఓం గం గణపతయే నమః
ఆదివారం-ప్రత్యేకం 
మన దేవాలయాలు-8
దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాల రక్షణే మన రక్షణ)


దేవాలయాలు పవిత్రమైన స్థలాలు. మన దేవాలయానికి వెళ్ళగానే, ఆలయ ప్రవేశానికి ముందు ప్రదక్షిణం చేస్తాం. అసలు ప్రదక్షిణం అంటే ఏమిటి?

ప్రదక్షిణం పదంలో ప్రతి అక్షరానికున్న గొప్పతనం తెలుసుకుందాం.'ప్ర ' అనే అక్షరం సకలపాపవినాశనానికి సూచకం. ' ద ' అనే అక్షరానికి అర్ధం కోరికలన్నీ తీరడం. 'క్షి ' అంటే రాబోవు జన్మలఫలం. 'ణ ' అంటే అజ్ఞానం నుండి విముక్తిని ప్రసాదిస్తుంది.

యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ............ అంటూ ప్రదక్షిణం చేస్తాం, అంటే అనేక జన్మల నుండి నేను చేసిన పాపాలన్ని ఈ ప్రదక్షిణలు చేయడం వలన నశించిపోవాలి. పాపపు పనులు చేసి ఉండచ్చు, అనేక జన్మల పాపం వల్లే ఈ కష్టతరమైన జీవితం గడుపుతున్నాను, నాకు నీవు తప్ప వేరే దిక్కే లేదు పరమాత్మ. నా మీద కారుణ్యంతో నన్ను రక్షించు అని అర్దం.


యానికానిచ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
................................
..............................
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష జనార్దన

అంటూ ప్రదక్షిణం చేస్తాం, అంటే అనేక జన్మల నుండి నేను చేసిన పాపాలన్ని ఈ ప్రదక్షిణలు చేయడం వలన నశించిపోవాలి. పాపపు పనులు చేసి ఉండచ్చు, అనేక జన్మల పాపం వల్లే ఈ కష్టతరమైన జీవితం గడుపుతున్నాను, భవిష్యత్తులో కూడా పాపం చేసే అవకాశం ఉంది. నాకు నీవు తప్ప వేరే దిక్కే లేదు పరమాత్మ. ఓ జనార్దన! నా మీద కారుణ్యంతో నన్ను రక్షించు అని అర్దం.

ప్రదక్షిణం చేయడం అంటే " ఓ భగవంతుడా! నేను అని వైపుల నుండి నిన్నే అనుసరిస్తున్నాను. నా జీవితం అంతా నీవు చెప్పిన మార్గంలోనే నడిపిస్తాను, నీవు చెప్పినట్టే జీవిస్తాను " అని పరమాత్మకు చెప్పడం.

ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ చుట్టూ మనం తిరిగే అవకాశమే లేదు. అటువంటి పరమాత్మ మనలో ఆత్మస్వరూపంగా ఉన్నాడు,  మనలో ఉన్న పరమాత్మను గురించి తెలుసుకోవాలంటే, బాహ్యవిషయాలను పక్కనబెట్టి, మన గురించి మనం విచారించాలని గుర్తుచేసేది, మనల్ని మన ఆత్మతత్వం చుట్టు తిప్పెది ఈ ప్రదక్షిణం.

ఇంకా మిగిలివుంది.

దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాల రక్షణే మన రక్షణ)

ఓం శాంతిః శాంతిః శాంతిః
to be continued.............
  

Saturday 26 January 2013

గంగావతరణం(11)

ఓం
గంగావతరణం(11)

శివుడు విప్పిన జటాజూటాంలో గంగ సుడులు తిరుగుతూ ఒక సంవత్సరంపాటు ఉండిపోయింది. ఎంత నీరు పడినా, ఒక్క చెమటచుక్క పరిణామంలో కూడా గంగ కిందకు పడలేదు. దేవతలు, బ్రహ్మదేవుడు, భగీరథుడు గంగ క్రిందకు పడుతుందని ఆకాశం వైపు చూస్తున్నారు. భగీరథుడు వేచిచూసి బ్రహ్మ దేవుడిని అడుగగా, శివుడు గంగ అహకారం తొలగించడానికి ఆమెను తన జటాజూటంలో బంధించాడని చెప్పాడు.

మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు భగీరథుడు. తపస్సు చేసి, శివా! గంగ రోషం బాగానే ఉంది. నీ ప్రతాపమూ బాగుంది. ఇప్పటికైనా గంగను విడిచిపెట్టు అన్నాడు. భగీరథుడి మాటలు విన్న పరమశివుడు గంగను హిమాలయ పర్వతాలలో బ్రహ్మదేవుడి చేత నిర్మించబడిన బిందు సరోవరంలో పడేలా విడిచిపెట్టాడు. శివుడు తన జటాజూటంలో ఉన్న గంగను విడిచిపెట్టాగానే గంగా పెద్దశబ్దం చేసుకుంటూ, మొసళ్ళతో, ఎండ్రకాయలతో, చేపలు, పాములతో సుడులు తిరుగుతూ, మంచి నురుగుతో, ఆ శబ్దం విన్నా, చూసినా భయం వేసేంత ప్రవహంతో గంగ భూమి మీద పడింది.

నదుల యొక్క మార్గాన్ని నిర్దేశించగల అధికారం ఒక్క బ్రహ్మదేవుడికే ఉంది. సృష్టి ప్రారంభంలో ఆయనే నది ప్రవాహ మార్గాన్ని నిర్దేఇంఛాడు. భగీరథుడు రధాన్ని అనుసరించమని గంగను వెళ్ళమని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. గంగ భగీరథుని రధం వెనుకాలే వెళ్ళింది.

మాంచి ఎండాకాలంలో మనకు త్రాగునీరు రానప్పుడు మన ప్రక్కవీధిలోకి ఒక ప్రభుత్వ ట్యాంకరు వస్తోంది అని తెలియగానే, అన్ని పనులు వదిలేసి జనం నీటి బిందేలు పట్టుకుని ఎలా పరిగెడతారో, అదే విధంగా గంగ భూమి మీదకు పడిందనగానే దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషులు, ఋషులు, మునులు, మనష్యులు, పాపం చేసి నరకలోకంలో శిక్షలు అనుభవిస్తున్నవారు, అందరూ ఆ గంగలో స్నానం చేయడానికి, గంగ నీటిని త్రాగడానికి పరుగులుతీస్తున్నారు.

మహామహా పాతకాలు చేసినవారు గంగలో స్నానం చేయగానే వాళ్ళ పాపరాశి కాలిపొయి మంచి శరీరాలను పొంది దేవలోకాలకు వెళ్ళిపోతున్నారు.ఆ ప్రవాహ వేగాన్ని తట్టుకోలేనివారు, ముసలివారు స్నానం చేయడం కష్టమని గంగ నీటిని తలమీద చల్లుకుంటున్నారు. వారు వెంటనే ఊర్ధ్వలోకాలు వెళ్ళీపోతున్నారు. గంగలో స్నానం చేయడం ఆలస్యం, మంచి శక్తులను పొంది, పవిత్రులై ఆకశంలోకి ఎగిరిపోతున్నారు.

గంగ ఇంత పవిత్రమైంది ఎందుకు? శివుడు శరీరాన్ని తాకింది, ఆయన జటాజూటం నుంచి పడింది. పరమశివుడిని తాకడం వలన గంగ పరమపవిత్రమై, గంగను ఇతర జలాలో స్మరించినంత మాత్రం చేతనే, ఇతర జలాలను కూడా పవిత్రం చేయగల శక్తి లభించింది.

ముందు భగీరథుడు రథం మీద వెళ్తున్నాడు, ఆయన రథాన్ని గంగ అనుసరిస్తోంది.దేవతలందరూ ఆకాశంలో గంగ ప్రవాహం వెనుక వెళ్తున్నారు. బంగారం వంటి రంగుతో, పెద్ద శబ్దంతో, మంచి పొంగుతో, అలలతో, పక్కన ఉన్న నేలను తుంపర్లతో తడుపుకుంటూ ఆయన ఎటు వెళ్తే గంగ అటు వెళ్తోంది.

ఇలా సాగిపొతున్న గంగ ప్రవాహం శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. భగీరథుడు వెనక్కి తిగి చుశాడు కాని గంగ కనిపించలేదు.

to be continued.....................        

Friday 25 January 2013

గంగావతరణం(10)

ఓం
గంగావతరణం(10)

శివుడు, భగీరథుడు, దేవతలు, బ్రహ్మ అందరూ హిమాలయపర్వతాలకు వెళ్తారు. శివుడు తన రెండు చేతులను నడుము మీద వేసుకుని జటజూటం విప్పి నిల్చున్నాడు. అలా శివుడు తన జటలను విప్పి నిలబడగానే ఆకాశం నుండి క్రిందకు పడమని బ్రహ్మదేవుడి ఆజ్ఞ.

 అందుకని గంగ మంచిప్రవాహంతో ఆకాశం నుండి బయలుదేరింది. చాలా వేగంగా వచ్చేస్తోంది. క్రింద నిల్చున్న పరశివుడిని చూసి నవ్వుకుంది. తన ప్రవాహ బలం తెలియక, శివుడు జటాజూటంలో బంధించడానికి నిలబడ్డాడు, తాను ఒక్కసారి క్రిందకు దూకితే ఆ శివుడి తల బద్దలవుతుందని, ఈ శివుడిని తన ప్రవాహవేగంతో పాతాళానికి ఈడ్చుకుపోవాలని అనుకుంది. తన ప్రతాపం చూపిద్దాం అని మొసళ్ళతో, తాబేళ్ళతో, ఎండ్రకాయలతో, కప్పలతో పడిపోదామని అని నిశ్చయించుకుంది.

ఈ విషయం పరమశివుడికి తెలిసింది. అందరిలోనూ ఆత్మగా ఉన్నది శివుడే. మనం చేసే ప్రతి కర్మకు సాక్షి ఆ పరమశివుడు. మనం ఏదో పని చేసి, అది దేవుడికి తెలియదనుకుంటే అది మన అజ్ఞానమే అవుతుంది. మనం చేసే ప్రతిపని, ఆలోచన, మాట్లాడే ప్రతి మాట కూడా ఆ పరమాత్మకు తెలుస్తాయి. అలాగే పరమశివునకు గంగ మనసులో ఉన్న భావం అర్ధమైంది. గంగ అహకారాన్ని అణచాలనుకున్నాడు. అందుకే హిమాలయాలంతా పరమపవిత్రమైన తన జటాజూటాన్ని(జడలను) పెద్దగా విస్తరించాడు శివుడు.

అంతే గంగ ఒక్కసారిగా ఆకాశం నుండి శివుడు జటాజూటం లోనికి దూకింది. దూకూతూ నేను శివుడను పాతాళానికి ఈడ్చుకుపోతాననుకుంది.

ఒక సంవత్సరం గడిచింది. దేవతలూ, బ్రహ్మ, భగీరథుడు అందరూ గంగ క్రిదకు పడుతుందేమో అని ఎదురు చూస్తున్నారు. ఎంత కాలం చూసినా ఒక్క చుక్క కూడా క్రిందపడలేదు.

to be continued....................  

Thursday 24 January 2013

గంగావతరణం(9)


ఓం
గంగావతరణం(9) 

భగీరథుని ఘోరమైన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ఒంటరిగా కాకుండా సమస్త దేవతలకు కూడి ప్రత్యక్షమయ్యి, నీ తపస్సుకు సంతోషించాను, ఏమి వరం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు భగీరథుడు " నా పితృ దేవతలు కపిలమహర్షి కోపానికి భస్మమై పాతాళంలో పడి ఉన్నారు. వారి మీద నుండి దేవలోకంలో ఉండే గంగ ప్రవహిస్తే తప్ప వారు ఉత్తమలోకాలు పొందలేరు. అందువల్ల గంగా వారి భస్మరాశుల మీదుగా ప్రవహించేలా ఆదేశాలివ్వండి. అలాగే నాకు సంతానం కలగాలన్నాడు ". వరం ఇస్తున్నా అన్నాడు బ్రహ్మదేవుడు.

నీ రెండవకోరిక ఉందే అది సులువైనది. కాని మొదటి కోరిక, గంగను భూమికి తీసుకురావడం, అది అంత సులభమైన పని కాదు. గంగ భూమి మీద పడితే ఈ భూమి బద్దలవుతుంది. గంగను తట్టుకునే శక్తి ఈ భూమికి లేదు. ఆ గంగను పట్టగల సమర్ధుడు పరమశివుడు ఒక్కడే. అందువల్ల ఆయన గురించి తపస్సు చేయమన్నాడు.

ఎవరి కోసం భగీరథుడు ఇన్నిన్ని సంవత్సరములు, ఇన్ని సార్లు తపస్సు చేస్తున్నాడు. తన కోసం కాదు. తన పితృదేవతలకోసం. మనిషై పుట్టినవాడి కర్తవ్యం ఏమిటి? పితృదేవతలను ఉద్దరించడం, వారికి ఉత్తమ గతులు కల్పించడం. అందుకే భగీరథుడు గంగను భుమికి రావాలని వరం అడిగాడు. తాను వివాహం చేసుకుని సంతానం పొంది పితృ ఋణం తీర్చుకోవడం కూడా పుట్టిన ప్రతి మనిషి కర్తవ్యం. అందుకే తనకు సంతానం కలగాలని కోరుకున్నాడు.

మనకు రామాయణం నేర్పుతున్నదేమిటి? కోడుకై పుట్టినవాడు తండ్రి దగ్గర ఆస్తులు తీసుకోవాలని ప్రయత్నించడం కాదు. తన తల్లిదండ్రులు బ్రతికున్నతకాలం వారిని కంటికి రెప్పలా, ప్రేమగా చూసుకోవాలి. వారు మరణిచాక వారికి ఉత్తమలోకాలను కల్పించేందుకు పిండప్రధానం చేయాలి, తర్పణలివ్వాలి, వారి మరణతిధి రోజున వారికి పితృకర్మ చేయాలి.

కాని ఈ కాలం వారు చేస్తున్నది, బ్రతికున్నప్పుడే తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు, పసివయసు నుండి ఎంతో ప్రేమగా పెంచినా, ముసలివయసు రాగానే తల్లిదండ్రులను చూసూకోవడం మా వల్ల కాదు, వీరితో మేము సర్దుకుని బ్రతకలేమంటూ వారిని తిట్టిపోస్తూ ఇంటిలోనుండి తోసేయడం. బ్రతికిఉండగానే వారిని చంపేస్తున్నారు, నరకం చూపిస్తున్నారు. ఇక వారు చనిపోయాక తర్పణలివ్వడం వృధా ఖర్చుగా భావిస్తున్నారు. రామాయణం చెప్పినవేవి ఆచరించకుండా శ్రీ రాముడి ఆలయలు చుట్టూ తిరుగుతూ, శ్రీ రాముడి దీవెనలు పొందాలని చూడడం మూర్ఖత్వమే అవుతుంది.            

మళ్ళీ భగీరథుడు పరమశివుడి కోసం తపస్సు ప్రారంభించాడు. కాలి బొటనువేలి చివరి భాగం మీద నిలబడి ఒక్క సంవత్సరం తపస్సు చేశాడు. శివుడు త్వరగా వరాలిస్తాడు. అందుకే ఆయన బోళాశంకరుడు, భక్త వశంకరుడని పేర్లు. ఓం నమః శివాయ. ఆయన ఒక్క సంవత్సరానికే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమవ్వగానే నీకే వరం కావాలి అని కూడా అడగలేదు. గంగను నా తలమీద జటాజూటంలో ధరిస్తాను అన్నాడు శివుడు. అడగకుండానే వరలిచ్చాడు శివుడు.

to be continued....................

Wednesday 23 January 2013

గంగావతరణం(8)

ఓం
గంగావతరణం(8)

క్రోధాగ్నికి భస్మైపోయారు కనుక వీరికి ఉత్తమ గతులుండవు. వీరు ఊర్ధ్వలోకాలకు, భూలోకానికి మధ్య అంతరిక్షంలో ఎక్కడో వెళాడుతుంటారు. నా తండ్రి సమానులైన వీరికి ఉత్తమ గతులు కల్పించడం కోసం నేను తర్పణం విడుస్తానని అంశుమంతుడు దగ్గరలో నీరు లేకపోతే చాలా దూరం వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు.

అంతలో అంశుమతుడికి మేనమామైన గరుత్మంతుడు కనిపించి, వారిది మామూలు మరణం కాదు, మహాపురుషుడైన కపిల మహర్షి కోపానికి బలైపోయారు. వీరికి మామూలు జలంతో తర్పణాలిస్తే ప్రయోజనం ఉండదు. హిమవంతుడి కూమార్తైన గంగమ్మ యొక్క జలంతో తర్పణలిస్తే తప్ప విముక్తి లభించదు. ఈ 60,000 సగరుల భస్మరాశుల మీది నుండి గంగ ప్రవహించాలి. అప్పుడే వీరికి ఉత్తమ లోకాలు లభిస్తాయి అన్నాడు.

ఆ మాటలు విని, గుర్రాన్ని తీసుకుని యజ్ఞప్రదేశానికి వచ్చి, సగర చక్రవర్తికి ఈ వార్త చెప్పి, యజ్ఞాన్ని పూర్తిచేశాడు. తన కూమారులకు ముక్తిని కల్పించడానికి సగరచక్రవర్తి చాలా ప్రయత్నం చేశారు కానీ ముసలివారవడం వలన మరణించాడు.

ఆయన తరువాత అంశుమంతుడు రాజయ్యాడు. తన పితరులకు విముక్తి కల్పించడానికి గంగను తీసుకురావాలనుకున్నాడు, కానీ తపస్సు చేయలేకపోయాడు, సగరులకు ముక్తిని కల్పించలేకపోయాడు, కాలక్రమంలో మరణించాడు.

తరువాత దిలీపుడు రాజయ్యాడు. చాలా గొప్పవాడు ఈయన. ఈయన ప్రయత్నం చేశాడు కానీ తపస్సు చేయలేదు, గంగను భూమికి తీసుకురాలేదు.

దిలీప మహారజు తరువాత భగీరధుడు రాజయ్యాడు. ఆయన రాజువుతూనే తన పితృదేవతలను ఎలా ఘొర నరకాలనుండి ఎలా రక్షించాలి, వారికి ఎలా ముక్తిని కల్పించాలని ఆలోచించి, మహారాజు అవ్వగానే రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి బ్రహ్మదేవుడి కోసం తపస్సు మొదలుపెట్టాడు.

ఎలా తపస్సు చేశాడు? రెండు చేతులు పైకెత్తి, తనకు నాలుగు వైపులా అగ్నిహోత్రాలను పెట్టుకుని, కన్నులు మూయకుండా సూర్యుడినే చూస్తూ, నెలకు ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకుంటూ, ఇంత బాధ అనుభవిస్తున్నా, తన మనసును, శరీరాన్ని జయించి, వాటి గురించి ఆలోచించకుండా, బ్రహ్మదేవుడి కోసం కొన్ని వేల సంవత్సరములు ఘోరమైన తపస్సు చేశాడు.  
 
to be continued..............      

Tuesday 22 January 2013

గంగావతరణం(7)

ఓం
గంగావతరణం(7)

ఈ 60,000 మంది ఈయన మీదకు పరుగేడుతున్నప్పుడు వచ్చిన శబ్దాన్ని ఆయన విన్నారు.వారు భూమికి చేసిన అపరాధానికి క్రోధంతో అప్పటికే ఉన్నారు కపిల మర్షి రూపంలో ఉన్న వాసుదేవుడు. ఆయన ముఖం కోపంతో ఎర్రబడి, హుంకారం చేస్తూ కళ్ళు తెరిచారు. ఈ 60,000 బూడిద కుప్పలుగా మిగిలిపోయారు. మనకు శ్రీ రామాయణం ఇస్తున్న సందేశం ఏమిటి? భూమాతను ఎవరు అగౌరవపరుస్తారో, భూమికి అపకారం చేస్తారో, కలుషితం చేస్తారో వారు ఈ రోజు కాకపోయిన ఏదో ఒకరోజు శ్రీ మహావిష్ణువు క్రోధానికి గురవుతారు.

సగరచక్రవర్తి తన 60,000 మంది సగరుల కోసం ఎంతోకాలం ఎదురు చూశాడు. ఎంతకాలానికి రాకపోయే సరికి తన మనుమడు అంశుమంతుడిని పిలిచి, అశ్వం తిరిగి రాకపోతే యజ్ఞం పూర్తవ్వదు. నేను దీక్షలో ఉన్న అందువల్లు ఇక్కడినుండి కదులరాదు. కనుక ఇప్పుడు నువ్వు పాతాళానికి వెళ్ళు. వెళ్ళెటప్పుడు నీకు విరోధులైన వారు ఎదురుపడచ్చు కనుక ఖడ్గాన్ని, దనస్సు, బాణాలను వెంటతీసుకువెళ్ళు. కాని మార్గమధ్యంలో మహాపురుషులు, గురువులు, పుజనీయులు కనిపిస్తే వారికి నమస్కరించి, పూజించు. ఎవరిని పదితే వారిని వేధించకు, అకారణంగా దూషించకు అని చెప్పి పంపించాడు.

తాను కూడా రసాతాలానికి బయలుదేరాడు. మొదట తూర్పు దిక్కును మోస్తున్న విరూపాక్షానికి ప్రదక్షిణం చేసి నమస్కరించాడు. అది అంశుమంతుడిని ఆశీర్వదించింది. అలాగే దక్షిణం, పడమర, ఉత్తర దిక్కుల భూభాగాన్ని మోస్తున్న మహాపద్మం, సౌమనసం,భధ్రం అనే ఏనుగులకు ప్రదక్షిణం చేసి, నమస్కరించి వాటి ఆశీర్వాదం పొందాడు. ఈశాన్య దిక్కుకు వెళ్ళాడు. అక్కడ కపిల మహర్షి ఆశ్రమం కనిపించింది. దానికి ఒక నమస్కారం చేశాడు. ప్రక్కనే గుర్రం గడ్డి మెస్తూ కనిపించింది. దాని తీసుకువెళ్ళడానికి దగ్గరకు వెళ్ళాగానే అక్కడ తన తండ్రి సమానులైన 60,000మంది సగరుల భస్మరాశులు కనిపించాయి. అయ్యో, నా తండ్రి సొదరులైన 60,000 మంది మహర్షి కోపానికి భస్మైపోయారని వాటిని చూసి భోరున విలపించాడు.

to be continued...........  

Monday 21 January 2013

గంగావతరణం(6)

ఓం
గంగావతరణం(6)

 శ్రీ మహావిష్ణువు(వాసు దేవుడు) కపిల మహర్షి రూపంలో ఈ భూమండలాన్ని కాపాడుతున్నాడు. వీళ్ళు చేస్తున్న దుష్కృత్యం వలన ఆయన తపిస్తున్నాడు. ఇలాంటి పనులు చేసేవారి ఈరోజు కాకపోయిన ఏదో ఒక రోజు ఆయన ఆగ్రహానికి గురై భస్మం అయిపోతారు, వాళ్ళు అల్పా ఆయువు కలవారు, పంచభూతముల జోలికి అనవరసంగా వెళ్ళి, వాటికి అపకారం చేసేవారి ఆయుర్దాయం(జీవిత కాలం) క్షీణిస్తుంది. అందువల్ల మీరు ఆవేశపడకండి అని బ్రహ్మదేవుడన్నాడు, దేవతలు తిరిగి వెళ్ళిపోయారు.

వాళ్ళు అవిధంగా తవ్వి లోపలకు వెళ్తుంటే, వారికి అడ్డువచ్చిన పాములను, మనుషులను, అల అడ్డువచ్చిన ప్రతిజీవిని చంపుకుంటూ వెళ్ళారు. మొదట వారు తూర్పు దిక్కుకు వెళ్ళారు. అక్కడ విరూపాక్షం అనే ఏనుగు ఉంది. అది తన కుంభస్థలం మీద తూర్పు దిక్కున ఉన్న భూమండాలాన్ని మోస్తోంది. మన భూమిని అష్టదిగ్గజాలు మోస్తుంటాయని ఋషులు చెప్పారు. అందులో ఒకటి ఈ విరూపాక్షం. దానికి ఒక్కొక్కసారి దాని కుంభస్థలం నొప్పి పెడితే అది ఒకసారి తన కుంభస్థలాన్ని  కదుపుతుంది. అప్పుడు తూర్పుదిక్కున భూకంపాలు వస్తాయని రామాయణంలో ఉంది. దాని చుట్టు ప్రదక్షిణం చేసి, నమస్కరించారు. దక్షిణ దిక్కుకు వెళ్ళారు . అక్కడ మహాపద్మం అనే ఏనుగు దక్షిణ దిక్కున ఉన్నభూమిని మోస్తోంది. దాని చుట్టు ప్రదక్షిణం చేసి, నమస్కరించారు. అటు తరువాత పడమర దిక్కుకు వచ్చారు. అక్కడ సౌమనసం అనే ఏనుగు పశ్చిమ దిక్కున గల భూమిని మోస్తోంది. దానికి ప్రదక్షిణం, నమస్కారం చేశారు. అక్కడి నుండి ఉత్తర దిక్కుకు వెళ్ళారు. భధ్రం అనే ఏనుగు ఉత్తర దిక్కు భూమిని మోస్తొంది. దానికి ప్రదక్షిణం, నమస్కారం సమపించారు. అంటే మనమేం అర్ధం చేసుకోవాలి? ఎంత ముఖ్యమైన పని మీద వెళుతున్నా, పరోపకారం చేసేవారు, నలుగురి కోసం తమ జీవితాన్ని త్యాగం చేసేవారు, గొప్పవారు, పూజ్యులు, దేవతలు కనిపించగానే ముందు వారికి నమస్కరించాలి. వారి ఆశీర్వాదం తీసుకుని ముందుకు వెళ్ళాలి.

ఇక వెత్తుక్కుంటూ ఈశాన్య(ఉత్తర-తూర్పు మధ్య ప్రదేశం) దిక్కుకు వెళ్ళారు. అక్కడ తపోవనంలో మహాతేజో మూర్తి కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్నారు. ఆయన ప్రక్కనే గుర్రం గడ్డిమేస్తూ కనిపించింది. వాళ్ళనుకున్నారు ఈయనే గుర్రాన్ని అపహరించి ఉంటారు. ఈయనే దొంగ అన్నారు. మనకు రామాయణం ఇస్తూన సందేశం ఏమిటి? ఆధారం లేకుండా ఎవరినిపడితే వారిని, ముఖ్యంగా మహాత్ములను నిందించకూడదు. వారి గురించి లేనిపోని మాటలు మాట్లాడకూడదు. లేనిపోని అభాంఢాలు వేయకూడదు. సుభాషితాలు కూడా అదే అంటూన్నాయి. సాధుపురుషులు, మాహత్ముల జోలికి వెళ్ళి, వారిని ఇబ్బంది పెట్టి, దూరంగా పారిపోయి తప్పించుకుందాం అనుకుంటున్నారేమో. సాధుపరుషులు చేతులు చాలా పెద్దగా ఉంటాయి. ఎంతదూరం పారిపోయిన వారి చేతుల నుండి తప్పించుకోలేరు అంటున్నాయి. అటువంటిది ఈ 60,000 మంది అనవసరంగా ఆయనను నిందించడమే కాదు చేతులలో గునపాలు, నాగళ్ళు ధరించి కపిల మహర్షి మీద దాడి చేయడానికి ఆయన మీదకు దూసుకెళ్ళారు.
       
to be continued.................

Sunday 20 January 2013

గంగావతరణం(5)

ఓం
గంగావతరణం(5)

ఏదైన దీక్ష తీసుకునే ముందు చేతికి కంకణం కడతారు. అది దీక్ష పూర్తయ్యేవరకు తీయకూడదు. అటువంటి సమయంలో బంధువుల మరణాల కారణంగా వచ్చిన సూతకం ఆ దీక్షపరుడికి ఉండడు. దీక్ష ముగిసిన తరువాత సాధరణంగా సూతకం ఎన్నిరోజులుంటుందో అన్ని రోజులు పాటించాలి. సగరచక్రవర్తి తన 60,000 మంది సగరులను పిలిచి, తాను కంకణం ధరించాడు కనుక యాగం మధ్యలో లేవకూడదని, ఇంద్రుడు తన పదవి కోసం అశ్వాన్ని దొంగిలించుంటాడు. అందువల్ల భూగోళమంతా గాలించమని ఆజ్ఞాపించాడు. అంతా వెతికినా గుర్రం కనపడక తిరిగివచ్చారు సగరులు. భూగోళమంతాట వెతికినా కనపడలేదన్నారు.

ఇంద్రుడు అశ్వాన్ని పాతాళంలో దాచిఉంటాడని గ్రహించి మీరు 60,000 మంది ఉన్నారు, ఈ భూగోలమంతా మీ 60,000 మంది 60,000 యోజనాలు వెతకండి అన్నాడు సగర చక్రవర్తి. ఎలా వెతుకుతారో తెలుసా? మీకు వజ్రముల వాంటి గోర్లున్నాయి. ఒక్కొక్కరు ఒక్క యోజనం చొప్పున 60,000 యోజనాల భూమినిలో ఉన్న మట్టిని పెకిలించండి, భూమిని నాగళ్ళు పెట్టి తవ్వేయండి, గునపాలతో చీల్చేయండి, పాతాళానికి వెళ్ళి గుర్రాని తీసుకురండి అన్నాడు సగర చక్రవర్తి. 60,000 మంది భూమిని తవ్వడం, చీల్చేయడం మొదలుపెట్టారు.

ఇది చూసిన దేవతలు పరుగుపరుగున బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళారు. ఈ భూగోళమంతా దైవశక్తులు ఉంటాయి. పంచమహాభూతాలు (ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి/పృధ్వీ ) ఉంటాయి. చెట్లను ఆకారణంగా నరికేయడం, కుదురుగా ఉండలేక పువ్వులు, మొగ్గలు, ఆకులు తెంపడం, పంచభూతాలకు ఇబ్బంది కలిగించడం అంటే కలుషితం చేయడం వంటివి శాస్త్రం నిషేధించింది ( మనం కూడా ఇప్పుడు అదే చేస్తున్నాం. భూమిని రోజురోజుకు వెడెక్కిస్తున్నాం, ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు పడేస్తున్నాం, నదులను, గాలిని, ఆకాశాన్ని, భూమిని కలుషితం చేస్తున్నాం. ప్రకృతి  వనరులను ఇష్టారాజ్యంగా వాడేస్తున్నాం, ప్రకృతిని దోచేస్తున్నాం, భూతాపాన్ని పెంచేస్తున్నాం). ఇవన్ని దేవతలు అపచారం చేయడమే. అందుకే పర్యావరణాన్ని పరిరక్షించండి. వారు వారి ధర్మాన్ని పాటించడం మరిచిపోయి, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా వెళ్ళారు. అందుకే 12 మంది ఆదిత్యులు, 11 రుద్రులు, అష్ట (8) వసువులు, 2 అశ్విని దేవతలు వెళ్ళారు. వీరందరూ కలిపి 33. మొత్తం 33 కోట్ల దేవతాగణాలు సగరులు చేస్తున్న అకృత్యాన్ని సహించలేక పరుగుపరుగున బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు.  
      
to be continued..............................  

మన దేవాలయాలు-7

ఓం గం గణపతయే నమః
ఆదివారం-ప్రత్యేకం 
మన దేవాలయాలు-7
దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాల రక్షణే మన రక్షణ)


మనకు దేవాలయంలో ఉండే విగ్రహాలును చాలా మంది బొమంలంటారు. సంస్కృతంలో విగ్రహానికి అర్ధం విశేషంగా శక్తిని గ్రహించేది అని.ఆలయంలో ఉన్న విగ్రహం క్రింద యంత్రం పెడతారు. మంత్రం ప్రకృతిలో కలిగించే తరంగాల ఆకారం యొక్క సాకార రూపమే యంత్రం. అటువంటి రాగి యంత్రాన్ని విగ్రహం క్రింది భాగంలో పెట్టి దాని మీద విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. క్రింద పంచలోహాలు వేస్తారు. పంచలోహాలు,రాగి యంత్రం భూమిలో ఉన్న విద్యుతయస్కాంత శక్తిని ఆకర్షిస్తుంది. పైన పిరమిడ్ ఆకారంలో ఉన్న గోపురం/ విమానం కూడా శక్తిని గ్రహిస్తుంది. ఈ రెండు శక్తులను కూడా విగ్రహం గ్రహిస్తుంది.

ఒక ముఖ్యమైన విషయం. చాలామంది అవి శిలలు మాత్రమే అనుకుంటారు. కాని మన దేవాలయాల్లో ఉన్నవి శిలలు కాదు. హిందువులు రాళ్ళకు పూజలు చేయటంలేదు. ఆ విగ్రహాన్ని వేదమంత్రాలు చదువుతూ వడ్లు, ధాన్యం, పాలు, పెరుగు, గోధుమలు............... ఇలా మన ప్రాణానికి ఆధారమైన ప్రాణశక్తి కలిగిన వస్తువుల మధ్యలో పెడతారు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి విగ్రహ ప్రతిష్ట చేసే సమయంలో తంత్రశాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని ఆ విగ్రహానికి ప్రాణం పోస్తారు. అదే ప్రాణప్రతిష్ట. అప్పటినుంచి అది విగ్రహం కాదు. దానిలోనికి మహామహిమాన్వితమైన దైవశక్తి వస్తుంది. ఆ సమయం నుంచి ఆ విగ్రహం మన మాటలు వింటుంది, తన కళ్ళోతొ జరిగేవన్ని చూస్తుంది. మనం చెప్పుకునే కష్టాల్లన్నీ కూడా ఆ విగ్రహంలో ఉన్న దైవానికి వినిపిస్తాయి. అక్కడ శక్తి ఉందికనుకే దేవాలయంలో దేవునికి నిత్యం ధూపదీపనైవెధ్యాలు పెడతారు. ఏ ఊరిలో అయితే దేవాలయం మూతపడుతుందో, ఎక్కడైతే గుడిలో దేవునకు నిత్యం నైవెధ్యం ఉండడో ఆ ఊరి కరువుకాటకాలతో, రోగాలతో, మరణాలతో అల్లాడుతుంది.

చాలామంది విగ్రహారాధన తప్పంటారు. అంతటా భగవంతుడున్నాదు, ఆయనకు రూపం లేదు.......... ఇల రకరకాలుగా అంటారు. అది నిజమే భగవంతుడు అంతటా ఉన్నాడు. ఆయనకు రూపం లేదు, ఎందుకంటే అన్ని రూపాలు ఆయనవే. అన్ని తానై ఉన్నాడు. రాయిలోనూ ఉన్నాడు, పక్షిలోనూ ఉన్నాడు, చెట్టు, పుట్ట, మనిషి, నది, అలా సర్వవ్యాపిగా ఉన్నాడు. కాని ఇది అందరు అర్ధం చేసుకోవడం కష్టం. అందరికి భగవంతుడిని అంతట చూసేంత జ్ఞానం ఉండదు. మరి కష్టాలు వస్తే ఎల చెప్పుకుంటారు? తమ భాధను ఎలా పంచుకుంటారు? తమకు భయం వేసినప్పుడు ఏ రూపాన్ని స్మరిస్తారు? ఆధ్యాత్మిక జ్ఞానం అంతగా లేనివారు తమకు వచ్చిన భాధను పంచుకోవడం కోసం పరమాత్మ ఒక విగ్రహంగా దర్శనమిస్తున్నాడు. వారికి భాధ కలగగానే తమకంటూ ఒకడున్నాడన్న భావంతో వెళ్ళి తమ భాధను పరమాత్మతో పంచుకుంటున్నారు. రామకృష్ణ పరమహంస కూడా విగ్రహారాధన తప్పకాదు, మొదట సగుణారాధాన చేస్తుంటే కాలక్రమంలో భగవత్తత్వం అర్దం అవుతుందంటారు. విగ్రహాల్లో మాత్రమే దేవుడు లేడు, అంతటా ఉన్నవాడు విగ్రహాల్లో కూడా ఉన్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి.          
 
దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాల రక్షణే మన రక్షణ)

ఓం శాంతిః శాంతిః శాంతిః
to be continued.............
  

Saturday 19 January 2013

గంగావతరణం(4)

ఓం
గంగావతరణం(4)

ప్రజలందరూ వెళ్ళి సగరుడికి అసమంజసుడి విషయం చెప్పారు. క్షత్రియుల ధర్మం తెలిసినవాడు కనుక, ప్రజలకు హాని చేసేవాడు తన కూమారుడైనా సరే అతనికి తగిన శిక్ష పడాలని అసమంజసుడికి రాజ్య బహిష్కారం విధించాడు సగరుడు.ఆనాడు లోకకంటకుడు కన్న కొడుకైనా శిక్షార్హుడే అని రాజులు నిరూపించారు. ఒక స్త్రీ మీద పైశాచికంగా అత్యాచారం చేసి, ఆమె చావుకు కారణమైనవారిని ఉరి తీస్తే తమను(వాళ్ళలో చాలామంది, వాళ్ళ పిల్లలూ అత్యాచారలు చేసినవాళ్ళే కనుక)కూడా ఉరి తీయవలసి వస్తుందని వాళ్ళను ఉరి తీయకుండా ఆపిన ఘనత ఈనాటి మన రాజకీయనాయకులది.


వంశకరుడిని కోరుక్కునాడు కనుక ఈ అసమంజసుడికి ఒక కూమారుడున్నాడు. అతని పేరు అంశుమంతుడు. అతను సగరచక్రవర్తి దగ్గరే ఉండిపోయాడు. అసమంజసుడు అడవులకు వెళ్ళిపోయాడు.

చాలా కాలం అయిపొయింది. సగర చక్రవర్తి ముసలివాడయ్యాడు. రాజ్యం సుభిక్షంగా ఉండడం కోసం ఆయన అశ్వమేధయాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. యాగం/యజ్ఞం  ఎక్కడపడితే అక్కడ చేయకూడదు. దానికి శాస్త్రం కొన్ని ప్రదేశాలను చెప్పింది. యాగాలే కాడు ఏ పనైన సరే ఎక్కడ పడితే అక్కడ చేయాకూడదు. హిమాలయాలకు, వింధ్యపర్వతాలకు మధ్య ఉన్న భూమి పరమపవితమైంది. దాన్ని ఆర్యవర్తం అంటారు. అది యజ్ఞభూమి కనుక అక్కడ సగరచక్రవర్తి యాగం చేయాడానికి నిర్ణయించుకున్నాడు. దీక్షపరుడై కూర్చున్నాడు, యాగం మొదలుపెట్టారు, యాగానికి సంబంధించిన అశ్వాన్ని(గుర్రాన్ని) విడిచిపెట్టారు. అది గడ్డిమేస్తూ అన్ని ప్రాంతాలు తిరిగి ఆ ప్రదేశానికి చేరుకోవాలి. అప్పుడు యాగం పూర్తవుతుంది. చాలా కాలం గడిచిపొయింది. అశ్వం వెళ్ళింది కాని తిరిరాలేదు.

తన సింహాసనానికి అపాయం వస్తుందన్న భయంతో ఇంద్రుడు ఆ గుఱ్ఱాన్ని తీసుకువెళ్ళి, పాతాళంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి ప్రక్కన విడిచిపెట్టాడు.

ఇప్పుడు మనందరికి ఒక అనుమానం తప్పకుండా వస్తుంది. యాగం చేస్తే ఇంద్రుని పదవికి ముప్పెందుకు వస్తుందని. అందరు చెప్తారు ఇంద్రుడు స్వర్గలోకానికి అధిపతి. స్వర్గంలో ఉంటాడాని. ఎక్కడ ఉంది ఆ లోకం అంటే ఎక్కడో లేదు. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఏ విధంగానైతే నీరు ఆవిరి(water vapour) రూపంలో ఉన్నా మనకు కనిపించదో అదే విధంగా ఎందరో దేవతలు, యోగులు, సిద్ధులు, మహర్షులు, యక్షకిన్నెరకింపురుషులు మన చుట్టూ ఉన్నా ప్రకృతిలోనూ, పర్యావరణంలోనూ, ఈ భూగోళమంతటా మానవనేత్రానికి కనిపించకుండా ఉన్నారు (మరింత వివ్రంగా మరొకమారు చెప్పుకుందాం, ఇప్పుడే  వివరించడం మొదలుపెడితే అసలు విషయం నుండి దృష్టి మరలుతుంది). అందుకే ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడమని మన ధార్మిక గ్రంధాల్లోనే ఉంది. ప్రకృతిని(పర్యావరణాన్ని) నాశనం చేస్తే, అది ప్రకృతిలో ఉన్న దైవాలకు అపచారం చేసినట్లే అన్న విషయం జీవితాంతం గుర్తుపెట్టుకోండి.

యజ్ఞం ప్రకృతిలో ఉన్న దేవతలను సంతృప్తి పరుస్తుంది.యజ్ఞం చేయడం వలన ప్రకృతిలో చాలా మార్పులు సంభవిస్తాయి. మండు ఎండాకాలంలో, మిట్టమధ్యాహ్నం వేళ, కరువు ప్రాంతంలో కూడా యజ్ఞంతో వర్షం కురిపించవచ్చు. ఇది నిరూపింపబడింది. మీకు నా మీద నమ్మకంలేకపోతే 2-9-1993 నాటి ఆంధ్రజ్యోతి,9-10-1994 ఈనాడు దినపత్రికలు చూడండి. అంటే ఇప్పుడేం జరుగుతోంది. సమస్త ప్రకృతికి అధిదేవత ఇంద్రుడు. అతని ఆజ్ఞానుసారమే వర్షాలు కురుస్తాయి, గాలులు వీస్తాయి. యజ్ఞం చేయడం వలన మనిషి ప్రకృతిలో తనకు కావలసినవి పొందగలుగుతున్నాడంటే అది ఇంద్రుని ఆధిపత్యానికి, సింహాసనానికి గండి కొట్టినట్లే కదా.

అందుకే ఇంద్రుడు యాగాశ్వన్ని తీసుకుని వెళ్ళి తపస్సు చేస్తున్న కపిల మహర్షి వద్ద విడిచిపెట్టాడు.   చాలా కాలం గడిచిపొయింది. అశ్వం వెళ్ళింది కాని తిరిరాలేదు.
         
to be continued............................        

Friday 18 January 2013

గంగావతరణం(3)

ఓం
గంగావతరణం(3)

భృగు మహర్షి వద్దకు వెళ్ళి ఎవరికి వశోద్ధారకుడు జన్మిస్తాడో, ఎవరికి 60,000 మంది మహోత్సాహవంతులు జన్మిస్తారో అడుగగా, వారికి ఎవరు జన్మించాలో వారినే కోరుకోమన్నారు భృగువు.

కేశిని ధర్మం తెలిసినది. కన్నవారిని వదులుకుని, ఇంటి పేరును మార్చుకుని, భర్త వెంట నడిచి స్త్రీ ఎందుకు వస్తుంది అంటే భర్త వంశాన్ని నిలబెట్టాడానికే, తాను సంతానాన్ని కని, తన భర్త వంశాన్ని కొనసాగేలా చేయాడానికే అని ధర్మం చెప్తోంది. అంతేకాదు ఒక తండ్రి అదృష్టవంతుడని ఎప్పుడు అనిపించుకుంటాడంటే, తనకు మంచి సంతానం కలిగి, వారికి సంతానం కలిగి, ఆ సంతానానికి సంతానం కలిగి, వారందరిని తన కళ్ళతో చూసినప్పుడే. ధర్మం తెలిసినది కనుక తనకు వంశకరుడు జన్మించాలని కోరుకుంది.

సుమతి తనకు 60,000 మంది మహోత్సాహవంతులు కలగాలని కోరుకుంది. ఎంత మంది పుడితే ఏం లాభం. ఒక్కడు పుట్టినా వాడు వంశం పేరు నిలబెట్టేవారు కావాలి, చరిత్రలో నిలిచిపోవాలి.

మహాతపశ్శాలి, సత్యమే మాట్లాడేవాడు, వేదం అర్ధం సహితంగా తెలిసినవాడూ, వేదాన్ని నిరంతరం పఠించేవాడైన భృగుమహర్షి మాటలు నిజమైనాయి.కొంతకాలనికి వారు గర్భం ధరించారు, ప్రసవించారు. కేశినికి వంశకరుడైన కూమారుడు జన్మించాడు, అతనికి అసమంజసుడు అని నామకరణం చేశారు. సుమతికి ఒక మాంసపిండం నుండి 60,000 వేల మంది చిన్న చిన్న పిల్లలు పుట్టారు. వారు మరి చిన్నగా ఉండడం చేత నేతిభాండములలో పెట్టి వారిని పెంచారు. ఈనాడు మన చెబుతున్న test tube babies, ఇటువంటి గొప్ప శాస్త్రపరిజ్ఞానం త్రేతాయుగంలో, దాదాపు 12 లక్షల సంవత్సరముల క్రితమే మన హిందువులకు ఉంది. వారిని దాదులు(ఆయలు) పెంచి పెద్ద చేశారు. 

అసమంజసుడు, 60,000 మంది పిల్లలు పెరిగి పెద్దవారువుతున్నారు. 60,000 మంది బాగా ఉత్సాహవంతులయ్యారు. ప్రతి పనికి అత్యుత్సాహం చూపించేవారు. ఈ అసమంజసుడికి ఒక దురలవాటు ఉంది. రాజ్యంలో ఉన్న పిల్లలందరిని ఆడుకుందామన్న నెపంతో సరయు నది ఒడ్డుకు తీసుకువెళ్ళి, వారిని నదిలో ముంచి, వారి మీద నిలబడి తొక్కి, ఊపిరి ఆడకుండా చేసి, వారిని చంపి ఆనందించేవాడు. ప్రజలు చాలా కాలం పాటు సహనంతో ఉన్నా, కొంతకాలానికి వారికి సహనం నశించి, వెళ్ళి రాజైన సగరుడికి విన్నవించుకున్నారు.            

to be continued................

Thursday 17 January 2013

గంగావతరణం(2)


ఓం
గంగావతరణం(2)

ఆ సమయంలో ఆయోధ్య నగరాన్ని సగరుడనే ఒక మహారాజు పరిపాలిస్తూండేవాడు.ఆయన పేరు సగరుడు అంటే విషాన్ని తన శరీరంలో కలిగి ఉన్న వాడని అర్ధం. ఆయన తండ్రి అసితుడు. ఆయనకు ఇద్దరు భార్యలు. ఆయన తన భార్యలతో కలిసి హిమాలయ పర్వతాలలో భృగు ప్రశ్రమణము అనే పర్వతం వద్ద తపస్సు చేయడానికి వెళ్ళిన సమయంలో ఆయన భార్యలిద్దరూ గర్భవతులయ్యారు. రెండవ భార్యకు పిల్లలు కలుగకూడదనే ఆలోచనతో మొదటి భార్య విషాన్ని పెట్టింది. ఆ విషయం తెలుసుకున్న రెండవ భార్య భృగుమహర్షి వద్దకు వెళ్ళి తన కడుపులో పెరుగుతున్న పిండాన్ని కాపాడమని వేడుకుంది. భృగుమహర్షి మహ తపశ్శక్తి సంపన్నుడు, త్రికాలవేది కనుక ఆయన జరిగినది మొత్తం తన యోగ దృష్టితో గ్రహించాడు. పుట్టేవాడు గొప్పవాడవుతాడని ఆశీర్వదించి, తన శరీరంలో విషం కలిగి పుడతాడు కనుక సగరుడవుతాడని చెప్పాడు.  

అటువంటి సగరుడికి ఇద్దరు భార్యలు. మొడటి భార్య పేరు కేశిని. ఆమె ధర్మం తెలిసినది, ధర్మాన్నే ఆచరించేటువంటి లక్షణం కలిగినది, పతివ్రత, మహాసాద్వి. రెండవ భార్య పేరు సుమతి. మంచి సౌందర్య రాశి.ఈమె గరుత్మంతుడి చెల్లెలు. మొదటి భార్యది అంతః సౌందర్యం, రెండవ భార్యది బాహ్య సౌందర్యం.

ఇద్దరు భార్యలు ఉన్నప్పటికి సగర చక్రవర్తికి సంతానం కలుగలేదు. కొంతకాలం పాటు సగర చక్రవత్రి, ఆయన భార్యలు సంతోషంతో కాలం గడిపినా, కాలక్రమంలో వారికి సంతానం లేదన్న భాధ మొదలైంది. వంశం నిలబదన్న దుఖం కలిగింది. ఆ కాలంలో ఏదినా సమస్య వస్తే వెంటనే పెద్దలైనవారు, ఋషులు, గురువుల వద్దకు వెళ్ళేవారు. అందువల్ల సగర చక్రవర్తి బృగు ప్రశ్రమణానికి వెళ్ళి నూరు సంవత్సరముల పాటు కఠోరమైన తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు ప్రీతి చెందిన భృగుమహర్షి సగర చక్రవర్తి వద్దకు వచ్చి, నీవు గొప్ప కీర్తిమంతుడవు అవుతావు, నీ ఇద్దరు భార్యలలో ఒకరికి వంశకరుడు ( వంశాన్ని నిలబెట్టేవాడు/వంశ వృద్ధిని చేసేవాడు ) అయిన కూమారుడు జన్మిస్తాడు. మరొక భార్యకు మహా ఉత్సాహవంతులైన 60,000 మంది కూమారులు జన్మిస్తారు అని ఆశీర్వదించాడు భృగు మహర్షి.

ఎవరికి వంశకరుడు జన్మిస్తాడు, ఎవరికి 60,000 మంది కూమారులి జన్మిస్తారో చెప్పలేదు.రాణూలిద్దరికి కుతూహలం పెరిపోయింది. అది తట్టుకోలేక, ఎవరికి వంశకరుడు జన్మిస్తాడో, ఎవరికి 60,000 మంది జన్మిస్తారో తెలుసుకోవడానికి భృగు మహర్షి వద్దకు వెళ్ళారు.

to be continued..................                                

Wednesday 16 January 2013

గంగావతరణం(1)

ఓం
(1)
గంగేచ యమునెచైవ గోదావరి సరస్వతి.......అంటూ పూజ ప్రారంభంలో గంగా,యమున,గోదావరి,సరస్వతి,నర్మద,సింధు,కావేరి నదులను కలశంలోనికి ఆవాహన చేస్తాం.గంగకు చాలా పవిత్రమైనది. మహాభారతం అనుశాసనిక పర్వంలో ఒక మాట ఉంది. గంగా అంటే ఏమిటని అడగాలన్న, గంగావతరణం కధ వినాలన్నా, గంగావతరణం చెప్పాలన్నా, గంగను చూడాలన్నా, గంగాలో మునక వేయాలన్నా, గంగను త్రాగాలన్నా ఈ 6 పనులు చేయాలన్నా, శివానుగ్రహం ఉంటే తప్ప అది జరుగదు. ఎందుకంటే గంగావతరణం తెలుసుకున్నంత మాత్రం చేతనే కొన్ని వందల జన్మల సంచిత పాపం భస్మం అయిపోతుంది. అంత పరమ పవిత్రమైనది గంగ. సాంబశివుడి అనుగ్రహంతో ఈ పవిత్ర కుంభమేళ సమయంలో గంగ గురించి, గంగా ఎలా అవతరించిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

శ్రీ రామాయణంలో బాలకాండలో శ్రీ రాముడు తాటక సంహారం చేశాక విశ్వమిత్రుడు, రామలక్ష్మణులు శొణా నది తీరం వెంబడి వెళ్తుండగా రాముడు గంగా ఎలా అవతరించిందో చెప్పమని మహర్షిని వేడుకున్నాడు. రాముడికి విశ్వమిత్ర మహర్షి గంగ ఎలా అవతరించిందో సంక్షిప్తంగా చెప్పినా, రాముడు సంతృప్తి చెందక మళ్ళీమళ్ళీ అడిగాడు. తనకు గంగావతరణ ఘట్టం సవివరంగా చెప్పమని ప్రార్ధించాడు శ్రీ రామచంద్రుడు. గంగా ఎలా అవతరించింది, గంగకు "త్రిపధగ" అనే పేరు ఎలా వచ్చిందో చెప్పమని విశ్వామిత్రుడి పాదాలు పట్టుకుని వేడుకోగా, రాముడి ఆతృతకు, తెలుసుకోవాలన్నా తపనకు చలించిపోయిన విశ్వామిత్ర మహర్షి గంగావతరణం గురించి చెప్పారు.

విశ్వమిత్ర మహర్షి దానిని రెండు భాగాలుగా రామాయణంలోని రెండు ప్రక్కప్రక్క సర్గలలో చెప్పారు. మొదటి భాగంలో స్కందోద్పత్తి(సుబ్రహ్మణ్య స్వామి జననం)లో కొంచం చెప్పారు.
హిమవంతుడు(హిమాలయ పర్వతరాజు)కు మేరువు అనే పర్వతం యొక్క కూమార్తే అయిన 'మనోరమ ' భార్య. వారికి ఇద్దరు కూతుర్లు. పెద్ద కూమార్తె గంగా, రెండవ కూమార్తె ఉమ(పార్వతి). ఉమ పరమశివుడి గురించి ఘోరమైన తపస్సుచేసి ఆయన్ను వివాహం చేసుకుంది. దేవతకార్యముల కొరకు మాకు మీ పెద్ద కూతురు గంగా కావాలి అని దేవతలు అడుగగా, హిమవంతుడు అంగీకరించి పెద్ద కూమార్తె గంగను దేవతలతో దేవలోకానికి పంపించాడు. దేవతలే గంగను దేవలోకానికి తీసుకుని వేళ్ళారు. అందువల్ల దేవలోకంలో ప్రవహిస్తూండేది గంగ. ఆ సమయానికి భూమి మీద కాని, రసాతలంలో కాని గంగా ప్రవహించేది కాదు. అటువంటి సమయంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది.
       
to be continued................

Tuesday 15 January 2013

కుంభమేళ

ఓం
జై గంగా మాతా

సనాతన ధర్మం(హిందూ ధర్మం), భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధన విశిష్టవంతమైన అంశం. అందులో భాగంగా గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమం, త్రివేణీ సంగమంగా పిలువబడే ప్రయాగ(అల్లహాబాదు)లో కుంభమేళ జరుగుతున్నది.కుంభమేళకున్న పురాణ ప్రాశస్త్యం ఏమిటి?

(క్లుప్తంగా వివరిస్తున్నా)పూరాణాల ప్రకారం పూర్వం దేవతలు, దానవులు అమృతం కోసం మందరపర్వతాన్ని కవ్వంగా చేసుకుని పాలసముద్రాన్ని చిలికారు. శ్రీ కూర్మ రూపం(తాబేలు)లో శ్రీ మహావిష్ణువు మందర పర్వతాన్ని తన వీపు పై మొయగా, వాసూకిని తాడుగా చేసి, దాని తలను రాక్షసులు, తోకను దేవతలు పట్టుకుని చిలుకగా, అందులో నుండి ఐరావతం, ఉచ్చైశ్రవం(గుర్రం),జ్యేష్ఠా దేవి, లక్ష్మీ దేవి, హాలహలం మొదలైనవి ఉద్భవించిన తరువాత అమృతం బయటకు వచ్చింది. అమృతం కోసం దేవదానవులు కొట్టుకోసాగారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ధరించి, రాక్షసులను దారి మళ్ళించి అమృతబాంఢాన్ని గరుత్మంతుడి మీద పెట్టాడు. అది గమనించిన రాక్షసులు గరుత్మంతుడు మీద యుద్ధం చేయడం, ఆ సమయంలో ఆ అమృత కలశంలో నుంచి నాలుగు అమృత బిందువులు నాలుగు ప్రదేశాల్లో పడడం జరిగింది. ఒక్కొక్క బిందువు 12 సంవత్సరాల తేడాతో అల్లహాబాదు(ఉత్తర ప్రదేశ్), నాసిక్(మహారాష్ట్ర), హరిద్వార్( ఉత్తర ప్రదేశ్), ఉజ్జైని(మధ్య ప్రదేశ్)లో పాడడం వలన ప్రతి 12 ఏళ్ళకు ఒకమారు ఈ ప్రదేశాల్లో ఉన్న నదుల్లో కుంభమేళ ఉత్సవం నిర్వహిస్తారు.

జ్యోతిష్య శాస్త్రం కూడా కుంభమేళ గురించి ప్రస్తావించింది.గురువు మేష రాశిలోనికి, సూర్య చంద్రులు మకర రాశిలోనికి ప్రవేశించిన సమయంలో ప్రయాగలో కుంభమేళ నిర్వహిస్తారు.

జై గంగా మాతా
ఓం శాంతిః శాంతిః శాంతిః                  

Sunday 13 January 2013

పతంగులు

సంక్రాంతి పండుగలో పతంగులు ఎగురవేయడం కనిపిస్తుంది. వీటిని ఎగురవేయడంలో ఆంతర్యం ఏమిటి?

సంక్రాంతితో దక్షిణాయనం ముగుసి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారభంవుతుంది. ఖగోళ శాస్త్ర రీత్యా ఉత్తరాయణంలో సూర్యుడు భూమికి దగ్గరగా జరుగుతాడు. ఆకురాలిన వృక్షాలు తిరిగి చిగురిస్తాయి. సూర్యరశ్మి భూమికి బాగా అందుతుంది. సూర్య్డు భూమికి దగ్గరగా వస్తున్నాడు, ఇక మన జీవితం రంగులమయం అవుతుందని తెలియజేయడానికి చిహ్నంగా రంగురంగుల గాలిపటాలు ఎగురవేస్తారు. మకర సంక్రమణంతో మకర రాశిలోనికి ప్రవేసించే సూర్యభగవానుడి దర్శించే ప్రక్రియ అని కొందరు చెబుతారు.

గాలిపటాలకు వాడే మాంజాలు(దారాలు) గాజుపోడితో తయారుచేస్తారు. అవి పావురాలు, పిచ్చుకలు మొదలైన అనేక రకాల పక్షులకు ప్రాణంతకంగా మారుతాయి. పావురాలు, పిచ్చుకల శరీరాలు అతి సునీతంగా ఉంటాయి. ఈ పదునైన దారం వాటి శరీరాలకు తగలగానే, శరీరభాగాలు తెగిపోయి అవి మరణిస్తాయి. పండుగ పూట హింస చేయడం ఎందుకు? పాపాన్ని మూట కట్టుకోవడం ఎందుకు? అందుకే పదునుగా ఉండే దారాలను వాడకండి.

పతంగుక్లు ఎగురవేసేవారు జాగ్రత్తలు పాటించండి. పిట్టగోడలు చాలా జాగ్రత్తగా ఉండండి. పతంగుల కోసం రోడ్ల మీద పరుగెత్తడం, రోడ్ల మీద పతంగులు ఎగురవేయడం చేసి రోడున్న పోయే వాహానాల వలన ప్రమాదాలకు గురికాకండి.

సంప్రదాయాలను పాటించండి. పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడండి.

సంక్రాంతి పండుగు శుభాకాంక్షలు.              

Friday 11 January 2013

వివేకానంద

ఓం
1000 సంవత్సరాల విదేశీ ఆక్రమణలు, క్రైస్తవ మిషనరీల మతమార్పుడులు,భారతదేశం మీద బ్రిటిష్ ఆక్రమణ, మరొక ప్రక్కన మన హిందూ ధర్మంలో గొప్పతనమేముంది అనుకునే సమయంలో, అంధకారంలో మగ్గుతున్న హిందూ జాతిలో చైతన్యం నింపడానికి జనవరి 12 1863 న భారతదేశంలో ఉధ్భవించిన సూర్యుడు స్వామి వివేకానందుడు. 

ప్రజలలో చైతన్యం, దేశభక్తి నింపి గాంధీ వంటి అనేక దేశభక్తులకు స్పూర్తినిచ్చిన భరతమాత ముద్దుబిడ్డ స్వామి వివేకానంద. 

3000 సంవత్సరాలకు పైగా భారతదేశానికే పరిమితమైన హిందూ ధర్మాన్ని సమస్త ప్రపంచానికి తెలియపరిచారు స్వామి.మన దేశంలో అధ్యాత్మిక సంపదకు లోటు లేదు, అదే విధంగా అనేకమంది పేదలు ఆకలి కేకలకు కూడా లోటు లేదు. మన దగ్గరున్న జ్ఞాన సంపదను విదేశీయులకు అందించి వారి దగ్గరున్న డబ్బుతో పేద భారతీయుల కడుపు నింపాలన్నది వివేకానందుని ఆశయం. అందుకోసం ఆయన అనేక ఇబ్బందులను ఓర్చి, తన మిత్రులు, శిష్యుల చందా డబ్బులతో చికాగోలో జరుగుతున్న ప్రపంచ సర్వమత మహా సభలకు హిందూ ప్రతినిధిగా హజరయ్యారు.

అప్పటివరకు మతం అంటే రక్తపాతం, ఇతర మతాలను తొక్కిపెట్టి పైకిరావడం, పరదేశీయులను పీడించడం అని భావించింది ప్రపంచం. మా మతమే గొప్పది, మిగితావని అబద్దాలు. మిగితా దేవుళ్ళు సైతాన్ లంటూ ప్రచారం చేయడమే మతం అనుకునేవారు. సర్వమతమహాసభలలో కూడా అన్ని మతాలవారు తమ ఆధిపత్యం చూపించడానికి ప్రయత్నించారు. కాని హిందూ ధర్మ ప్రతినిధిగా వెళ్ళి అక్కడా వివేకానందుడు చేసిన ప్రసంగం చారిత్రాత్మికం. ఈనాటికి అది విన్నా, చదివినా హిందువుల హృదయంలొ తెలియని దైర్యం, ఆనందం కలుగుతాయి. ఆ సర్వమత మహాసభలలో చివరివక్తగా స్వామి వివేకానందా అవకాశం తీసుకున్నారు. మొట్టమొదట ఆయన తన ప్రసంగంలో "Sisters and Brothers of America" అనగానే అప్పటివరకు ఎంతో దీనంగా కూర్చున్న 7000 మంది సభికులు తమకేదో ఆయన ఒక క్రొత్త విషయం చెప్పినట్టుగా ఒక్కసారిగా లేచి చప్పట్లు కొట్టారు. 3 నిమిషాలపాటు చపట్ల శబ్దం వినిపిస్తూనే ఉంది. అది తరువాత ఎంతో ధీరంగ్, గంభీరంగా సాగిన వివేకానందా ప్రసంగం విన్న ప్రజలు తమనితాము మర్చిపోయారు. ఆయనతో కరచాలనం చేయడానికి స్ర్తీలు అక్కడున్న బెంచీలు దూకడం మొదలుబెట్టారు. మరొక వింత, ఆయన ప్రసంగం విన్న తరువాత అక్కడకు వచ్చిన Judaism మాతానికి సంబంధించిన jew మతగురువు,స్వామి ప్రసంగం విన్నాక తాను తోలిసారి తన Judaism మతం కూడా సత్యమే అని తెలుసుకున్నాని పలికాడు. అటు తరువాత జనం రోజు స్వామి ఇచ్చే పావుగంట ప్రసంగాల కోసం ఆ సభకు వచ్చి గంటల సమయం వేచి ఉండేవారు. ఆ తరువాత ఆయన ప్రపంచమంతా యాత్రలు చేసి సనాతన ధర్మాన్ని(హిందూ ధర్మాన్ని) విశ్వావ్యాపితం చేశారు. ఈ రోజు మన హిందువులమని గర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే అందుకు కారణం స్వామి వివేకానందుడే.

say it with pride: we are hindus. హిందువునని ప్రపంచానికి గర్వంగా చాటి చెప్పండి అని వివేకానందా ఆనాడే హిందువులకు పిలుపునిచ్చారు. అటువంటి మహోన్నత జ్ఞానజ్యోతి స్వామి వివేకనందుడి 150వ జయంతి 12 జనవరి 2013.


Wednesday 9 January 2013

"మనలో మార్పు రావాలి".


"మనలో మార్పు రావాలి". 
మొత్తానికి ఆయనగారు అరెస్ట్ అయ్యారు.హై కోర్టు మొట్టికాయలు కూడా మొట్టింది. కొద్ది రోజుల క్రితం అతను హిందూవులు,వారి దేవిదేవతల పట్ల చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. అవేమి మనకు కొత్తకాదు.గతంలో హైద్రాబాదులో హనూమాన్ జయంతిని నిషేధించాలని మన రాష్ట్ర అసేంబ్లీలో అన్నాడు. అప్పుడైతే మరీ దరిద్రం. ఏ ఒక్క రాజకీయపార్టీ కూడా ఖండించలేదు. అదేమంటే అప్పుడు ఉప ఎన్నికల హడావుడి కదా, ఖండిస్తే వారి ఓట్లు కోల్పోతామన్నారు. అంతకముందు శ్రీరాముడి గురించి ,కౌసల్య దేవి గురించి కూడా ఇలా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అసలు 80% హిందూ ప్రజానీకం ఉన్న హిందూ దేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం మనలో ఐక్యత లేకపోవడం.మనం కులం, భాష, ప్రాంతం పేరున విడిపోయాం. అసలు మనకు మనమంతా ఒక్కటే అన్న భావన ఉంటే కదా. కొందరు శైవం అంటారు, మరికొందరు శ్రీ వైష్ణవం అంటారు, ఇంకొందరు ఇంకేదో అంటారు. ఉన్న దేవుడు ఒక్కడే అని అందరికి తెలుసు. మనమంతా హిందువులమని తెలుసు. కానీ మనమంతా ఒక్కటని చస్తే ఒప్పుకోము. ఇదే కాదు మనలో మనము రాజకీయ పార్టీల పేరున విడిపోయాము. ఎప్పుడొ 5 ఏళ్లకు ఒక్కసారి వస్తాయి ఎన్నికలు. అప్పుడు మాత్రమే కనిపిస్తారు మన "మేతలు". ఎప్పుడో కనిపించేవారి కోసం మనం రోజు వాదులాడుకుంటాం. ఈ విధంగా మనం ముక్కలు, చెక్కలుగా విడిపొయాం కనుకే "వాళ్ళు" మన మీద అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికైనా మనం మేల్కోవాలి. కులాలను, ప్రాంతాలను, భాషలను, రాజకీయాలను ప్రక్కన పెట్టి మనకోసం, మన సనాతన హిందూ ధర్మాన్ని, భారతదేశాన్ని కాపాడుకోవాలి అంటే మనమంతా ఏకం కావాలి. మనం రాజకీయ పార్టీల గురించి తగాదాలు పడడం కాదు.మనమంతా ఏకమైతే మన ఓట్ల కోసం రాజకీయ పార్టీలు కొట్టుకునే రోజు వస్తుంది. "వాళ్ళంతా" ఐక్యంగా ఉన్నారు కాబట్టే ఈరోజు అన్ని రాజకీయ పార్టిలు మేము "మీకు న్యాయం చేస్తాం"అని వాళ్ళతో అంటున్నాయి. మనకు ఆ రోజు రావాలి. కనీసం ఇప్పటికైనా మొద్దునిద్ర వదిలిపెడదాం. కళ్ళు తెరుద్దాం. మన మధ్య ఉన్న కుల, రాజకీయ, భాష గోడలు కూల్చేద్దాం. ఎంత భిన్నత్వం ఉన్నా మనమంతా హిందువులమని ప్రపంచానికి చాటుదాం. హిందువులం ఐక్యం అవుదాం. కలిసి నడుద్దాం.మన అస్తిత్వాన్ని, మన దేశాన్ని కాపాడుకుందాం.
జై హింద్                  

Monday 7 January 2013

సుబోధ

ఓం
సుబోధ
మాస్టర్ మహాశయ్ సందేహాన్ని తీరుస్తూ శ్రీ రామకృష్ణ పరమహంస,"అనురాగం ఏర్పడినప్పుడు భగవల్లాభం సిద్ధిస్తుంది.  తీవ్ర వ్యాకులత కలిగినట్లయితే, మనస్సంతా భగవంతుని మీదే లగ్నమవుతుంది. అప్పుడు భగవంతుడు తప్పక పలుకుతాడు.మనకు దర్శనమిస్తాడు" అని అన్నారు.
 
"జటిలుడనే చిన్న పిల్లవాడి కధ ఒకటి ఉంది.అతడు పాఠశాలకు కొంతదూరం అడవిమార్గం గుండా వెళ్ళవలసి వచ్చేడి. అలా వెళుతున్నప్పుడు అతడికి భయం వేసేది. అతడు తన భయం గురించి తల్లికి చెప్పాడు. అందుకు ఆమె, 'నువ్వు ఎందుకు భయపడుతున్నావు? మధుసూదనుణ్ణి(శ్రీ మహా విష్ణువు)ను పిలువూ అన్నది. అందుకు ఆ పిల్లవాడు, 'అమ్మా! ఆ మధూసుదనుడెవరు? అని అడిగాడు.'అతడు నీ అన్న ' అని తల్లి బదులు చెప్పింది.

మరునాడు అడవిమార్గంలో వెళుతుండగా జటిలుడికి భయం వేసింది. అప్పుడి వెంటనే'అన్నా! మధూసుధనా!నువ్వెక్కడ ఉన్నావు? ఇక్కడకు రా! నాకు భయం వేస్తొంది 'అని పిలువసాగాడు.ఆర్తితో జటిలుడు పిల్చిన పిలుపుకు మధూసుదనుడు రాకూండా ఉండలేకపోయాడు. 'ఇదుగో!నే నిక్కడ ఉన్నాను తమ్ముడూ! నీకు భయమెందుకు?' అంటూ మాట్లాడుతూ వెళ్ళి పాఠశాల వద్ద వదిలిపెట్టాడు. 'తమ్ముడూ! నువ్వు నన్ను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేస్తాను. భయపడవద్దు ' అని దైర్యం చెప్పి మధూసుదనుడు వెళ్ళిపోయాడు.

విశ్వాసం వ్యాకులత ఉంటే తప్పక భగవంతుడు అనుగ్రహిస్తాడు.
సేకరణ ('శ్రీరామకృష్ణ కధామృతం ' నుండి)-శ్రీ రామకృష్ణప్రభ,ఆధ్యాత్మిక మాసపత్రిక
   

Sunday 6 January 2013

మన దేవాలయాలు-6

ఓం గం గణపతయే నమః
ఆదివారం-ప్రత్యేకం 
మన దేవాలయాలు-6
దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాల రక్షణే మన రక్షణ)


ఆలయ ప్రవేశంలో గోపురం దాటగానే,మనకు కనిపించేది ధ్వజస్థంభం.ధ్వజస్థంభం ప్రాముఖ్యత ఏమిటి?

ధ్వజస్థభం భూలోకానికి,స్వర్గలోకానికి మధ్య వారధి.అంతరిక్షంలో ఉన్న దైవ శక్తులను దేవాలయంలోనికి ఆహ్వానిస్తుంది.అనతమైన విశ్వంలో ఉండే దివ్యశక్తులను,కాస్మిక్ కిరణాలను దేవాలయంలోకి తీసుకువచ్చేందుకు దోహదపడుతుంది.ధ్వజస్తంభానికి పైన ఉండే గంటలు కూడా పాజిటివ్ ఎనర్జిని ఆకర్షిస్తాయి.

ధ్వజస్థభం ఆలయ నిర్మాణాన్ని పిడుగుపాటు నుండీ రక్షిస్తుంది.అది ఆలయంకంటే ఎత్తులో ఉండడం వలన అది విద్యుత్ శక్తిని గ్రహించి,భూమిలోకి పంపించివేసి,ఆలయాన్ని కాపాడుతుంది.

ధ్వజస్థభం ప్రతిష్ట ముందు దానిక్రింద పంచలోహాలు(బంగారం,వెండి,ఇత్తడి,రాగి,కంచు)ను వేస్తారు.అవి భూమిలోపల ఉన్న విద్యుత్ అయస్కాంత శక్తి(electro-magnetic energy)ని గ్రహిస్తాయి.అందుకే ధ్వజస్థభం వద్ద విద్యుత్ అయస్కాంత్ క్షేత్రం(electro-magnetic energy) ఏర్పడుతుంది.అంతేకాదు ద్వజస్థభానికి వేసే పంచలోహ్ల తొడుగు కూడా విద్యుత్ అయస్కాంత్ శక్తిని గ్రహించి ఈ క్రింద ఏర్పడిన విద్యుత్ ఆయస్కాంత్ క్షేత్రానికి మరింత శక్తిని చేకూరుస్తుంది.దాని దగ్గరకు వెళ్ళి నమస్కరించడం వలన మన శరీరానికి కావలసిన శక్తి అందుతుంది.ధ్వజస్థంభం వద్ద ఉండే బలిపీఠం ఈ విద్యుత్ అయస్కాంత శక్తిని అత్యధికంగా నిలువ ఉంచుకునే ప్రదేశం.

ధ్వజం అంటే జెండా.బ్రహ్మోత్సావాల సమయంలో ధ్వజారోహణం పేరున ధ్వజస్థంబానికి జెండాను ఎగిరేస్తారు.దీనికి ఎగురేసిన జెండా దేవలోకంలో ఉన్న సమస్త దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తుంది.

ధ్వజస్తంభం అడుగుభాగంలో శివుడు,మధ్యభాగంలో బ్రహ్మ,పై భాగంలో శ్రీ మహావిష్ణువు కోలువై ఉంటారు.విశ్వాసం శ్వాస కంటే గొప్పది.వేదం పరమాత్ముడి శ్వాస.నాలుగు వేదాలకు ప్రతీక ఆ నిలువెత్తు ద్వజస్థంభం.

మనం దేవాలయంలోనికి ప్రవేశించే ముందే ఆలయం బయట మనలో ఉన్న చెడు భావనలను,ఒత్తిళ్ళను విడిచిపెట్టి ప్రవేశిస్తాం.ధ్వజస్థంభం దగ్గరకు రాగానే,మనలో మిగిలి ఉన్న చెడు భావనలను,అహకారాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి.

ధ్వజము అంటే మరొక అర్ధం పతాకం అని.మనిషికి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు,అతనికి అత్యున్నతమైన ఆలోచనలు కలుగుతాయి.అవి అతనిని పతాక స్థాయికి తీసుకువెళతాయని,అతను జీవితంలో అత్యున్నతస్థాయిలో నిలబడతాడని గుర్తుచేస్తుంది ధ్వజస్థంభం.

ఇంత ప్రాముఖ్యం ఉన్న ద్వజస్థంభానికి ఏదో ఒక చెట్టు మాను తీసువచ్చి పెట్టరు.ఆగమశాస్త్రం ప్రకారం ధ్వజస్థంభానికి వాడే మానుకు కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి.ఆ మానుకు ఎలాంటి తొర్రలు ఉండకూడదు.కొమ్మలు ఉండకూడదు.ఎలాంటి పగుళ్ళుఉండకూడదు.ఏ మాత్రం వంకరగా ఉండకూడదు.సుమారు 50  అడుగులకంటే ఎత్తు ఉండాలి.ఇలాంటి మానునే ధ్వజస్థంభానికి ఉపయోగించాలి అని ఆగమశాస్త్రం చెబుతోంది.

దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాల రక్షణే మన రక్షణ)

ఓం శాంతిః శాంతిః శాంతిః
to be continued.............